![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/Tim_Southee_3.jpg/640px-Tim_Southee_3.jpg&w=640&q=50)
టిమ్ సౌథీ
From Wikipedia, the free encyclopedia
తిమోతీ గ్రాంట్ సౌథీ (జననం 1988 డిసెంబరు 11), న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆటలోని అన్ని ఫార్మాట్లలో ఆడే అంతర్జాతీయ క్రికెటరు. న్యూజీలాండ్ టెస్టు జట్టుకు అతను కెప్టెన్, T20I జట్టుకు వైస్ కెప్టెన్. అతను కుడి-చేతి ఫాస్ట్-మీడియం బౌలరు, బాగా షాట్లు కొట్టే దిగువ వరుస బ్యాటరు. 300 టెస్టు వికెట్లు తీసిన మూడవ న్యూజిలాండ్ బౌలరు. 2008 ఫిబ్రవరిలో 19 సంవత్సరాల వయస్సులో రంగప్రవేశం చేసిన దేశంలోని అతి పిన్న వయస్కులలో ఒకడు. ఇంగ్లండ్‌పై టెస్టు రంగప్రవేశం చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 40 బంతుల్లో 77 పరుగులు చేయడమే గాక, 5 వికెట్లు పడగొట్టాడు. [1] అతను ప్లంకెట్ షీల్డ్, ఫోర్డ్ ట్రోఫీ, సూపర్ స్మాష్‌లలో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున అలాగే హాక్ కప్‌లో నార్త్ల్యాండ్కు ఆడతాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి T20Iకి అతను న్యూజిలాండ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[2] ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. [3] సౌథీ 2019–2021 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడు.
![]() 2009 లో సౌతీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | టిం గ్రాంట్ సౌథీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1988-12-11) 1988 డిసెంబరు 11 (వయసు 35) వంగారే, నార్త్‌లాండ్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Bowling ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 237) | 2008 మార్చి 22 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 17 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 150) | 2008 జూన్ 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 జనవరి 13 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 38 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 30) | 2008 ఫిబ్రవరి 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 38 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–present | నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | ఎసెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | మిడిల్సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | London Spirit | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 01 September 2023 |
సౌథీ చురుకైన వేగంతో లేట్ అవుట్స్వింగ్ని సృష్టించగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. తర్వాత తడిగా ఉన్న వికెట్‌పై, చివరి ఓవర్లలో, వేగంగా వేసే ఆఫ్ స్పిన్నరు లాగా స్లో కట్టర్లను వేస్తాడు. అతను 2011 ఐసిసి ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలరు (17.33 సగటుతో 18 వికెట్లు). 2015 ఐసిసి ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి, ఆకట్టుకున్నాడు. [4] ఈ ప్రదర్శనను విస్డెన్, ఆ దశాబ్దపు వన్డే స్పెల్‌గా పేర్కొంది. [5]