ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు.[1] ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.[2] నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఐదు సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఆరు సార్లు నంది పురస్కారం, తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, విజయ అవార్డు మూడు సార్లు అందుకున్నాడు.[3]ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు.[4]

త్వరిత వాస్తవాలు ప్రకాష్ రాజ్, జననం ...
ప్రకాష్ రాజ్
జననం
ప్రకాష్ రాయ్

(1965-03-26) 1965 మార్చి 26 (వయసు 59)
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత
జీవిత భాగస్వామిపోనీ వర్మ
పిల్లలువేదాంత్‌
మూసివేయి

బాల్యం

ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.

కుటుంబం

ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతికి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి (మరణం 2004) ఉన్నారు. ప్రస్తుతము బాలీవుడ్ కు చెందిన నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010లో రెండవ వివాహము చేసుకున్నాడు.[5]

పురస్కారాలు

జాతీయ పురస్కారాలు

ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.

నంది పురస్కారాలు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

సైమా అవార్డులు

నటించిన చిత్రాలు

తెలుగు

తమిళం

హిందీ సినిమాలు

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.