ఫిలిం సిటీ అఫ్ ఇండియా From Wikipedia, the free encyclopedia
రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో[1] ఉంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు ఉన్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.
రామోజీ ఫిల్మ్ సిటీ | |
---|---|
తరహా | ప్రైవేట్ |
స్థాపన | 1996 |
ప్రధానకేంద్రము | హైదరాబాదు తెలంగాణ, భారతదేశం |
కీలక వ్యక్తులు | రామోజీరావు, వ్యవస్థాపకుడు, రామోజీ గ్రూపు |
పరిశ్రమ | చిత్ర పరిశ్రమ |
యజమాని | రామోజీరావు |
మాతృ సంస్థ | రామోజీ గ్రూపు |
రామోజీ ఫిల్మ్ సిటీకి చేరడానికి రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణీయమైన బస్సులున్నాయి. ఈ బస్సులు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలను తీసుకుని నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తుంటారు.ఈ బస్సులద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకునే సమయంలో వారు ఏర్పాటు చేసిన గైడు తరువాత సందర్శలుకు ఏమి చేయాలి ఎక్కడ నిలవాలి అన్నసూచనలను అంద చేస్తాడు. ఈ బస్సులు సందర్శకులను రామోజీ ఫిల్మ్ సిటీ ముఖద్వారం వరకు తీసుకు వెళ్ళి నిలుపుతాయి. ఆ తరువాత సందర్శకులు అక్కడ టిక్కట్టు కొనవచ్చు. టిక్కట్లు కొన్ని ప్యాకేజీలతో, మరికొన్ని ఒక్క రోజు మాత్రమే చూడడానికి అనుమతిచ్చేవి లభ్యమౌతాయి. సందర్శకులు టిక్కట్టు కొన్న తరువాత వారిని అవే బస్సులు అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి తీసుకు వెళ్ళి వదులుతాయి. సందర్శకులు తిరిగి వచ్చే వరకు ఆ బస్సులు అక్కడే ఉండి సందర్శకులను తిరిగి వారు బయలుదేరిన ప్రదేశాలకు చేరుస్తాయి. ఇతర వాహనాల మీద వచ్చే సందర్శకులు టిక్కట్టు ఇచ్చే ప్రదేశంలో ఆగ వలసి ఉంటుంది.
అక్కడి నుండి రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు వారిని ఎనిమిది కిలోమీటర్ల సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తాయి. కనుక టిక్కట్టు ఇచ్చే ప్రదేశం నుండి ప్రైవేటు వాహనాలు సంస్థ అనుమతి లేని వాహనాలు లోపల ప్రవేశించడానికి వీలు ఉండదు. రామోజీ ఫిల్మ్ సిటీ లోనికి ఎటువంటి ఆహార పదార్ధాలు తీసుకు వెళ్ళ కూడదు. సందఎర్శకులు వారికి కావలసిన ఆహార పానీయాలను లోపల ఉన్న స్టాల్స్ వద్ద ఖరీదు చేయాలి. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకు కెమేరా, సెల్‌ఫోన్ ఇతర విద్యుత్ పరికరాలను తీసుకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు. సందర్శకులకు లోనికి ప్రవేశించే ముందు తనిఖీలను నిర్వహిస్తారు. చేతి సంచి, హ్యాండ్ బ్యాగులను మాత్రమే వెంట తీసుకుని వెళ్ళ వచ్చు. సందర్శకులు తమ ఇతర లగేజులను భద్రపరచడానికి కావలసిన సదుపాయము ఉంది. కనుక సందర్శకులు తమ సామానులను వెలుపలి వాహన నిలయము వద్ద భద్రపరచుకుని తిరిగి వెలుపలకు రాగానే తీసుకొన వచ్చు. గైడ్ ఇందుకు తగిన సహాయ సహకారాలను అందిస్తాడు.
అలా రెండు విధములైన బస్సులలో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి చేరిన తరువాత సందర్శకుల లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న బస్సు స్టాండు లలో నిలిచి రామోజీ ఫిల్మ్ సిటీ లోపల తిరిగే బస్సులలో స్టూడియో టూరుకు వెళ్ళ వచ్చు. బస్సులు ఎక్కే సమయంలో సందర్శకులు క్యూలలో క్రమ పద్ధతిలో ఎక్కాలి. ఈ బస్సులు, బస్సుస్టాండ్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బస్సులో ఎక్కిన తరువాత గైడు అక్కడ విశేషాలను సందర్శకులకు వివరిస్తూ ఉంటాడు. ఈ బస్సులు సందర్శకులను స్టూడియోలలో తిప్పుతూ వాటి విశేషాలను సందర్శకులకు వర్ణించి చెప్తుంటారు. వీరు సందర్శకులను ఒక్క ప్రదేశంలో మాత్రమే ఆపి అక్కడ కొన్ని నిముషాల సమయం ఆకర్షణీయమైన రాజమహల్ సెట్లను చూసే అవకాశం కల్పిస్తారు. సమయంలో సందర్శకులు బస్సు నంబరు గుర్తించి తాము ఎక్కిన బస్సులోనే తిరిగి ఎక్కవలసి ఉంటుంది. తీసుకు వెళ్ళి హవా మహల్ అనే ప్రదేశంలో విడిచి పెడతారు. ఈ బస్సులు సందర్శకులను మరి కొంత దూరం తీసుకు వెళ్ళి హవా మహల్ వద్ద విడిచి పెడతాయి. అక్కడ సందర్శకులు అక్కడ ఉన్న రెస్టారెంటలలో చిరుతిండి, పానీయాలు, మినరల్ వాటర్ వంటివి కొనుక్కునే ఏర్పాట్లు ఉన్నాయి. సందర్శకులు అక్కడ కొంత విశ్రాంతి
తీసుకుని అక్కడ ఉన్న హవా మహల్ చూసి దిగువకు దిగి వేరొక బస్సులో ఎక్కి వేరొక ప్రదేశానికి చేర వచ్చు. అప్పుడు సందర్శకులు ఏ బస్సు అయినా ఎక్కే అవకాశం ఉంది. ఆ బస్సులలో సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులకు చేరుకో వచ్చు. ఈ బస్సులు సందర్శకులను గుహల వద్ద వదిలి వెడతాయి. అక్కడ నుండి సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులను చూడ వచ్చు. తరువ సందర్శకులు అక్కడ ఉన్న బస్సు నిలయానికి చేరుకుని అక్కడ ఉన్న బస్సు ఎక్కి ఫిల్మీ మ్యాజిక్ ఉన్న ప్రదేశానికి చేర వచ్చు. ఈ బస్సులు వేటికి ప్రత్యేక రుసుము ఏమీ చెల్లించనవసరం లేదు. ఫిల్మీ మ్యాజిక్ చేరుకునే సమయానికి దాదాపు భోజన సమయం ఔతుంది. ఫిల్మీ మ్యాజిక్ వద్ద ఖరీదైన అంతర్జాతీయ శైలి రెస్టారెంట్లలో ఆహారం తిని కొంత విశ్రాంతి తీసుకున్న సందర్శకులు ఫిల్మీ మ్యాజిక్ వద్ద నిర్వహిస్తున్న షోలను సందర్శించ వచ్చు.
సందర్శకుల కొరకు నిర్వహిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రదర్శనలన్నీ ఫిల్మీ మ్యాజిక్ వద్దే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు విశ్రాంతి తీసుకొనడానికి అనువుగా ఎర్పాట్లు చేసి ఉన్నారు. బహిరంగంగా కొందరు అప్పుడప్పుడూ ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. సందర్శకులు ఆ ప్రదర్శనలను చూసి ఆనందిస్తుంటారు. తరువాత రియల్ స్టంట్, స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి షోలను క్యూలో వెళ్ళి చూడవచ్చు. రియల్ స్టంటు కళాకారులు కృత్రిమ స్టంట్ ప్రదర్శనను ఇస్తూంటారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. దృశ్యచిత్రీకరణ ప్రదర్శనలో ముందుగా సందర్శకులను ఒక చిన్న హాలులో గుమి కూడేలా చేస్తారు. అక్కడ సందర్శకులలో నుండి ఒక జంటను పిలిచి వారిని హీరో హీరోయిన్లగా ప్రకటిస్తారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను కొన్ని ద్వారాలను తెరిచి వాటి ద్వారా వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ఔట్ డోర్ దృశ్యాలను చిత్రీకరించడానికి కొన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి. జరగబోయే కార్యక్రమాలను నిర్వాహకులు సందర్శకులకు వివరించి ముందుగా ఎన్నుకున్న జంట చేత ఒక లఘు దృశ్యంలో నటింపచేస్తారు. ఆదృశ్యాలను తెర మీద చూపుతారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ముందుగా చిత్రించిన దృశ్యాలకు డబ్బింగ్ జత చేస్తారు. డబ్బింగ్ సహాయం ప్రేక్షకుల నుండి ఉత్సాహ వంతులైన వారిని తీసుకుని చేస్తారు. తరువాత ఆదృశ్యాలను ప్రేక్షకులకు చూపి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ప్రేక్షకులకు చిత్రీకరించిన దృశ్యానికి వేరొక చోట చిత్రీకరించిన ఔట్ డోర్ దృస్యాలను మరి కొన్నింటిని అవసరమైన మేరకు జత చేర్చి చూపుతారు. ఇలా సందర్శకులకు చిత్రీకరణ రహస్యాలను ప్రత్యక్షంగా చూపడమే కాక వాటిలో ఉన్న శ్రమను కొంత హాశ్యాన్ని జత చేసి అవగాహన కలుగచేస్తారు. ఇంతటితో ఈ ప్రదర్శన పూర్తి అయినట్లే. సందర్శకులు రామోజీ టవర్స్ భవనంలో నిర్వహించే ప్రదర్శన కొరకు సందర్శకులు క్యూలో నిలిచి వచ్చి చేరుకుంటారు. అక్కడ నుండి సందర్శకులను చిన్న ట్రాలీ వంటి వాహనాలలో ఎక్కించి తరువాత సీటు నుండి కదలకుండా ఏర్పాటు చేసి రైడ్‌కు తీసుకు వెడతారు. సందర్శకులు ట్రాలీలో కూర్చుని ప్రయాణం చేస్తూ ఇరువైపులా బొమ్మల కదలికతో ఏర్పాటు చేసిన చక్కని దృశ్యాలను చూడ వచ్చు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన మందమైన కాంతిలో కదిలే బొమ్మలు వివిధ దృశ్యాల రూపంలో సందర్శకులను ఆకర్షిస్తాయి. భూకంపం దృశ్యాన్ని ప్రదర్శించే షో కొరకు సందర్శకులు వేరొక క్యూలో నిలిచి చేరుకుంటారు. మినీ దియేటర్ లాగా ఉండే ఈ ప్రదర్శన శాలలో సందర్శకులు చేరగానే వారిని ఆశీనులను చేసి స్పెషల్ ఎఫెక్ట్ సాయంతో ప్రేక్షకులను ఎత్తుకు తీసుకు వెళ్ళిన అనుభూతిని ఉన్న చోటు నుండే కలిగిస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీ అంతా పై నుండి విహంగ వీక్షణంలా చూస్తున్న సమయంలో ఉన్నట్లుండి అతి చక్కటి నైపుణ్యంతో ప్రేక్షకులను వర్షం కురిసే అనుభూతికి లోను చేస్తారు. ఆ దృశ్యంలో ప్రేక్షకుల మీద నిజంగా నీటిని చల్లే ఏర్పాటు చేసి దృశ్యంలో ప్రేక్షకులను ఒక భాగమైన అనుభూతిని కలుగ చేస్తారు. చివరగా భూకంపం వచ్చినట్లు నిర్మాణాలు కూలి పోయినట్లు దృశ్యాలు చూడ వచ్చు. ఈ మొత్తం సన్ని వేశంలో ప్రేక్షకులను ఒక భాగంయినట్లు అనుభూతిని కలిగించడం ఈ ప్రదర్శనలో ప్రత్యేకత. ఈ ప్రదర్శన చూసి బయటకు వచ్చే దారిలో సందర్శకులు తమకు కావలసిన వస్తువులను కొనుక్కునే షాపింగ్ మాలుకు చేరుకుంటారు. అక్కడ కావలసిన వారు ఫిల్మ్ సిటీ సందర్శన జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా వస్తువులను కొనుగోలు చేయ వచ్చు. ఆ హాలు లోపలి నిర్మాణం ఆ ప్రదర్శనకు తగిన విధంగా భూకంపానికి గురి అయినట్లు నిర్మించడము ఒక ప్రత్యేకత. కనుక అక్కడ నుండి బయటకు వచ్చే వరకు సందర్శకులు భూకంప అనుభూతిని పొందుతూ ఉంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.