ప్రకాష్ రాజ్
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు.[1] ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.[2] నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఐదు సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఆరు సార్లు నంది పురస్కారం, తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, విజయ అవార్డు మూడు సార్లు అందుకున్నాడు.[3]ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు.[4]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |