పూజా హెగ్డే

భారతీయ సినీ నటి‌‌ మరియు మోడల్ From Wikipedia, the free encyclopedia

పూజా హెగ్డే

పూజా హెగ్డే (జననం: అక్టోబరు 13, 1990) ఒక భారతీయ మోడల్, నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. దీని తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది.[3]ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది.ప్రస్తుతం పూజ రాధేశ్యామ్‌‌ చిత్రం లో నటిస్తుంది.[4]

త్వరిత వాస్తవాలు పూజా హెగ్డే, జననం ...
పూజా హెగ్డే
పూజా హెగ్డే 2022 లో
జననం (1990-10-13) 1990 అక్టోబరు 13 (age 34)[1]
జాతీయతభారతీయురాలు
విద్యఎం.కాం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
ఎత్తు5 అ. 8 అం. (173 cమీ.)[2]
మూసివేయి

పూజా హెగ్డే కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా హాజ‌రు కానున్నారు. 2022 మే 17 నుంచి 28 వ‌ర‌కు ఈ వేడుక‌లు ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరగనున్నాయి.

బాల్యం

పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే లది కర్ణాటక లోని మంగుళూరు కానీ ఆమె ముంబై లో పుట్టి పెరిగింది. ఆమె తన మాతృ భాషయైన తుళు తో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడగలదు.[5] ఆమె కాలేజీలో చదివేటపుడు తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేది. దాంతో ఆమెకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది. అప్పుడే ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీల్లో, డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేది.[6]

సినిమాలు

Key
Denotes films that have not yet been released
మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...
సంవత్సరం సినిమా పాత్ర భాషా Notes Ref.
2012 మాస్క్ శక్తి తమిళ తమిళ అరంగేట్రం [7]
2014 ఒక లైలా కోసం నందన తెలుగు తెలుగు అరంగేట్రం [8]
ముకుంద గోపిక తెలుగు [9]
2016 మొహెంజో దారో చానీ హిందీ హిందీ అరంగేట్రం [10]
2017 దువ్వాడ జగన్నాథం పూజ[11] తెలుగు [12]
2018 రంగస్థలం ఆమెనే తెలుగు "జిగేలు రాణి" పాటలో ప్రత్యేక పాత్ర [13]
సాక్ష్యం సౌంద‌ర్య‌ల‌హ‌రి తెలుగు [14]
అరవింద సమేత వీర రాఘవ అరవింద తెలుగు [15]
2019 మహర్షి పూజా తెలుగు [16]
గద్దలకొండ గణేష్ శ్రీదేవి తెలుగు [17]
హౌస్‌ఫుల్ 4 రాజకుమారి మాల / పూజా హిందీ [18]
2020 అల వైకుంఠపురములో అమూల్య తెలుగు [19]
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ విభా తెలుగు [20]
2022 రాధేశ్యామ్‌ డాక్టర్ ప్రేరణ చక్రవర్తి తెలుగు

హిందీ

ద్విభాషా చిత్రం [21]
[22]
బీస్ట్ ప్రీతి తమిళం
ఆచార్య నీలాంబరి తెలుగు [23]
ఎఫ్ 3 తెలుగు "లైఫ్ అంటే ఇట్టా వుండాలా" పాటలో స్పెషల్ అప్పియరెన్స్
సిర్కస్ మాలా హిందీ
2023 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ భాగ్యలక్ష్మి గుండమనేని హిందీ
2025 దేవా దియా సతాయే హిందీ
రెట్రో టిబిఎ తమిళం పోస్ట్-ప్రొడక్షన్
జన నాయగన్ టిబిఎ తమిళం చిత్రీకరణ
హై జవానీ తో ఇష్క్ హోనా హై టిబిఎ హిందీ చిత్రీకరణ
కాంచన 4 టిబిఎ తమిళం చిత్రీకరణ
మూసివేయి

పురస్కారాలు

మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం Ref.
2013 మాస్క్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ తొలి నటి – తమిళ ప్రతిపాదించబడింది [24]
2015 ఒక లైలా కోసం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ తొలి నటి – తెలుగు ప్రతిపాదించబడింది [25]
2015 దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి – తెలుగు ప్రతిపాదించబడింది [26]
2016 మొహెంజో దారో స్టార్‌డస్ట్ పురస్కారాలు ఉత్తమ తొలి – నటి ప్రతిపాదించబడింది [27]
2017 దువ్వాడ జగన్నాథం జీ గోల్డెన్ అవార్డులు ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ (నటి) గెలుపు [28]
2019 అరవింద సమేత వీర రాఘవ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి – తెలుగు ప్రతిపాదించబడింది [29][30]
2020 మహర్షి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి – తెలుగు ప్రతిపాదించబడింది [31]
2020 జీ సినీ అవార్డ్స్ తెలుగు ఇష్టమైన నటి గెలుపు [32]
2021 అల వైకుంఠపురములో సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు ఉత్తమ నటి గెలుపు [33][34]
2021 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి – తెలుగు గెలుపు [35]
2022 మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి – తెలుగు విజేత
మూసివేయి


మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.