From Wikipedia, the free encyclopedia
సత్య కృష్ణన్ ఒక ప్రముఖ సినీనటి. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న ఆమెను శేఖర్ కమ్ముల తన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. సత్య కృష్ణన్ ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. ఆనంద్ సినిమాలో కథానాయికకు స్నేహితురాలిగా ఆమె పోషించిన అనిత పాత్ర బాగా ప్రాచుర్యం పొందింది.
సత్య కృష్ణన్ హైదరాబాదులో తన చదువు పూర్తిచేసింది.[2] హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె హైదరాబాదులోని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ఉద్యోగంలో చేరింది. ఎయిర్ హోస్టెస్ కావాలనేది ఆమె కల.[3] 2000 లో శేఖర్ కమ్ముల తన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. తరువాత ఆమె వివాహం చేసుకుని పంజాగుట్ట లోని ఓ బ్యాంకు ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్ళ తరువాత మళ్ళీ శేేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకి ఆమెకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు దక్కింది. దాంతో ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తి స్థాయి నటిగా మారింది.[4]
తరువాత బొమ్మరిల్లు, మొదటి సినిమా, వినాయకుడు లాంటి ఆదరణ పొందిన చిత్రాల్లో నటించింది. మొదటి సారిగా మెంటల్ కృష్ణ అనే సినిమాలో కథానాయికగా నటించింది. కానీ ఆ సినిమా విమర్శలపాలైంది.
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2000 | డాలర్ కలలు | అర్చన | |
2004 | ఆనంద్ | అనిత | విజేత , ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు
ప్రతిపాదన- ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు |
2005 | మొదటి సినిమా | ||
2006 | ప్రేమంటే ఇంతే | ||
బొమ్మరిల్లు | సిద్ధు కోడలు | ||
సామాన్యుడు | విద్య | ||
నువ్వే | |||
2007 | అత్తిలి సత్తిబాబు ఎల్‌కెజి | ||
బహుమతి | |||
వియ్యాలవారి కయ్యాలు | |||
2008 | సిద్ధంగా ఉంది | రాజా రామ్ భార్య | |
ఉల్లాసంగ ఉత్సాహంగా | అరవింద్ కోడలు | ||
రక్ష | మధు వేణు | ||
వినాయకుడు | అపర్ణ | ||
2009 | మెంటల్ కృష్ణ | సత్య ముద్దుకృష్ణ | |
2010 | కళ్యాణ్‌రామ్ కత్తి | రామకృష్ణ కోడలు | |
2011 | వస్తాడు నా రాజు | ||
వైకుంటపాళి | తన్మయి | ||
బబ్లూ | |||
మాయగాడు | స్పందన | ||
ధడ | రియా అమ్మ | ||
దూకుడు | అజయ్ బంధువు | ||
2012 | ఒక్కడినే | ||
సుందరమైన | సత్య | ||
ఇష్క్ | గీత | ||
ఎందుకంటే... ప్రేమంట! | డాక్టర్ | ||
రచ్చ | |||
శ్రీమన్నారాయణుడు | |||
యముడికి మొగుడు | నరేష్ కోడలు | ||
ఢమరుకం | |||
2013 | బాద్షా | సుప్రియ సింహా | |
అహ నా ప్రేమంట | సత్య | ||
దూసుకెళ్తా | |||
ఒక్కడినే | |||
ప్రేమ గీమ జాంత నై | |||
బ్యాండ్ బాజా | |||
గాలి శీను | |||
2014 | మనం | లెక్చరర్ | |
గోవిందుడు అందరివాడేలే | అభిరామ్ అత్త | ||
పిల్లా నువ్వు లేని జీవితం | సత్య | ||
2015 | ఓరి దేవుడోయ్ | సరస్వతి | |
జేమ్స్ బాండ్ | |||
బలే బలే మగాడివోయ్ | నందన బంధువు | ||
తను నేను | |||
365 రోజులు | |||
సౌఖ్యం | దేవా భార్య | [5] | |
తరువత కథ | |||
2016 | ఊపిరి | ఫిజియోథెరపిస్ట్ | |
ఈడో రకం ఆడో రకం | సత్య | ||
2017 | లండన్ బాబులు | కుటుంబ సహాయకుడు | |
రారండోయ్ వేడుక చూద్దాం | |||
రాజు గారి గది 2 | లెక్చరర్ | ||
హలో | ప్రియ తల్లి | ||
2018 | ఆచారి అమెరికా యాత్ర | దేవసేన | |
నేల టిక్కెట్టు | వృద్ధుడి కోడలు | ||
నా పేరు సూర్య | ముస్తఫా భార్య | ||
పంతం | ఇంటి యజమాని భార్య | ||
నీవెవరో | అను తల్లి | ||
దేవదాస్ | దాస్ కోడలు | [6] | |
బ్యాండ్ బాజా | |||
టాక్సీవాలా | డాక్టర్ | ||
2019 | తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | నకిలీ సాక్షి | |
పిచ్చోడు | రిషి తల్లి | ||
మిస్టర్ మజ్ను | నిక్కీ కోడలు | ||
2020 | హిట్ : 1 | ప్రియా | [7] |
2021 | అల్లుడు అదుర్స్ | పాండు సోదరి | |
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | హర్ష సోదరి | ||
2022 | ఆడవాళ్లు మీకు జోహార్లు | చిరు అత్త | |
టెన్త్ క్లాస్ డైరీస్ | గౌరవ్ భార్య | ||
బుజ్జి ఇలా రా | పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు | ||
గాలోడు | |||
అమ్ము | పోలీస్ కానిస్టేబుల్ | ||
2023 | సామజవరగమణ | సరయు అత్త | |
అసలు | |||
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ | లిఖిత అత్త | [ ఆధారం అవసరం ] | |
2024 | ఇంటి నం. 13 | ||
2024 | ధూం ధాం | ||
2024 | మత్తు వదలరా 2 |
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2008 | సంతోష్ సుబ్రమణ్యం | సంజయ్ భార్య |
2012 | వినాయగా | అపర్ణ |
2016 | తోజ | ఫిజియోథెరపిస్ట్ |
తమిళసెల్వనుమ్ తనియార్ అంజలుమ్ | శక్తివేల్ భార్య |
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2007 | FM ఫన్ ఔర్ మస్తీ |
సంవత్సరం | పేరు | పాత్ర | నెట్వర్క్ | మూ |
---|---|---|---|---|
2020 | అమృతం ద్వితీయం | సంజీవిని (సంజు) | జీ5 | |
లూజర్ | రుక్సానా | |||
2023 | సేవ్ ద టైగర్స్ | స్పందన | డిస్నీ+ హాట్‌స్టార్ | |
దూత | కొణిదెల లక్ష్మి | అమెజాన్ ప్రైమ్ వీడియో |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.