శ్రీనివాస్ రాగా దర్శకత్వంలో 2013లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia
ఒక్కడినే 2013, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. గులాబీ మూవీస్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నిత్యా మీనన్ నటించగా, కార్తీక్ సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రం ఔర్ ఏక్ దుష్మన్ పేరుతో హిందీలోకి, కనలట్టమ్ పేరుతో మలయాళంలోకి అనువదించబడింది.
ఒక్కడినే | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ రాగా |
రచన | చింతపల్లి రమణ |
నిర్మాత | సి. వి. రెడ్డి |
తారాగణం | నారా రోహిత్ నిత్యా మీనన్ |
ఛాయాగ్రహణం | ఆండ్రూ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | కార్తీక్ |
నిర్మాణ సంస్థ | గులాబీ మూవీస్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 14, 2013 |
సినిమా నిడివి | 133 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ చిత్రం 2012, జనవరి 5న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించబడింది.[3] అదే రోజు మొదటి షెడ్యూల్ ప్రారంభించబడి, 2012, జనవరి 9 వరకు హైదరాబాదులో చిత్రీకరణ కొనసాగింది.[4] 2012, ఫిబ్రవరి 24న అరకులో ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభించబడింది.[5] క్లైమాక్స్ దృశ్యాలు 2012, జూన్ 28 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించబడ్డాయి.[6] రామోజీ ఫిల్మ్ సిటీలో రచనా మౌర్య, 70 మంది ఇతర నృత్యకారులతో ‘పుట్టింటొల్లు తరిమేసారు…’ (జయమాలిని సూపర్ హిట్ పాట రీమిక్స్) అనే ఐటమ్ సాంగ్ చిత్రీకరించబడింది.[7]
ఒక్కడినే | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 22 అక్టోబరు, 2012 | |||
Recorded | 2012 | |||
Genre | పాటలు | |||
Length | 21:02 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | క్తారీక్ | |||
కార్తీక్ chronology | ||||
|
ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించాడు. తెలుగులో కార్తీక్ కు ఇది తొలి సినిమా. 2012, అక్టోబరు 22న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ చిత్ర ఆడియో విడుదలయింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, కృష్ణంరాజు, కెఎల్ నారాయణ, సాగర్, ప్రసన్న కుమార్, శేఖర్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, గోపినాథ్ రెడ్డి, అశోక్ కుమార్ విచ్చేసారు.[8] నందమూరి బాలకృష్ణ ఆడియో ఆవిష్కరించారు.[9]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "సీతాకోక నచ్చావే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | కార్తీక్, కె.టి. దర్శన | 3:56 | ||||||
2. | "హేయ్ పో (రచన: కృష్ణ చైతన్య)" | శ్వేత మోహన్ | 4:24 | ||||||
3. | "డోలా డోలా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | విజయ్ ప్రకాష్, పూజా, మాళవిక | 4:24 | ||||||
4. | "పుట్టింటోళ్ళు తరిమేసారు (రచన: సాహితి)" | రంజిత్, గీతా మాధురి, స్టీవ్ వట్జ్ | 3:41 | ||||||
5. | "హోలా హోలా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | కార్తీక్, ఎం.ఎం. మనస్వి | 4:37 | ||||||
21:02 |
4 కోట్ల రూపాయలకు సన్ టివి నెట్వర్క్ వాళ్ళు శాటిలైట్ హక్కులు తీసుకున్నారు.[10]
ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి U/A సర్టిఫికేట్ అందుకుంది.[11] ఈ చిత్రాన్ని 2012, డిసెంబరు 7న విడుదల చేయాలని అనుకున్నారు, కాని చాలాసార్లు వాయిదా పడింది.[12][13] చివరగా ఈ చిత్రం 2013, ఫిబ్రవరి 14న[14] ప్రేమికుల దినోత్సవం[15] రోజున విడుదలయింది.
ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రతికూలంగా మిశ్రమ సమీక్షలను అందుకుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.