ఒక్కడినే

శ్రీనివాస్ రాగా దర్శకత్వంలో 2013లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

ఒక్కడినే

ఒక్కడినే 2013, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. గులాబీ మూవీస్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నిత్యా మీనన్ నటించగా, కార్తీక్ సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రం ఔర్ ఏక్ దుష్మన్ పేరుతో హిందీలోకి, కనలట్టమ్ పేరుతో మలయాళంలోకి అనువదించబడింది.

త్వరిత వాస్తవాలు ఒక్కడినే, దర్శకత్వం ...
ఒక్కడినే
Thumb
ఒక్కడినే సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీనివాస్ రాగా
రచనచింతపల్లి రమణ
నిర్మాతసి. వి. రెడ్డి
తారాగణంనారా రోహిత్
నిత్యా మీనన్
ఛాయాగ్రహణంఆండ్రూ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంకార్తీక్
నిర్మాణ
సంస్థ
గులాబీ మూవీస్
విడుదల తేదీ
ఫిబ్రవరి 14, 2013
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటవర్గం

సాంకేతికవర్గం

నిర్మాణం

చిత్రీకరణ

ఈ చిత్రం 2012, జనవరి 5న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించబడింది.[3] అదే రోజు మొదటి షెడ్యూల్ ప్రారంభించబడి, 2012, జనవరి 9 వరకు హైదరాబాదులో చిత్రీకరణ కొనసాగింది.[4] 2012, ఫిబ్రవరి 24న అరకులో ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభించబడింది.[5] క్లైమాక్స్ దృశ్యాలు 2012, జూన్ 28 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించబడ్డాయి.[6] రామోజీ ఫిల్మ్ సిటీలో రచనా మౌర్య, 70 మంది ఇతర నృత్యకారులతో ‘పుట్టింటొల్లు తరిమేసారు…’ (జయమాలిని సూపర్ హిట్ పాట రీమిక్స్) అనే ఐటమ్ సాంగ్ చిత్రీకరించబడింది.[7]

పాటలు

త్వరిత వాస్తవాలు ఒక్కడినే, పాటలు by కార్తీక్ ...
ఒక్కడినే
పాటలు by
Released22 అక్టోబరు, 2012
Recorded2012
Genreపాటలు
Length21:02
Labelఆదిత్యా మ్యూజిక్
Producerక్తారీక్
కార్తీక్ chronology
అరవన్
(2011)
ఒక్కడినే
(2012)
కొరియర్ బాయ్ కళ్యాణ్
(2015)
మూసివేయి

ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించాడు. తెలుగులో కార్తీక్ కు ఇది తొలి సినిమా. 2012, అక్టోబరు 22న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ చిత్ర ఆడియో విడుదలయింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, కృష్ణంరాజు, కెఎల్ నారాయణ, సాగర్, ప్రసన్న కుమార్, శేఖర్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, గోపినాథ్ రెడ్డి, అశోక్ కుమార్ విచ్చేసారు.[8] నందమూరి బాలకృష్ణ ఆడియో ఆవిష్కరించారు.[9]

మరింత సమాచారం క్రమసంఖ్య, పేరు ...
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సీతాకోక నచ్చావే (రచన: రామజోగయ్య శాస్త్రి)"  కార్తీక్, కె.టి. దర్శన 3:56
2. "హేయ్ పో (రచన: కృష్ణ చైతన్య)"  శ్వేత మోహన్ 4:24
3. "డోలా డోలా (రచన: రామజోగయ్య శాస్త్రి)"  విజయ్ ప్రకాష్, పూజా, మాళవిక 4:24
4. "పుట్టింటోళ్ళు తరిమేసారు (రచన: సాహితి)"  రంజిత్, గీతా మాధురి, స్టీవ్ వట్జ్ 3:41
5. "హోలా హోలా (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  కార్తీక్, ఎం.ఎం. మనస్వి 4:37
21:02
మూసివేయి

టివి హక్కులు

4 కోట్ల రూపాయలకు సన్ టివి నెట్వర్క్ వాళ్ళు శాటిలైట్ హక్కులు తీసుకున్నారు.[10]

విడుదల

ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి U/A సర్టిఫికేట్ అందుకుంది.[11] ఈ చిత్రాన్ని 2012, డిసెంబరు 7న విడుదల చేయాలని అనుకున్నారు, కాని చాలాసార్లు వాయిదా పడింది.[12][13] చివరగా ఈ చిత్రం 2013, ఫిబ్రవరి 14న[14] ప్రేమికుల దినోత్సవం[15] రోజున విడుదలయింది.

స్పందన

ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రతికూలంగా మిశ్రమ సమీక్షలను అందుకుంది.

  • టైమ్‌సోఫాప్.కామ్ రేటింగ్ - 2.25/5[16]
  • వన్ఇండియా ఎంటర్టైన్మెంట్ రేటింగ్ - 2.5/5[17]
  • టైమ్స్ ఆఫ్ ఇండియా రూటింగ్ - 2/5[18]
  • రెడిఫ్ - 1.5/5[19]

పురస్కారాలు

  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ ఫైట్ మాస్టర్ (గణేష్) విభాగంలో అవార్డు వచ్చింది.[20][21][22][23]

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.