న్యూజీలాండ్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్లాక్ క్యాప్స్ అని దీనికి పేరు. 1930లో ఇంగ్లండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో తమ మొదటి టెస్టు ఆడారు. టెస్టు క్రికెట్ ఆడిన ఐదవ దేశం అది. 26 ఏళ్ళ తరువాత, 1956 లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో తొట్ట తొలి టెస్టు విజయం సాధించారు.[13] న్యూజీలాండ్ తమ మొదటి వన్డేని 1972-73 సీజన్లో పాకిస్తాన్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో ఆడారు.
త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
న్యూజిలాండ్దస్త్రం:Logo of cricket New zealand Team.png |
మారుపేరు | బ్లాక్ క్యాప్స్,[1] కివీస్[2] |
---|
అసోసియేషన్ | న్యూజీలాండ్ క్రికెట్ |
---|
|
టెస్టు కెప్టెన్ | టిమ్ సౌథీ |
---|
ఒన్ డే కెప్టెన్ | కేన్ విలియమ్సన్ |
---|
Tట్వంటీ I కెప్టెన్ | కేన్ విలియమ్సన్ |
---|
కోచ్ | గ్యారీ స్టెడ్ |
---|
|
టెస్టు హోదా పొందినది | 1930 |
---|
|
ICC హోదా | పూర్తి సభ్యత్వం (1926) |
---|
ICC ప్రాంతం | ఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్ |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[3] |
అత్యుత్తమ |
---|
టెస్టులు |
5వ |
1వ (6 జనవరి 2021)[4] |
---|
వన్డే |
5వ |
1వ (3 మే 2021)[5] |
---|
టి20ఐ |
3వ |
1వ (4 మే 2016)[6] |
---|
|
|
మొదటి టెస్టు | v. ఇంగ్లాండు లాంకాస్టర్ పార్క్ (క్రైస్ట్‌చర్చ్) లో; 1930 జనవరి 10-13 |
---|
చివరి టెస్టు | v. శ్రీలంక బేసిన్ రిజర్వ్, (వెల్లింగ్టన్) లో; 2023 మార్చి 17–20 |
---|
టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[7] |
464 |
112/182 (170 డ్రాలు) |
---|
ఈ ఏడు[8] |
5 |
3/1 (1 డ్రా) |
---|
|
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–21) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2019–21) |
---|
|
తొలి వన్డే | v. పాకిస్తాన్ లాంకాస్టర్ పార్క్, క్రైస్ట్‌చర్చ్ వద్ద; 1973 ఫిబ్రవరి 11 |
---|
చివరి వన్డే | v. భారతదేశం వాంఖెడే స్టేడియం (ముంబయి) లో; 2023 నవంబరు 15 |
---|
వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[9] |
821 |
377/394 (7 టైలు, 43 ఫలితం తేలలేదు) |
---|
ఈ ఏడు[10] |
30 |
13/16 (0 టైలు, 1 ఫలితం తేలనివి) |
---|
|
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975) |
---|
అత్యుత్తమ ఫలితం | రన్నరప్ (2015, 2019) |
---|
|
తొలి టి20ఐ | v. ఆస్ట్రేలియాఈడెన్ పార్క్, (ఆక్లాండ్) లో; 2005 ఫిబ్రవరి 17 |
---|
చివరి టి20ఐ | v. ఇంగ్లాండు ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్; 2023 సెప్టెంబరు 5 |
---|
టి20ఐలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[11] |
200 |
102/83 (10 టైలు, 5 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[12] |
18 |
9/7 (1 టైలు, 1 ఫలితం తేలనిది) |
---|
|
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 7 (first in 2007) |
---|
అత్యుత్తమ ఫలితం | రన్నరప్ (2021) |
---|
|
|
|
As of 2023 నవంబరు 15 |
మూసివేయి
2022 డిసెంబర్లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో టీ20ఐలో కేన్ విలియమ్సన్ ప్రస్తుత జట్టు కెప్టెన్, టిమ్ సౌథీ ప్రస్తుత టెస్టు కెప్టెన్. జాతీయ జట్టును న్యూజీలాండ్ క్రికెట్ నిర్వహిస్తుంది.
1998 జనవరిలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టును బ్లాక్‌క్యాప్స్‌గా పిలుస్తున్నారు. అప్పట్లో జట్టు స్పాన్సరైన క్లియర్ కమ్యూనికేషన్స్, జట్టుకు ఒక పేరును ఎంచుకోవడానికి ఒక పోటీని నిర్వహించగా ఈ పేరు ఎంపికైంది.[14] ఆల్ బ్లాక్స్‌కు సంబంధించిన అనేక జాతీయ జట్టు మారుపేర్లలో ఇది ఒకటి.
2022 నవంబరు 25 నాటికి, న్యూజీలాండ్ 1429 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 566 గెలిచింది, 635 ఓడిపోయింది. 16 టై, 168 డ్రాలూ అయ్యాయి. 44 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. [15] ఐసీసీ ప్రకారం న్యూజీలాండ్ టెస్టుల్లో 5వ స్థానంలో, వన్డేల్లో 1వ స్థానంలో, టీ20 ల్లో 5వ స్థానంలో ఉంది. [16]
2022 నాటికి జట్టు, 1975 నుండి జరిగిన మొత్తం 29 ఐసిసి పురుషుల ఈవెంట్లలోనూ పాల్గొంది. ఆరు ఫైనల్ మ్యాచ్‌లు ఆడి, రెండు టైటిళ్లను గెలుచుకుంది. 2000 అక్టోబరులో భారత్‌ను ఓడించి నాకౌట్ ట్రోఫీని గెలుచుకుంది. అది వారి తొలి ఐసిసి టైటిల్. 2015 లో దక్షిణాఫ్రికాను ఓడించి, న్యూజీలాండ్ తమ తొలి CWC ఫైనల్‌కు చేరుకుంది.[17] తర్వాతి ఎడిషన్‌లో భారత్‌ను ఓడించి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. [18] తర్వాత 2021 జూన్‌లో వారు భారతదేశాన్ని ఓడించి ప్రారంభ WTCని గెలుచుకుంది. ఐదు నెలల తర్వాత వారు ఇంగ్లండ్‌ను ఓడించి, తమ తొలి T20 WC ఫైనల్‌కు చేరుకుంది.