From Wikipedia, the free encyclopedia
[1] /ˈkɑːtɑːr/ ( listen), /ˈkɑːtər/ or /kəˈtɑːr/ ( listen);
دولة قطر దౌలత్ ఖతార్ ఖతార్ రాజ్యము |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం As Salam al Amiri |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | దోహా (Doha) 25°18′N 51°31′E | |||||
అధికార భాషలు | అరబ్బీ | |||||
ప్రభుత్వం | రాజ్యాంగబద్దమైన రాచరికము | |||||
- | అమీర్ | హమాద్ బిన్ ఖలీఫా | ||||
- | ప్రధాన మంత్రి | Hamad ibn Jaber Al Thani | ||||
స్వాతంత్య్రము | ||||||
- | యునైటెడ్ కింగ్ డమ్ నుండి | సెప్టెంబరు 3 1971 |
||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 11,437 కి.మీ² (164వది) 4,416 చ.మై |
||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | జూలై 2007 అంచనా | 841,000 (158వది1) | ||||
- | 2004 జన గణన | 744,029 <--then:-->(159వది) | ||||
- | జన సాంద్రత | 74 /కి.మీ² (121st) 192 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $25.01 బిలియన్లు (102వది) | ||||
- | తలసరి | $31,397 (11వది) | ||||
జీడీపీ (nominal) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $42.463 billion (62వది) | ||||
- | తలసరి | $49,655 (7వది) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.844 (high) (46వది) | |||||
కరెన్సీ | Riyal (QAR ) |
|||||
కాలాంశం | AST (UTC+3) | |||||
- | వేసవి (DST) | (not observed) (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .qa | |||||
కాలింగ్ కోడ్ | +974 | |||||
1 | Rank based on 2005 estimate. | |||||
2 | Ruled by the Al Thani family since the mid-1800s. |
అరబ్బీ: قطر Qaṭar [ˈqɑtˤɑr];ప్రాంతీయంగా : [ɡɪtˤɑr]),అంటారు.[3][4] అధికారికంగా " స్టేట్ ఆఫ్ ఖతార్ " అంటారు. (అరబ్బీ: دولة قطر Dawlat Qaṭar), ఇది ఒక స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్యభాగంలో కొంతభూభాగంలో విస్తరించి ఉన్న ద్వీపకల్పమే ఖతార్. దేశానికి దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా ఉంది. మిగిలిన భూభాగానికి పర్షియన్ గల్ఫ్ (అరేబియన్ గల్ఫ్) ఉంది. ఖతార్, బహ్రయిన్ లను అరేబియన్ గల్ఫ్‌లో ఉన్న స్ట్రెయిట్ (జలసంధి) విడదీస్తూ ఉంది. ఖతార్ సముద్ర సరిహద్దులను యునైటెడ్, ఇరాన్ దేశాలతో పంచుకుంటూ ఉంది. ఓట్టమన్ పాలన తరువాత 20వ శతాబ్దం ఆరంభం వరకు ఖతార్ " బ్రిటన్ ప్రొటెక్టరేట్"లో భాగం అయింది. 1971లో ఖతార్‌కు స్వతంత్రం లభించే వరకు ఖతార్ బ్రిటన్ ప్రొటెక్టరేట్‌లో కొనసాగింది.19వ శతాబ్దం ఆరంభం వరకు ఖతార్ " హౌస్ ఆఫ్ తాని " పాలనలో కొనసాగింది. ఖతార్ రాజ్యాన్ని " జస్సిం బిన్ మొహమ్మద్ అలి తాని " స్థాపించాడు. ఖతార్ రాజుల వారసత్వంలో పాలించబడింది. దీనికి ఎమీర్ నాయకత్వం (షేక్ తమీం బిన్ హమాద్ అల్ తాని) వహించాడు.[5] ఖతార్ రాజ్యాంగం 98% ప్రజల సహకారంతో కాంస్టిట్యూషనల్ రిఫరెండంను ఆమోదించింది.[6][7] 2013 లో ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లు. వీరిలో 278,000 ఖతారి పౌరులు , 1.5 మిలియన్లు బహిస్కృతులు ఉన్నారు.[8] సౌదీ అరేబియా , ఓమన్ గల్ఫ్ కోపరేషన్ కౌంసిల్ లో ఖతార్ అత్యంత సంప్రదాయ దేశంగా గుర్తించబడుతుంది.[9][10] ఖతార్ అధిక ఆదాయం కలిగిన అభివృద్ధి చెందిన దేశం. సహజవాయువు , ఆయిల్ నిలువలలో ఖతార్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.[11] ఖతార్ తలసరి జి.డి.పి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఖతార్ అత్యంత మానవాభివృద్ధి కలిగిన దేశంగానూ , అరబ్ దేశాలలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఐఖ్యరాజ్యసమితి వర్గీకరించింది.[12] అరబ్ ప్రపంచంలో ఖతార్ గుర్తించతగిన శక్తిగా గుర్తించబడుతుంది. అరబ్ తిరుగుబాటు సమయంలో పలు తిరుగుబాటు బృందాలకు ఖతార్ ఆర్ధిక సహకారం , మాధ్యమాల గుర్తింపును అందించి మద్దతు ఇచ్చింది. [13][14][15] చిన్నదేశమైనా ఖతార్ ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా మిడిల్ పవర్‌గా గుర్తించబడుతుంది.[16][17] " ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ "కు ఖతార్ స్వాగతం ఇచ్చింది. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి అరబ్ దేశంగా గుర్తించబడుతుంది.[18]
రోమన్ రచయిత " ప్లినీ ది ఎల్డర్ " క్రీ.పూ 1వ శతాబ్దం మధ్యకాలంలో ఈ ద్వీపకల్పంలో నివాసితుల గురించి మొదటిసారిగా వ్రాతపూర్వకంగా నమోదుచేసాడు. రోమన్ రచయిత ఇక్కడ ప్రజలను కాదరీ అని పేర్కొన్నాడు. ఈ పేరు ప్రాంతీయంగా నివసిస్తున్న ప్రధాన సెటిల్మెంటుకు చెందినదై ఉంటుందని భావిస్తున్నారు.[19][20] ఒక శతాబ్దం తరువాత ప్టోల్మీ మొదటిసారిగా తయారుచేసిన మ్యాప్‌లో ఈ ద్వీపకల్పం " కతర " పేరుతో చేర్చబడింది.[20][21] ద్వీపకల్పం తూర్పు భాగంలో " కదరా " అనే నగరం కూడా ఉంది.[22] ఇదే కాలక్రమంలో " కతర" లేక కతరీగా మారింది.[23] 18 శతాబ్దం వరకు ఆ పేరుతోనే పిలువబడి తరువాత కతరాగా మారింది.[22] చివరికి, ఆధునిక ఉత్పన్నం "ఖతార్"ను దేశం యొక్క పేరుగా అవలంబించారు.[3] [22]
ఖతార్ ప్రాంతంలో 50,000 సంవత్సరాల పూర్వం మానవ ఆవాసాలు ప్రారంభం అయ్యాయి.[24] రాతి యుగానికి చెందిన సెటిమెంట్లు , ఉపకరణాలు ఖతార్ ద్వీపకల్పంలో లభించాయి.[24] ఉబైడ్ కాలంనాటి (6500-3800)మెసపొటేమియా కళాఖండాలు విసర్జించబడిన సముద్రతీర సెటిమెంట్లలో లభించాయి.[25] ఖతార్ ఈశాన్య సముద్రతీరంలో అల్ దాస సెటిల్మెంటు దేశంలోని ఉబైడ్ సెటిల్మెంట్లలో ప్రధానమైనదిగా భావిస్తున్నారు. ఇది చిన్న సీజనల్ మకాం.[26][27] అల్ ఖోర్ ద్వీపంలో బాబిలోనియాకు చెందిన క్రీ.పూ 2వ శతాబ్ధానికి చెందిన వస్తువులు లభించాయి. ఖతార్ వాసులకు , కస్సైట్ (ప్రస్తుత బహ్రయిన్) వాసులకు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలకు సాక్ష్యంగా నిలిచాయి.[28] వీటిలో 3 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం నాటి పీతల పెంకులు , కస్సైట్ కుండ పెంకులు ప్రధానమైనవి.[26] ఖతార్ షెల్ఫిష్ డై ఉత్పత్తికి ఖ్యాతి చెందింది. సముద్రతీరంలో కస్సైట్ పర్పుల్ షెల్ డై సంస్థ ఉంది.[25][29] సా.శ. 224 స్సనింద్ సామ్రాజ్యం పర్షియన్ గల్ఫ్ ప్రాంతాలతో చేర్చి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.[30] Qatar played a role in the commercial activity of the Sasanids, contributing at least two commodities: precious pearls and purple dye.[31] సస్సనిద్ పాలనలో పలువురు తూర్పుతీరంలో ఉన్న మెసపొటేమియా క్రైస్తవుల ప్రభావంతో క్రైస్తవమతాన్ని ఆచరించారు.[32] సాంరాజ్యాలు మారాయి పలు సెటిల్మెంట్లు ఏర్పడ్డాయి.[33][34] క్రైవశకం చివరి దశలో ఖతార్ చేర్చిన ప్రాంతాన్ని " బెత్ క్వత్రయే " (సిరియా;క్వతరీలరాంతం) అని పిలిచేవారు.[35] ఖతార్ ప్రాంతం ఒకప్పుడు బహ్రయిన్, తారౌట్ ద్వీపం, అల్- ఖాఫ్ , అల్- హసా ప్రాంతాలతో చేరిన ప్రాంతంగా ఉండేది.[36] 628లో ముహమ్మద్ తూర్పు అరేబియా పాలకుడైన " ముంజిర్ ఇబ్న్ సవ అల్ తమిమి " వద్దకు ఒక ముస్లిం దూతను పంపి తాను తన వారు ముస్లిం మతం స్వీకరించామని తెలియజేసాడు. ముంజిర్ అందుకు అంగీకరించాడు. తరువాత అరబ్ తీరంలోని ప్రజలు ముస్లిం మతావలంబకులుగా మారరు.[37] ఇలాం మతాన్ని స్వీకరించిన తరువాత అరబ్బులు పర్షియాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా సస్సనిద్ సామ్రాజ్యం పతనం అయింది.[38]
ఖతార్ ఉమయ్యద్ కాలిఫతే కాలంలో ఖతార్ గుర్రాలు, ఒంటెలు ఉత్పత్తి కేంద్రంగా ఉండేది.[39] 8వ శతాబ్ధానికి ఖతార్ పర్షియన్ గల్ఫ్‌లో వ్యూహాత్మకమైన వాణిజ్యకేంద్రంగా, ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఖతార్ అభివృద్ధి చెందింది.[40][41] అబ్బాసిద్ కాలిఫతే పాలనలో ఖతార్ ముత్యాల పరిశ్రమల కారణంగా గణనీయంగా అభివృద్ధి చెందింది.[39] బాస్రా నుండి చైనా, భారతదేశాలకు పయనించే నౌకలు ఖతార్‌లో కొంతకాలం విశ్రాంతి కొరకు నిలిపి ఉంచబడేవి. చైనీయుల పింగాణి పశ్చిమ ఆఫ్రికా నాణ్యాలు, థాయిలాండ్ కళాఖండాలు ఖతార్‌లో కనుగొనబడ్డాయి.[38] 9వ శతాబ్ధానికి చెందిన పురాతత్వ పరిశోధకులు ఖతార్ వాసులు నాణ్యమైన గృహాలు, ప్రభుత్వ భవనాలు నిర్మించుకుని సంపన్నంగా జీవించారని అభిప్రాయపడుతున్నారు. ఈ కాలంలోనే రాతితో నిర్మించిన 100 భవనాలు, రెండు మసీదులు, అబ్బసిద్ కలిఫతే కోట (ముర్వాద్) నిర్మించబడ్డాయి.[42][43] అయినప్పటికీ ఇరాక్‌లో కలిఫతే సంపద పతనం కావడం ఖతార్ మీద కూడా ప్రభావం చూపింది. [44] ముస్లిం పరిశోధకుడు యాక్వత్ అల్- హమావి వ్రాసిన పుస్తకంలో కువైత్ ప్రస్తావన ఉంది. అందులో వారి వులెన్ దుస్తులు, ఈటెలు తయారీలో నైపుణ్యం వర్ణించబడిది.[45] 1253లో తూర్పు అరేబియాలో ఉస్ఫ్యురిడ్స్ ఆధీనంలో ఉండేది. 1320లో ఒర్ముస్ రాకుమారుడు ఖతార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[46] ఖతార్ రాజ్యానికి ముత్యాలు ప్రధాన ఆదాయంగా ఉండేది.[47] 1515 లో మాన్యుయల్ ఐ (పోర్చుగల్) ఓర్మస్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1521 నాటికి తూర్పు అరేనియాలో గణనీయమైన భూభాగం పోర్చుగల్ వశం అయింది.[47][48] 1550 లో అలా-హస నివాసులు తమకు తామే ఓట్టమన్ సామ్రాజ్యంలో విలీనం అయ్యారు.[49] ఈ ప్రాంతం లోని బలహీనమైన సైనిక రక్షణ కారణంగా 1670లో ఈ ప్రాంతాన్ని బని ఖలిద్ గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు.[50]
1776 లో ఉతుబ్ జాతికి చెందిన అల్ ఖలిఫా కువైట్ నుండి కువైత్‌లోని జుబరాహ్కు వలస వెళ్ళాడు.[51][52] వారు ప్రవేశించే సమయానికి ద్వీపకల్పం మీద బాని ఖలిద్ అధికారం బలహీనంగా ఉంది.[53] 1783 లో క్వతార్ - ఆధారంగా బని ఉతాబ్, సహాయక అరబ్ గిరిజనులు దండేత్తి పర్షియన్ల నుండి బహ్రయిన్ మీద దండెత్తి స్వాధీనం చేసుకున్నారు. తరువాత అల్ ఖలిఫా అధికారం బహ్రయిన్ నుండి ఖతార్ వరకు విస్తరించింది.[51]
1788 లో వహ్హాబి రాజ్యానికి రాకుమారుడు " అబ్ద్ అల్ - అజిజ్ " పాలకునిగా నియమించిన తరువాత ఆయన తన రాజ్యాన్ని తూర్పు దిశగా విస్తరించే ప్రయత్నం చేస్తూ పర్షియన్ గల్ఫ్, ఖతార్ వైపు పయనించాడు. 1795 లో బని ఖలిద్‌ను ఓడించాడు. పశ్చిమ భూభాగంలో ఈజిప్షియన్లు, ఓట్టమన్లు దాడి చేసారు. బహ్రయిన్ లోని అల్ ఖలీఫా, ఓమన్ తూర్పు భూభాగం మీద దాడి చేసారు.[54][55] 1811లో ఈజిప్షియన్లు ముందుకుచొచ్చుకుని పోయారు. బహ్రయిన్లో వహ్హామీ అమీర్ సైన్యాలను తగ్గించాడు.మస్కట్‌కు చెందిన సైయిద్ బిన్ సుల్తాన్ ఇది అవకాశంగా తీసుకుని తూర్పుతీరం లోని వహ్హాబీ మీద దండయాత్ర చేసి జుబారహ్ కోటకు నిప్పంటించాడు. తరువాత అల్ ఖలీఫా శక్తివంతంగా అధికారం స్వీకరించాడు.[55] ఈస్టిండియా కంపెనీకి చెందిన నౌకను దీపిడీ చేసినందుకు దండనగా 1821 లో దోహా మీద బాంబు దాడి జరిగింది. దాడిలో పట్టణం ధ్వంసం చేయబడి వందలాది నివాసితులను పట్టణం నుండి తరిమివేయబడ్డారు. నివాసితులకు బాబుదాడి గురించిన కారణాలు తెలియలేదు. ఫలితంగా క్వతారీ తిరుగుబాటుదారులు స్వతంత్రం కోరుతూ అల్ ఖలీఫా మీద దాడి చేసారు. [ఆధారం చూపాలి] 1825 లో షేక్ మొహమ్మద్ బిన్ తాని " హౌస్ ఆఫ్ తాని " స్థాపించాడు.[56] ఖతార్ సామంతరాజ్యం అయినప్పటికీ వారికి అల్ ఖలీఫా అంటే క్రోధం మాత్రం కొనసాగింది. 1867 లో అల్ ఖలీఫా అబూదాబీ పాలకునితో చేరి ఖతార్ తిరుగుబాటుదారులను అణిచివేయడానికి అల్ వక్రాహ్కు బృహత్తర నావికా దళాన్ని పంపారు. ఇది ఖతార్- బహ్రయిన్ యుద్ధం (1867-1868) గా మారింది. యుద్ధంలో బహ్రయిన్, అబు దాబీ దోహాను ఓడించి దోపిడీ చేసింది.[57] 1820 బహ్రయిన్ - ఆంగ్లో ఒప్పందాన్ని బహ్రయిన్ తిరుగుబాటుదారులు వ్యతిరేకిస్తూ హింసాత్మకచర్యలు చేపట్టారు. తిరుగుబాటుచర్యలకు ప్రేరేపితుడైన బ్రిటిష్ రాజప్రతినిధి " లూయిస్ పెల్లీ " 1868లో సెటిల్మెంటుకు ఆదేశించాడు. ఆయన నియమిచిన మిషన్ బహ్రయిన్, ఖతార్‌లలో శాంతి ఒప్పందం జరగడానికి ప్రయత్నించింది.
ఓట్టమన్ గవర్నర్ " విలాయత్ ఆఫ్ బాగ్దాద్ " మిదాత్ పాషా రాజకీయ, సైనిక వత్తిడి కారణంగా అల్ తాని గిరిజనులు ఈ ప్రాంతాన్ని 1871 లో ఓట్టమన్కు అప్పగించారు. [58] ఓట్టమన్ ప్రభుత్వం సంస్కరణావాది తంజిమత్ను పన్నువసూలు, భూమి క్రయవిక్రయాల నమోదు కొరకు నియమించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సామ్రాజ్యంలో విలీనం చేసుకుంది.[58] ప్రాంతీయ ప్రజల అసమ్మతి మధ్య అల్ తాని ఓట్టమన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు. అయినప్పటికి ఖతార్- ఓట్టమన్ మధ్య సంబంధాలు 1882 లో స్తంభించాయి. అల్ తాని అబుదాబి మీద దాడి చేసిన సమయంలో ఓట్టమన్ ప్రభుత్వం సహాయం అందించడానికి నిరాకరించిన కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బాధించబడ్డాయి. 1888 లో మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ ఖతార్ కయ్మకంగా అల్ తాని నియమించిన సమయంలో ఓట్టమన్ ప్రజలు మద్దతు ఇచ్చారు.[59] చివరికి అల్ తాని ఓట్టమన్ మీద తిరుగుబాటు చేసాడు. 1892లో ఆయన కయ్మకం పదవికి రాజీనామా చేసి పన్ను చెల్లింపు నిలిపివేసాడు.[60] 1893 ఫిబ్రవరిలో పన్ను వసూలుకు, జస్సిన్ బిన్ మొహమ్మద్‌ను సంస్కరణలకు అనుకూలంగా మార్చడానికి ఖతార్‌కు మెహ్మద్ హఫిజ్ పాషా చేరుకున్నాడు. మరణం, జైలుజీవితం ఎదుర్కోవాలన్న భయంతో జస్సిం అల్ వజ్బాహ్కు (దోహాకు 10కి.మీ దూరంలో ఉంది) పలువురు గిరిజనప్రజలతో వెళ్ళాడు. మెహమ్మద్ తన బృందాలను బిడిపించి ఓట్టమన్ ప్రభుత్వానికి విశ్వాసంగా ఉండమని జస్సిన్ను నిర్బంధించాడు. జస్సిన్ ఆ ప్రతిపాదనను నిరాకరించాడు. మార్చిలో మెహ్మద్ జస్సింస్ సోదరుని, 13 మంది ప్రముఖ ఖతార్ నాయకులను ఖైదుచేసాడు. 10,000 టర్కిష్ ఇరల్లిరాలు జరిమానాగా తీసుకునే షరతుతో మెహ్మద్ ఖైదీలను విడుదల చేసాడు. తరువాత మెహ్మద్ యూసఫ్ ఎఫ్ఫెంది నాయకత్వంలో 200 బృందాలను జస్సిన్ కోట మీద దాడికి పంపాడు. అది " అల్ వజ్బాహ్ యుద్ధం " నికి దారితీసింది.[38] ఎఫ్ఫెండెస్ బృందాలు అల్ వజాబాహ్ మీద దాడి చేసి షెబక కోటను స్వాధీనం చేసుకున్నాయి. జస్సిన్ సైవ్యాలు ప్రతిఘటించి ఓట్టమన్ సైన్యాలను వెనుకకు తరిమాయి. అల్ బిడ్డా కోటను విడిపించిన తరువాత జస్సిన్ కోలం చేరుకుని కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఓట్టమన్ ఓటమిని అంగీకరించి జస్సిన్తో ఒప్పందం చేసుకుని మెహ్మద్ అశ్వికదళాలను సురక్షితంగా వెనుకకు మళ్ళించింది.[61] ఖతార్ ఓట్టమన్ నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందలేదు. ఫలితంగా ఖతార్ - ఓట్టమన్ మధ్య కుదిరిన ఒప్పందం తరువాత ఓట్టమన్ సామ్రాజ్యంలో ఖతార్ స్వయంప్రతిపత్తి అధికారం పొందింది.[62]
మొదటి ప్రపంచ యుద్ధంలో వివిధ సంకీర్ణాలతో పాల్గొన్న యుద్ధాలలో అపజయాన్ని ఎదుకొని ఓట్టమన్ సామ్రాజ్యం బలహీనపడింది. ఓట్టమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అరబ్ తిరుగుబాటులో ఖతార్ భాగస్వామ్యం వహించింది. తిరుగుబాటు విజయవంతం అయింది. దేశంలో ఓట్టమన్ పాలన మరింత బలహీనపడింది. యునైటెడ్ కిండం, ఓట్టమన్ షేక్ అబ్దుల్లా బిన్ జస్సిం అల్ తాని అధికారానికి గుర్తింపు ఇచ్చాయి. అలాగే ఆయన వారసులకు ఖతార్ ద్వీపకల్ప పాలనాధికారం ఇవ్వబడింది. ఓట్టమన్ ఖతార్ మీద అధికారం వెనుకకు తీసుకుంది.మొదటి ప్రపంచయుద్ధం ఆరంభం అయిన తరువాత 1915 అబ్దుల్లా బ్రిటన్ దోహా విడిచివెళ్ళాడానికి వత్తిడి చేసాడు. [63] ఓట్టమన్ సామ్రాజ్యం విభజించబడిన కారణంగా ఖతార్ 1916 నవంబరు 3న బ్రిటిష్ ప్రొటెక్టరేట్‌లో భాగం చేయబడింది. అదే రోజు బ్రిటిష్ ప్రభుత్వం షేక్ అబ్దుల్లా బిన్ జస్సిం అల్ తానితో ఖతార్‌ను ట్రూషియల్ స్టేట్స్తో చేర్చడానికి ఒప్పదం మీద సంతకం చేసింది. బ్రిటన్ సముద్రం నుండి ఎదురైయ్యే దాడుల నుండి ఖతార్‌కు రక్షణ కల్పిస్థానని మాట ఇచ్చిన కారణంగా అబ్దుల్లా మరే ఇతర దేశాలతో ఒప్పందానికి అంగీకరించలేదు.[63] 1935 మే 5న అబ్దుల్లా బ్రిటిష్ ప్రభుత్వంతో మరొక ఒప్పందం మీద సంతకం చేసాడు. ఈ ఒప్పందం కారణంగా ఖతార్ బ్రిటన్ నుండి అతర్గత, బహిర్గత రక్షణ పొందింది.[63] ఖతార్‌లో 1939లో ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడినప్పటికీ దీనిని రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం అయ్యే వరకు వెలికితీసే ప్రయత్నం జరగలేదు. రెండవ ప్రపంచయుద్ధం బ్రిటిష్ ప్రభుత్వం ప్రభావం క్షీణించడం ఆరంభం అయింది. 1947లో భారతదేశం, పాకిస్థాన్ దేశాలకు స్వతంత్రం లభించింది. 1950 లో ముత్యాలు, మత్స్యపరిశ్రమ స్థానంలో ఆయిల్ ఉత్పత్తి ఖతార్ ప్రధాన ఆయిల్ వనరుగా మారింది. ఆయిల్ ద్వారా లభించే ఆదాయం ఖతార్ మౌలిక వసతుల అభివృద్ధికి, ఆధునికీకరణకు ఉపయోగించబడింది. 1950 లో పర్షియన్ గల్ఫ్, అరబ్ ఎమిరేటులను వదిలి వెళ్ళాలని బ్రిటన్‌కు వత్తిడి అధికం అయింది. 1968లో బ్రిటన్ అధికారికంగా ఖతార్ స్వాతంత్ర్యం ప్రకటించింది. తరువాత ఖతార్ బహ్రయిన్, ఇతర ఏడు దేశాల ఫెడరేషన్లో విలీనం అయింది. ప్రాంతీయ వివాదాలు ఖతార్ ఫెడరేషన్ నుండి వెలుపలకు వెళ్ళడానికి దారితీసింది. ఖతార్ సంకీర్ణం నుండి విడుదల కావడం " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " రూపొందడానికి కారణం అయింది.
1971 సెప్టెంబరున ఖతార్‌కు అధికారికంగా యునైటెడ్ కింగ్డం నుండి స్వతంత్రం లభించింది. తరువాత ఖతార్ సార్వభౌమాధికారం కలిగినదేశం అయింది.[64] ప్రభుత్వం తరువాత ఆయుధాలను ఫ్రెంఛ్ నుండి దిగుమతి చేసుకుంది.[65] 1972 లో ఖలిఫా బిన్ హమద్ అల్ తాని అధికారం బలహీనపడింది. 1974 లో ఖతార్ " జనరల్ పెట్రోలియం కార్పొరేషన్ " దేశంలోని ఆయిల్ నిక్షేపాల మీద ఆధిపత్యం వహించింది.[66] 1976లో ప్రపంచంలో ఖతార్‌లో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అయిన " నార్త్ డోం గ్యాస్ కండెంసేట్ ఫీల్డ్ " కనుగొనబడింది.[65] అలాగే ఎల్.ఎన్.జి. వెసెల్స్ తయారు చేసిన దేశాలలో ఖతార్ మొదటిది.[67] 1991 లో ఖతార్ గల్ఫ్ యుద్ధంలో ఖతార్ ప్రముఖ పాత్ర వహించింది. ఖఫ్జి యుద్ధంలో ఖతార్ ట్యాంకులు వీధులలో సంచరిస్తూ " సౌదీ అరేబియా నేషనల్ గార్డ్ "కు సహకరించింది. వీటిని ఇరాక్ ఆర్మీ ట్రూప్స్ నియమించాయి. ఖతార్ కెనడా సంకీర్ణ దళాలకు ఎయిర్ బేస్‌లను వాడుకోవడానికి కెనడాను అనుమతించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ , ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగం వాడుకోవడానికి ఖతార్ అంగీకరించింది.[24] 1995 లో ఎమీర్ హమీద్ బిన్ కలీఫా అల్ తాని సైన్యం, మంత్రులు, జాక్యూ చిరాక్ (ఫ్రెంచ్) , పొరుగుదేశాల మద్దతుతో తనతండ్రి నుండి ఖలిఫా బిన్ హమద్ అల్ తాని నుండి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు.[65] [68] ఎమీర్ హమద్ పాలనలో ఖతార్ తగినంత స్వతంత్రం అనుభవించింది. ఈ సమయంలో అల్ జజీరా టెలివిషన్ (1996) స్థాపన, 1999 ముంచిపల్ ఎన్నికలలో స్త్రీలకు ఓటు హక్కు, 2005 లో రాజ్యాంగ నిబంధనలు వ్రాతబద్ధం చేయడం , 2008లో రోమన్ కాథలిక్ చర్చి నిర్మించబడ్డాయి. 2010లో ఖతార్ 2022 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ క్రీడలు నిర్వహించడానికి హక్కు సాధించింది. మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇలాంటి హక్కు పొందిన మొదటి దేశం అన్న గౌరవం ఖతార్ దక్కించుకుంది. 2013లో ఖతార్ లెజిస్లేటివ్ ఎన్నికలు నిర్వహించబడతాయని ఎమీర్ ప్రకటించాడు. తరువాతి ఖతార్ జనరల్ ఎన్నికలు 2016లో నిర్వహించాలని ప్రతిపాదించబడింది.2003 లో ఖతార్ యు.ఎస్. సెంట్రల్ కమాండ్ ప్రధానకేంద్రంగా పనిచేసింది.[69] 2005 మార్చిలో సూసైడ్ అటాక్ బాంబింగ్ దోహ్రా ప్లేయర్స్ థియేటర్లో బ్రిటిష్ టీచర్‌ను హతమార్చింది. ఈ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఖతార్‌లో గతంలో ఇలాంటి తీవ్రవాద చర్యలు చోటుచేసుకోలేదు. ఈ బాంబును మోసుకువచ్చిన అహ్మద్ అలి అరేబియన్ ద్వీపకల్పానికి చెందిన అల్ కొయిదాకు చెందిన ఒక ఈజిప్షియన్.[70][71] 2011లో ఖతార్ " మిలట్రీ ఇంటర్వెంషన్ ఇన్ లిబియా (2011), లిబియన్ అప్పోజిషన్ బృందాలలో చేరింది. [72] సిరియన్ అంతర్యుద్ధంలో తురుగుబాటుదారులకు ఆయుధాలు అందిస్తున్న దేశాలలో ఖతార్ ఒకటి.[73] 2012లో ఖతార్ ఆఫ్ఘన్ శాంతి ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన సమయంలో తలిబాన్ చర్చలు సులువుగా జరగడానికి ఖతార్‌లో రాజకీయ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని కోరిక వెలిబుచ్చారు. 2013 జూన్‌లో షేక్ తమీం బిన్ అల్ తాని ఖతార్ తనతండ్రి నుండి అధికారం పొంది ఎమీర్‌గా ఎన్నిక చేయబడ్డాడు.[74] షేక్ తమిన్ ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యరక్షణ, విద్యాభివృద్ధి, మౌలిక నిర్మాణాల అభివృద్ధి 2022 వరల్డ్ కప్ ఆతిథ్యానికి తగిన ఏర్పాట్లు మొదలైన విషయాలపై శ్రద్ధ వహించాడు.[75]
ఖతార్ ద్వీపకల్పం 160 కిలోమీటర్లు (100 మై.) పర్షియన్ గల్ఫ్‌లో చొచ్చుకుని ఉంది. ఖతార్ 24-27డిగ్రీల ఉత్తర అక్షాంశం, 50-52డిగ్రీల తూర్పు రేఖామ్శంలో ఉంది. దేశంలో అత్యధికభాగం దిగువన ఉన్న ఇసుకతో నిండిన మైదానంతో నిండి ఉంది. దేశం ఆగ్నేయంలో నార్ అదైబ్ (ఇన్లాండ్ సముద్రం) ఉంది. దేశంలో ఉన్న కదిలే ఇసుక దిబ్బలు ఖతార్ ప్రత్యేకతలలో ఒకటి. దేశంలో స్వల్పమైన చలితో కూడిన శీతాగాలులు, అత్యంత వేడైన వేసవికాలాలు ఉంటాయి. " అబు అల్ బౌల్ " 103 మీటర్లు (338 అ.) ఖతార్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు.[76] పశ్చిమంలో ఉన్న జెబెల్ దుఖన్లో లైం స్టోన్ ఔట్ క్రాపింగ్స్ ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. ఇవి ఉత్తరంలో జిక్రిత్ నుండి ఉం బాద్ మీదుగా దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయి. జెబెల్ దుఖన్ ప్రాంతంలో ప్రధాన " ఆన్ షోర్ ఆయిల్ ఫీల్డ్ " ఉంది. నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ద్వీపకల్పం వాయవ్యంలో ఆఫ్ షోర్లో ఉన్నాయి.
1992 లో 11 జూన్‌లో ఖతార్ రియో సమావేశంలో వైవిధ్యం ఒప్పందంలో సంతకంచేసి 1996 ఆగస్టు 21న జరిగిన సమావేశంలో ప్రధాన్యత పొందింది.[77] ఖతార్ గణనీయంగా నిర్వహించిన బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ 2005 మే 18 సమావేశంలో ప్రశంశలను అందుకుంది. [78] ఖతార్‌లో దాదాపు 142 నాచు జాతులు కనుగొనబడ్డాయి. [79] " మినిస్టరీ ఆఫ్ ఎంవిరాన్మెంట్ డాక్యుమెంట్స్ " ఖతార్‌లో కనుగొనబడిన ప్రాకేజంతువులు (ప్రత్యేకంగా బల్లులు, తొండల వంటివి లేక లిజార్డ్స్) గురించిన పుస్తకం ప్రచురించింది. ఇది అంతర్జాతీయ పరిశోధకులు, సహకార బృందాలు నిర్వహించిన సర్వే ఆధారంగా తయారు చేయబడింది.[80] రెండు శతాబ్ధాల కాలం ఖతార్ తలసరి కార్బండైయాక్సిడ్ ఉత్పత్తి అంతర్జాతీయంగా అత్యధికస్థాయికి చేరిందని భావిస్తున్నారు. 2008 లో ఖతార్ తలసరి కార్బండైయాక్సైడ్ ఉత్పత్తి 49.1మెట్రిక్ టన్నులని భావిస్తున్నారు.[81] అత్యధికంగా తలసరి జలవినియోగం చేస్తున్న వారిలో ఖతార్ నివాసులు ఒకరు. ఖతార్ ప్రజలు తలసరి జలవినియోగం ఒక రోజుకు 400 లీటర్లు.[82] 2008 లో ఖతార్ పర్యావరణ అభివృద్ధి కొరకు స్థాపించిన " ఖతార్ నేషనల్ 2030 " రెండు దశాబ్ధాలలో ఖతార్ పర్యావరణ అభివృద్ధి కొరకు నాలుగు ప్రధానాంశాలను లక్ష్యంగా చేసుకుని స్థాపించబడింది. నేషనల్ విషన్ రాబోయే దశాబ్ధాలలో ఆయిల్ ఆధారిత విద్యుదుత్పత్తికి బదులుగా శాశ్వత ఇతరమార్గాలు లక్ష్యంగా పనిచేస్తుంది. [83] ఖతార్ జాతీయ జంతువు " ఒరిక్స్ ".
శీతోష్ణస్థితి డేటా - Qatar | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 22 (72) |
23 (73) |
27 (81) |
33 (91) |
39 (102) |
42 (108) |
42 (108) |
42 (108) |
39 (102) |
35 (95) |
30 (86) |
25 (77) |
33 (92) |
సగటు అల్ప °C (°F) | 14 (57) |
15 (59) |
17 (63) |
21 (70) |
27 (81) |
29 (84) |
31 (88) |
31 (88) |
29 (84) |
25 (77) |
21 (70) |
16 (61) |
23 (74) |
సగటు అవపాతం mm (inches) | 12.7 (0.50) |
17.8 (0.70) |
15.2 (0.60) |
7.6 (0.30) |
2.5 (0.10) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
2.5 (0.10) |
12.7 (0.50) |
71 (2.8) |
Source: http://us.worldweatheronline.com/doha-weather-averages/ad-dawhah/qa.aspx |
ఖతార్‌లో ఆయిల్ నిక్షేపాలు వెలికితీయడానికి ముందు ఖతార్ ఆర్థికరంగానికి ముత్యాల పరిశ్రమ, మత్స్యపరిశ్రమ ప్రధానాంశగా ఉంది. ఓట్టమన్ సామ్రాజ్యానికి చెందిన ప్రాంతీయ గబర్నర్ల నివేదిక (1892) అనుసరించి ముత్యాలపరిశ్రమలో లభించిన ఆదాయం 24,50,000 క్రాన్.[57] 1920-1930 మధ్యకాలంలో జపానీ సంప్రదాయ ముత్యాలు అంతర్జాతీయ విఫణిలో ప్రవేశించిన తరువాత ఖతార్ ముత్యాలపరిశ్రమ పతనం అయింది. 1940లో ఖతార్‌లోని దుఖాన్ ఫీల్డులో ఆయిల్ కనిపెట్టబడింది.[84] తరువాత ఖతార్ ఆర్థికరంగం ఆయిల్ నిక్షేపాలవైపు మళ్ళించబడుతుంది. ప్రస్తుతం ఖతార్ ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నారు. దేశంలో ఆదాయం పన్నువిధింపు లేదు, ప్రపంచంలో అతి తక్కువ పన్ను విధానం అనుసరిస్తున్న దేశాలలో (మరొక దేశం బహ్రయిన్) ఖతార్ ఒకటి. 2013లో ఖతార్ నిరోద్యం శాతం 0.1%.[85] ఖతార్ కార్పొరేట్ లా ఖతార్ ప్రజలు ఏవాణిజ్యంలో అయినా 51% భాగస్వామ్యం వహించాలని ఆదేశిస్తుంది.[65] 2014 ఖతార్ తలసరి జి.డి.పి. ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది. [86] దాదాపు ప్రజలలో 14% మంది డాలర్లలో మిలియనీర్లుగా ఉన్నారు. [87] ఖతార్ అధికంగా విదేశీ ఉద్యోగుల మీద ఆధారపడుతుంది. జనసంఖ్యలో వసల ఉద్యోగుల శాతం 86% ఉంది. ఉద్యోగులలో 94% విదేశీయులే.[88][89] ఖతార్ " ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంఫిడరేషన్ " విమర్శలను ఎదుర్కొంటుంది. [90] 1940లో స్థాపించబడిన పెట్రోల్, సహజవాయు ఆదాయం మీద ఖతార్ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంది.[91] ద్రవరూప సహజవాయువు ఎగుమతులలో ఖతార్ ప్రథమ స్థానంలో ఉంది. [92] 2012 లో ఖతార్ విద్యుత్ కొరకు 120 బిలియన్లు వ్యయం చేసిందని అంచనా.[93] ఖతార్ " ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రిస్ "లో సభ్యత్వం కలిగి ఉంది. ఈ ఆర్గనైజేషన్‌లో ఖతార్ 1961 నుండి సభ్యదేశంగా ఉంది. [94] 2012 లో ఖతార్ ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో చేర్చబడింది. తలసరి ఆదాయంలో ఖతార్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. 2010 లో తలసరి ఆదాయంలో ల్యూక్సంబర్గ్ను అధిగమించింది. వాషింగ్టన్ ఆధారిత " ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాంస్ " ప్రచురణలు 2012లో ఖతార్ తలసరి కొనుగోలు శక్తి జి.డి.పి. 1,06,000 అమెరికన్ డాలర్లు అని వెల్లడించాయి. ఇది దేశాన్ని సంపన్న దేశాలవరుసలో నిలపడానికి సహకరించింది. లక్సంబర్బర్గ్ 80,000 అమెరికన్ డాలర్ల తలసరి కొనుగోలు శక్తితో ద్వితీయస్థానానికి చేరింది. 61,000 అమెరికన్ డాలర్ల తలసరి కొనుగోలు శక్తితో సింగపూర్ మూడవస్థానంలో ఉంది. 2012 ఖతార్ జి.డి.పి. 182 బిలియన్ల అమెరికన్ డాలర్లు అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సహజవాయు ఉత్పత్తి , అధికరించిన ఆయిల్ ధరలు ఖతార్ ఆదాయాన్ని శిఖరాగ్రానికి చేర్చాయి. 2012లో ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లకు చేరింది. అదే పరిశోధనలు ఖతార్ " ఇంవెస్ట్మెంట్ అథారిటీ " ద్రవ్యం 115 బిలియన్ల అమెరికన్ డాలర్లు అని తెలియజేస్తుంది. సార్వభౌమాధికారం కలిగిన ప్రపంచం లోని సంపన్న దేశాలలో ద్రవ్యం నిలువలో ఖతార్‌ను 12వ స్థానంలో నిలిపింది. [95] 2005లో " ఖతార్ ఇంవెస్ట్మెంట్ అథారిటీ " విదేశీపెట్టుబడుల విభాగం కొరకు " ఖతార్ వెల్త్ ఫండ్ " సంస్థను స్థాపించింది.[96] ఆయిల్, గ్యాస్ పరిశ్రమల నుండి డాలర్లు అత్యధికంగా లభిస్తున్నందున కతరి ప్రభుత్వం పెట్టుబడులను యునైటెడ్ స్టేట్స్, ఐరోపా, ఆసియా దేశాలకు మళ్ళించింది.2013 ఖతార్ విదేశీపెట్టుబడుల ద్రవ్యం 100 బిలియన్ల అమెరికండాలర్లు ఉన్నాయి. 2009 లో ఇంటర్నేషనల్ ఇంవెస్ట్మెంటు ఆర్మ్‌లో ఖతార్ 30-40 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంది. 2014లో వేలంటినో, సైమంస్, ప్రింటెంప్స్, హర్రాడ్స్, ది షర్ద్, బర్క్లే బ్యాంక్, హీత్రో ఎయిర్ పోర్ట్, పారిస్ సెయింట్ - జర్మన్ ఎఫ్.సి, వోల్స్ వ్యాగన్, రాయల్ డచ్ షెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, తిఫనీ, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా, సైన్సు బురీ, బ్లాక్ బెర్రీ,[97] సాంతండర్ బ్రాసిల్ సంస్థలలో పెట్టుబడి పెట్టింది.[98][99]
As of 2012[update], ఖతార్ ఆయిల్ 15 బిలియన్ల బ్యారెల్ ఉత్పత్తి, గ్యాస్ ఫీల్డ్స్ ఉత్పత్తి ప్రంపంచ ఉత్పత్తిలో 13% భాగస్వామ్యం వహించాయి. ఫలితంగా ఖతార్ తలసరి ఆదాయంలో ప్రపంచదేశాలలో అత్యంత సంపన్న దేశంగా మారింది. 2మిలియన్ల ఖతార్ ప్రజలలో దారిద్యరేఖకు దిగువున ఉన్న వారు లేరు. దేశంలో 1% కంటే తక్కువగా నిరుద్యోగులు ఉన్నారు.[100] ఖతార్ ఆర్థికరగం 1982 లో కొంత పతనం చెందింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పతనం కావడం, ఖతార్ ప్రణాళికా వ్యయం అధికంకావడం కారణంగా ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ప్రాంతీయ వాణిజ్య సంస్థలు కొంతమంది ఉద్యోగులను పని నుండి తొలగించింది. 1990 నుండి ఆర్థికరంగం కోలుకున్నది. తరువాత తిరిగి ఈజిప్ట్, దక్షిణాసియా నుండి నిపుణుల నియామకం వృద్ధి చెందింది.
దినసరి 5,00,000 బ్యారెల్ ఆయిల్ ఉత్పత్తి, సహజ వాయువు ఉత్పతో శిఖరాగ్రాన్ని అందుకున్న ఖతార్ ఆయిల్ ఉత్పత్తి 2033 నాటికి క్షీణిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఖతార్ ఈశాన్య సముద్రతీరంలో అత్యధికంగా ఉన్న చమురు నిక్షేపాలు క్షీణించవచ్చు. ఖతార్ సహజవాయువు నిక్షేపాలు (250 ఘన అడుగులు) ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాయి. 1991లో ఖతార్ నార్త్ ఫీల్డ్ నుండి 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం లభించింది. 1996లో ఖతార్ ఖతార్ ప్రాజెక్ట్ ద్రవ్యరూప సహజవాయువు ఎగుమతి (జపాన్ కు) ప్రారంభించింది. నార్త్ ఫీల్డ్ అభివృద్ధికి అదనంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేయబడుతుంది.
ఖతార్ ఉం సైద్లో బృహత్తర ప్రాజెక్టులను కలిగి ఉంది. దినసరి 50,000 బ్యారెల్ (8000 ఘన మీ) శక్తి కలిగిన రిఫైనరీ, ఎరువుల తయారీ కంపెనీ (యూరియా, అమోనియా), ఒక స్టీల్ ప్లాంట్, ఒక పెట్రో కెమికల్ కంపెనీ ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నీ ఫ్యూయల్ కొరకు గ్యాస్‌ను ఉపయోగిస్తున్నాయి. వీటిలో యురేపియన్, జపాన్ సంస్థలు భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న కంపెనీలలో అధికభాగం, దేశానికి స్వంతమైన ఖతార్ పెట్రోలియం కంపెనీలు ఉన్నాయి. ఖతార్ ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులకు అవసరమైన ఉపకరణాలను అత్యధికంగా యు.ఎస్. నుండి సరఫరా చేయబడుతున్నాయి. నార్త్ ఫీల్డ్ గ్యాస్ అభివృద్ధి పనులలో యు.ఎస్ ప్రధానపాత్ర వహిస్తుంది.[100] ఖతార్ ప్రభుత్వం రాబోయే రెండు దశాబ్ధాల అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని " ఖతార్ నేషనల్ విషన్ 2030 " వనరుల పునరుద్ధరణ కొరకు పెట్టుబడులు అధికం చేసింది. [83] ఖతార్ భాగస్వామ్య సంస్థలు, ఖతార్ ప్రభుత్వశాఖలకు ఖతార్ పౌరుల ఆధిపత్యంలో నిర్వహించాలని ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. విదేశాలలో ఉన్నత విద్య పూర్తిచేసుకున్న పలువురు యువకులు ఖతార్‌లో కీలకమైన స్థానాలలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా ప్రవాహంగా వస్తున్న విదేశీనిపుణుల రాకను అరికట్టడానికి ఖతార్ విదేశీమానవవనరుల ఉపయోగం నిబంధనలను క్లిష్టం చేసింది. ఖతార్‌లో ప్రవేశించడానికి, ఇమ్మిగ్రేషన్ రూల్స్ క్లిష్టం చేయబడ్డాయి.[100]
ఖతార్ వలస ఉద్యోగులమీద ఆధారపడిన తరువాత జనసంఖ్య సీజన్ అనుసరించి హెచ్చుతగ్గులకు గురౌతూ ఉంటుంది. 2013 ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లు. వీరిలో ఖతార్ పౌరులు 2,78,000 (13%), 1.5 మిలియన్లు విదేశీఉద్యోగులు ఉన్నారు.[8] ఖతార్ జనసంఖ్యలో అరబ్చెందని వారు అధికంగా ఉన్నారు. 2013 గణాంకాలు అనుసరించి ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 5,45,000 ఉన్నారు.[8] నేపాలీయులు 3,41,000, ఫిలిప్పైన్లు 1,85,000, బంగ్లాదేశీయులు 1,37,000, శ్రీలంకన్లు 1,00,000, పాకిస్థానీయులు 90,000 మంది ఉన్నారు.[8] ఖతార్ జనసంఖ్య మొదటి సారిగా ప్రాంతీయ ఓట్టమన్ గవర్నర్లు 1892లో నిర్వహించారు. ఈ గణాంకాలను అనుసరించి ఖతార్ జనసంఖ్య 9,830.
2010 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 16,99,435.[102] 2013 జనవరిలో ఖతార్ గణాంకాల అధికారులు ఖతార్ జసంఖ్య 19,03,447 అని నిర్ధారించారు. వీరిలో 14,05,164 స్త్రీలు 4,98,283.[103] 1970లో మొదటి గణాంకాలు అనుసరించి జనసంఖ్య 1,11,133.[101] 2001 ఖతార్ జనసంఖ్య 6,00,000 ఉండగా 2011 నాటికి జనసంఖ్య మూడురెట్లు అధికం అయ్యారు. వీరిలో ఖతార్ స్థానికులు 15% మాత్రమే ఉన్నారు.[104] పురుష ఉద్యోగుల ప్రవాహం కారణంగా స్త్రీ:పురుష నిష్పత్తిలో భేదం అధికం అయింది. ప్రస్తుతం జనసంఖ్యలో స్త్రీలు నాలుగవ వంతు మాత్రమే ఉన్నారు. ఖతార్ గణామాల సేకరణాధికారులు 2020 నాటికి ఖతార్ జసంఖ్య 2.8 మిలియన్లకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. ఖతార్ నేషనల్ డెవెలెప్మెంటు స్ట్రాటజీ (2011-16) ఖతార్ జనసంఖ్య 2013 నాటికి 1.78 మిలియన్లు 2014 నాటికి 1.81 2015 నాటికి 1.84, 2016 నాటికి 1.86 కాగలదని అంచనావేసారు. జనసంఖ్య వార్షికాభివృద్ధి 2.1 %. [106] అయినప్పటికీ 2015 నాటికి ఖతార్ జనసంఖ్య 2.46 మిలియన్లకు చేరుకుని గత సంవత్సరం కంటే 8.5% అభివృద్ధి చెందింది.[107]
ఖతార్‌లో సున్నీ ఇస్లాం మతం ఆధిక్యత కలిగి ఉండి దేశీయమతం అంతస్తును కలిగి ఉంది.[110] ఖతార్ పౌరులు సున్ని ఇలాంకు చెందిన సలాఫి ముస్లిం ఉద్యమవాదులుగా ఉన్నారు.[111][112][113] షియా ముస్లిములు 5% ఉన్నారు.[114] 2004 గణాంకాలను అనుసరించి జనసంఖ్యలో 71,5% మంది సున్నీ ముస్లిములు, 5% షియా ముస్లిములు, 8,5% విదేశీ క్రైస్తవులు, 10% ఇతర విదేశీ మతస్థులు ఉన్నారు.[76][115][116] ఖతార్ రాజ్యాంగం అనుసరించి షరియా చట్టం ఖతార్ లెజిస్లేషన్‌కు ఆధారంగా ఉంది.[117][118] 2010 లో ఖతార్ రిలీజియస్ అఫ్లియేషన్ ప్యూ ఫోరం ద్వారా నిర్వహించిన గణాంకాల ఆధారంగా 6.7% ముస్లిములు, 13.8% క్రైస్తవులు, 13.8% హిందువులు, 3.1% బౌద్ధులు ఉన్నారు. ఇతర మతస్థులు, ఏ మతానికి చెందని వారు 1.6% ఉన్నారు.[119] క్రైస్తవులు పూర్తిగా విదేశీయులే 2015 నాటికి 200 మంది ముస్లిములు క్రైస్తవమతానికి మార్పిడి చెందారు.[120] 2008 నుండి క్రైస్తవులు ప్రభుత్వ నిధి సహాయంతో చర్చీలు నిర్మించుకోవడానికి అనుమతి పొందారు.[121] అయినప్పటికీ విదేశీ మిషనరీ చర్యలు అధికారికంకా ప్రోత్సాహం లభించడం లేదు.[122] ఖతార్‌లో మలంకర మార్ థోమా సిరియన్ చర్చి, మలంకర ఆర్ధడాక్స్ సిరియన్ చర్చి, ది రోమన్ కాథలిక్ చర్చి, కాథలిక్ చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ (దోహా), ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ది ఎపిఫని చర్చిలు క్రియాశీలకంగా ఉన్నాయి.[123][124][125] ఖతార్‌లో రెండు మొర్మన్ వార్డులు ఉన్నాయి.[123][124][125] గణానీయమైన హిందువులు, బుద్ధిస్ట్ సంఖ్య ఉన్నప్పటికీ ఆరాధనామందిరాలు మాత్రం లేవు.
ఖతార్ అధికార భాష ప్రాంతీయ యాసతో కూడిన ఖతార్ అరబిక్. చెవిటివారి కొరకు కతరి సంఙా భాషా రూపొందించబడింది. ఆంగ్లభాష దేశమంతటా రెండవ భాషగా ఉంది. [126] వాణిజ్యంలో ఫ్రాంకా భాష వాడుకగా ఉంది. ఆంగ్లభాష ఆధిక్యత నుండి అరబిక్ భాషను సంరక్షించడానికి ఫ్రాంకా భాష అభివృద్ధి చేయబడింది.[127] ఖతార్ లోని విదేశీ ఉద్యోగులకు ఆంగ్లభాష సంభాషణా సౌలభ్యానికి ఉపయోగిస్తున్నారు. 2012 ఖతార్ ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ - స్పీకింగ్ ఆర్గనైజేషన్‌కు చెందిన లా ఫ్రాంకోఫొనీ సభ్యత్వం పొందింది.[128] ఖతార్ ప్రజలలో 10% ఫ్రెంచ్ మాట్లాడే వారు ఉన్నారు.[129][130] ఖతార్‌లో నివసిస్తున్న బహుళజాతి ప్రజల కారణంగా దేశంలో బలూచి, హిందీ, ఉర్దూ, పష్తొ, తమిళం, తెలుగు, నేపాలీ, సింహళీ, బెంగాలీ, తగలాగ్ భాషలు వాడుకలో ఉన్నాయి.[131]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.