విష్ణు పురాణం (ఆంగ్లం: Vishnu Puranam) చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.

త్వరిత వాస్తవాలు వేదములు (శ్రుతులు), వేదభాగాలు ...
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం
మూసివేయి

విష్ణు పురాణ విశేషాలు

  • ముందుగా విష్ణుమూర్తిని సర్వాంతర్యామిగా కీర్తించి తరువాత అతడి నుండి ప్రపంచం ఉద్భవించిన తీరు చెప్పబడింది. విరాట్పురుషుడి నుండి అవ్యక్తము దాని నుండి ఆత్మ, దాని నుండి బుద్ధి, దాని నుండి మనసు దాని నుండి ఆకాశం దాని నుండి వాయువు, దాని నుండి తేజస్సు, దాని నుండి జలము దాని నుండి హిరణ్మయమైన అండము (భూమి) ఉద్భవించాయని చెప్పబడింది.#విశ్ణుమూర్తి
  • తరువాత తనకు తానుగా శరీరమును గ్రహించి ముందుగా రజోగుణ సంపన్నుడై బ్రహ్మగా జగత్తు సృష్టి చేయబడింది. దేవ దానవులు మానవులు, సప్త సముద్రాలు, సప్త ద్వీపములు సృష్టించి సత్వగుణ ప్రధానుడై లక్ష్మితో పాల సముద్రం మీద ఆది శేషుని మీద కొలువుండి లోక పాలన చేయసాగాడు. ముందుగా వరాహా మూర్తి అయి భూమిని ఉద్ధరించి యోగ నిద్రలో లోకములోని ప్రాణుల కర్మలను దివ్య దృష్టితో అవలోకిస్తున్నాడని చెప్పబడింది.
  • తరువాత తమోగుణ సంపన్నుడై హరుడై ఈ లోకములను ఈ లోకములోని సంహార క్రియ చేపట్టాడు.
  • తరువాత భూమి ఉద్ధరించిన యజ్ఞ వరాహ మూర్తి వర్ణన జరిగింది. అతడి నాలుగు పాదములు నాలుగు వేదములు, కోరలు ఊపష్తంభములు, నాలుగు ముఖములు బ్రహ్మ నాలుగు శీస్సులు, నాలుక అగ్నిదేవుడు, నేత్రములు రాత్రి పగలు, రోమములు ధర్భలు, ఆజ్యము ముక్కు, తోడము స్రువం, ధ్వని సామ ఘోష, స్వేదం సత్య తేజస్సు, కర్మ విక్రమము, లింగము హోమము, ఫలబీజములు ఓషధులు, అంతరాత్మ వాయువులు, స్థులు మంత్రములు, రక్తం సోమము, మూపులు వేదములు, హవిస్సు గంధం, ఇష్టి ఆయన తళుకులు ఇలా ఆయన శరీరం యజ్ఞా దీక్షా సహితంగా వర్ణించ బడింది.
  • తర్వాత కొలమాన వర్ణన చేయబడింది. సూర్యుడు కిటికీ నుండి ప్రసరించే వెలుగులో కనిపించే పరాగ రేణువు త్రసరేణువు. ఇది మొదటి కాల గణన. 8 త్రస రేణువులు ఒక లిక్ష, 3 లిక్షలు ఒక రాజసర్షం, మూడు రాజసర్షలు ఒక గౌర సర్షం, ఆరు గౌర సర్షలు ఒక యవ, ఎనిమిది యవలు ఒక అంగుళం, పన్నెండు అంగుళములు ఒక శంకువు (అడుగు), రెండు శంకులు ఒక హస్తం (మూర), నాలుగు హస్తములు ఒక ధనస్సు, వేయి ధనస్సులు ఒక క్రోసు, రెండు క్రోశములు ఒక గవ్యూతి, నాలుగు గవ్యూతులు ఒక ఒక యోజనము, ఎనిమిది వందల వేల గవ్యూతులు ఒక శేషస్థానం ఉంది.
  • తరువాత పాతాళ, రుద్ర, సుతల, గభస్తితలం, మహాతలం, భీమ తలం మొదలైన పాతాళాల వర్ణ అక్కడ నివసించే వారి వర్ణన జరిగింది.
  • తరువాత పైలోకాల వర్ణ జరిగింది. మానవులు నివసించే భూలోకము, దేవతలు ఉండే భువర్లోకం, గోలోకమైన మహార్లోకం, బ్రహ్మ రార్తి సమయంలో అక్కడ జీవులు ఉంటారు. మహాత్ములుండే తపో లోకం, బ్రహ్మ నివసించే సత్య లోకం మొదలైన ఊర్ధ్వ లోకాల వర్ణనలు జరిగింది.
  • తరువాత మేరు పర్వతం, లవణ సముద్రం చేత ఆవరించబడిన జంబూద్వీపం, పాల సముద్రం చేత ఆవరింప బడిన శాకాద్వీపం, నేతి సముద్రంతో ఆవరింప బడిన కుశ ద్వీపం, మీగడ సముద్రంతో ఆవరింప బడిన క్రౌంచ ద్వీపం, సురా సముద్రంతో ఆవరింపబడిన శాల్మల ద్వీపం, దానిని ఆవరించిన గోమేధం ఉంది.
  • పుష్కర ద్వీపము నడుమన మానసోత్తర పర్వతం ఉంది. మేరువుకు అది తూర్పున ఉంది. ఆగ్నేయమున అగ్ని రాజధాని ప్రభావతీ నగరం, దక్షిణమున సంయమనీపురం, నైరుతి మూల విరూపాక్షుని విక్రాంత పురం ఉన్నది, పడమట వరుణ రాజధాని సుఖప్రభ, వాయవ్య మూల వాయవ్య రాజధాని శివ, ఉత్తరమున సోముని రాజధాని విభావరి, ఈశాన్యమున శివుని పురి శర్మదాపురి ఉంది.
  • పుష్కర ద్వీపం, స్వర్ణద్వీపం, లోకాలోక వర్ణన, గర్భోదక సముద్రం దాని అందు నివసించు వారి వర్ణన జరిగింది.
  • మేరువుకు తూర్పున ఉప్పుసముద్రం నడుమ జలములో విష్ణుతేజస్సుతో వెలిగే విష్ణులోకం ఉంది. మేరువుకు తూర్పున ఉన్న క్షీరాబ్ధి మధ్యలో విశ్హ్ణువు లక్ష్మీ సమేతుడై ఉండి హస్తదర్శనం మాత్రమే ఇస్తాడు. మేరువుకు తూర్పున పాలకడలి నడుమ శ్వేతద్వీపమందు విష్ణువు శిరస్సు చేత పంచకాల పూజలు అందుకుంటాడు.

శ్వేతద్వీపమున ప్రవేశించిన జీవులు తరువాత ఆదిత్యమండలము ద్వారా బ్రహ్మలో ప్రవేశించి అనిరుద్ధుని, సంకర్షుని పొంది చివరకు వాసుదేవుడిని పొంది ముక్తులౌతారని చెప్పబడింది.

  • క్షీర సముద్ర ఈశాన్య దిక్కున ఆది విష్ణువు భృగ్వాది మునులు, శరీరధారులైన శాస్త్రములు, లక్ష్మాది దేవతల చేత కొలువబడుతూ ఉంటాడు. అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువు ఉచ్వాస నిస్వాసలలో జీవుల పుట్టుక మరణం సంభవిస్తుంది.
  • మేరువుకు పడమట ఘృత సముద్రముకు నడుమ ఉన్న గోవర్ధన గిరిలో దివ్యధేనువులు ఉంటాయి. అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తుంటాడు.
  • దధిసముద్రం నడుమ మహాతేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణ రూపుడై ప్రకాశిస్తుంటాడు. సురాసముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశమున సంకర్షణుడనే పేరుతో విష్ణువును మదిర, కరీషిణి, కాంతి అను ముగ్గురు దేవతలు పరమసౌందర్యవతులై సేవిస్తుంటారు. అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు..

జంబుద్వీప వర్ణన

  • జంబుద్వీపము అంటే తూర్పు, పడమరలలో సముద్రాలు రెండు చొచ్చుకుని ఉన్నాయి.
  • అందు రత్ననిధులైన ఆరు కుల పర్వతములు ఉన్నాయి. అవి హిమవంతం, హేమకూటం, నిషిధం, నీలం, మేరువు, శృంగవంతం.
  • నీల నిషిధముల నడుమ ఉన్న వర్తులాకార సువర్ణమయ ప్రదేశం మేరువు అని పిలువబడుతుంది. దీని వైశాల్యం తొంభైవేల యోజనములు.
  • మేరువుకు తూర్పున వేయి యోజనముల మాల్యవంతం అనే పర్వతమున్నది.
  • నీలపర్వతం, నిషిధపర్వతం మధ్యన పడమట ఎంత పొండవు ఉన్నదో అంత పొడవున తూర్పుగా గంధమాధన పర్వతం ఉంది.
  • మేరువుకు ఉత్తరముగా శ్వేతపర్వతం ఉంది. తూర్పున అనంతపర్వతం, దక్షిణమున పీత (పసుపు వర్ణం) పర్వతం, పడమట కృష్ణపర్వతం ఉంది.
  • మేరువు మీద తూర్పున శ్వేతపర్వతాన్ని చూస్తూ అమరావతి నగరం. ఉంది. అష్ట దిక్కుల అందు దిక్పాలకులు ఉన్నారు.

భారత వర్షం

  • భారత వర్షం తొమ్మిది భాగములు. వాటిలో ఎనిమిది అగమ్యములైన గిరులు ఉన్నాయి. హిమాచలం నుండి దక్షిణమున సముద్రం వరకు అవి విస్తరించి ఉన్నాయి. స్వమాలి, హేమమాలి, శంభువు, సువర్ణనిధి, వైడూర్యగిరి, రాజతగిరి (వెండికొండ, మణుమంతము, ఇంద్రద్యుమ్నము ఇది తామ్ర వర్ణం.
  • హిమాలయములలో గంధమాదన, కైలాస గిరి, నరనారాయణాశ్రమం, బదరి ఉన్నాయి. అక్కడ గంగ స్వచ్ఛమైన తెల్లని వేడి నీటిని ఇస్తుంది.
  • అది కర్మ భూమి. అందు లెక్కించనలవి గాని అంతర్ద్వీపములున్నాయి. అక్కడ ఫలముల నిచ్చు వృక్షములు, రూపవతులగు స్త్రీలు, దండింనవసరం లేని సన్మార్గులైన మానవులు ఉన్నారు.
  • మధ్య దేశమున పాంచాల, మత్స్య, యౌధేయ, కుంతి, కురు, శూరసేనులు ఉన్నారు. తూర్పున వృషధ్వజ, అంజన, పన్నులు, సుహ్మ, వెదేహ, కాశ, ఛేది, మాగద, కోసలులు ఉన్నారు.వింధ్య పర్వతానికి ఆగ్నేయమున కళింగ, వంగ, పుండ్ర, అంగ, వైదర్భ, మూలకులు ఉన్నారు. దక్షిణమున పులింద, నరరాష్ట్ర, అశ్మక, జీమూత, కర్నాటక, భోజకటకులు ఉన్నారు. నైరుతిలో ద్రావిడ, నాగ, స్త్రీముఖ, కాంభోజ, శకులు, అనంత వాసులు ఉన్నారు. పడమట స్త్రీ రాజ్యం, సైంధవ, మ్లేచ్ఛులు, నాస్తికులు, యవనులు, పటుములు, నైషధములు ఉన్నారు. వాయవ్యమున తుషార, మూలిఖ, ఖశ, మఖ, మహాకోశులు, మహావాసులు ఉన్నారు. లంపగులు, తాళులు, నాగులు, మరుగాంధార, జాహుతులు హమవన్నివాసులు. ఈశాన్యమున త్రిగర్త, బ్రహ్మపుత్రులు, మీన, సతూగణ, కౌలూత, అభిసార, కాశ్మీరులు ఉన్నారు.
  • మహేంద్రపర్వమున ఋషికుల్య, ఇక్షుగ, త్రిదివాలయ, లాంగూలి, వంశధార నదులు ఉన్నాయి.మలయ పర్వతమున కృతమాల, తామ్రపర్ణి, పుష్పజ, ఉత్పలావతి, శితోదక, గిరివహా నదులు ఉన్నాయి.సహ్య పర్వతమున తుంగభద్ర, ప్రకార, వాహ్య, కావేరి నదులు ఉన్నాయి. శుక్తిమతీ పర్వతమున ఋషిక, సుకుమారి, మందగ, మందవాసిని, నృపమాల, శిరి నదులు ఉన్నాయి. ఋక్షవత్పర్వమున మందాకిని, అశార్ణ, శోణ, దేవి, నర్మద, తమస, పిప్పిల అను నదులు ఉన్నాయి. వింధ్య పర్వతమున వేణి, వైతరిణి, నర్మద, కుమద్వతి, తోయ, సేతుశిల నదులు ఉన్నాయి. పారియాత్రా పర్వతమున పారా చర్మణ్వతి, పాద విదిశ, వేణువతి, సిప్రా, అవంతి, కుంతి నదులు ఉన్నాయి.
  • హిమాలయాలలో జన్మించిన నదులు కౌశికీ, గండకీ, లౌహిత్యము, మేన, ప్రలయక్ష, బహుద, మహానది, గోమతి, దేవికా, వితస్తా, సరయూ, ఇరావతి, శతద్రు, యమున, సరస్వతి నది ఈ నది ఏడు పాయలు సుప్రభ, కాతరాక్షి, విశాల, మానసహ్రద, సరస్వతి, భీమనాద, సువేణువు. భాగీరధి.

== వెలుపలి లింకులు ==

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.