![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2a/Kane_Williamson_in_2019.jpg/640px-Kane_Williamson_in_2019.jpg&w=640&q=50)
కేన్ విలియమ్సన్
From Wikipedia, the free encyclopedia
కేన్ స్టూవర్ట్ విలియమ్సన్ (జననం 1990 ఆగస్టు 8) న్యూజిలాండ్ క్రికెటరు. పరిమిత ఓవర్ల క్రికెట్లో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2023 ఫిబ్రవరి 27న, విలియమ్సన్ టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ తరపున సార్వకాలిక అత్యధిక పరుగుల బ్యాటరయ్యాడు. [1] అతను కుడిచేతి వాటం బ్యాటరు. అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలరు. ఆధునిక యుగంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడిగా అతన్ని పరిగణిస్తారు.
![]() 2019 లో విలియమ్సన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కేన్ స్టూవర్ట్ విలియమ్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1990-08-08) 1990 ఆగస్టు 8 (వయసు 33) టారంగా, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Top-order batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 248) | 2010 నవంబరు 4 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 17 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 161) | 2010 ఆగస్టు 10 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 జనవరి 13 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 22 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 49) | 2011 అక్టోబరు 16 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 20 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 22 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–present | నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | గ్లౌసెస్టర్షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–2018 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2022 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | బార్బడాస్ ట్రైడెంట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | గుజరాత్ టైటాన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 20 |
విలియమ్సన్ 2007 డిసెంబరులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ రంగప్రవేశం చేసాడు [2] అదే సంవత్సరం పర్యటనలో ఉన్న భారత U-19 జట్టుతో U-19 రంగప్రవేశం చేసాడు. 2008 U-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ U-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2010లో అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. విలియమ్సన్ క్రికెట్ ప్రపంచ కప్ 2011, 2015, 2019 ఎడిషన్లలోను, ICC వరల్డ్ ట్వంటీ20 2012, 2014, 2016, 2021 ఎడిషన్లలోనూ న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారతదేశంలో 2016 ICC వరల్డ్ ట్వంటీ 20లో న్యూజిలాండ్ తరపున తన పూర్తి స్థాయి కెప్టెనుగా రంగప్రవేశం చేసాడు. అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించి, జట్టును ఫైనల్‌కి నడిపించాడు. ఈ ప్రక్రియలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. 2020 డిసెంబరు 31న, అతను టెస్టు బ్యాటింగ్ రేటింగ్ 890కి చేరుకుంది. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలను అధిగమించి ప్రపంచంలోనే నంబరు వన్ టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [3] [4] అతను దశాబ్దపు ICC పురుష క్రికెటర్‌గా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డుకు, దశాబ్దపు టెస్టు క్రికెటరు అవార్డుకు ఎంపికయ్యాడు. ఇయాన్ చాపెల్, మార్టిన్ క్రోవ్ ప్రస్తుత యుగంలోని జో రూట్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలతో పాటు టాప్ నాలుగు లేదా ఐదు టెస్టు క్రికెట్ బ్యాట్స్మెన్లలో విలియమ్సన్‌ను చేర్చారు. [5] [6] [7]
ICC టెస్టు టీమ్ ఆఫ్ ది డికేడ్ (2011–2020)లో పేరు పొందిన ఏకైక న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్. [8] దివంగత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, మార్టిన్ క్రో, విలియమ్సన్లో "బహుశా మన దేశపు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఉదయించడాన్ని చూస్తున్నాం" అని పేర్కొన్నాడు. [9] 2021 జూన్‌లో, అతను ప్రారంభ ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడానికి న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించాడు. 2000 ICC నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఇది, జట్టు గెలిచిన మొదటి ICC ట్రోఫీ. 2021 నవంబరులో, అతను ICC T20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు నడిపించాడు.