From Wikipedia, the free encyclopedia
అంతరాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. అంతరాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. తెలుగు పద్య కావ్యాలలో వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.
స్వర్ణమయ సంధ్య యది చంచలమ్మై పిల్చు
వర్ణముల చిత్ర మది వైభవమ్మై నిల్చు
కర్ణములు గీతికల కాకలీ-నాదంపు
పూర్ణ-సుఖ మందె నహ బుద్బుదమ్మీ యింపు!
ఇది తటాలున చూచినప్పుడు తేటగీతి, ద్విపద మొదలయిన వానివలె భాసించును. అట్లనుకొని చూచిన ఎడల దాని అసలు నడవడి మనకు స్ఫురించదు.పాదమున యతి వరకు తుంచుకొని, నడక సరిచూడవలెను. అనంతుడు '''అక్కరల యతి నిర్ణయము ''' నిట్లని చెప్పియున్నాడు:
విరతి-చతుర్గణము మహా
క్కర మేకోనాక్షర త్రిగణ మంతరకున్
వరగణయుగ యతి నల్పా
క్కర మధ్యయు మధురయుం ద్రిగణయతుల-హరీ! "
ఏకోనాక్షర త్రిగుణము విరతి, అంతరాక్కరకు: అనగా మూడవ గణమున చివరి అక్షరమునకు ముందు విశ్రాంతి ఏర్పడును. మూడవ గణము చివరి అక్షరమున వళి (యతి) నిలుచునని సారాంశము. అనంతుని అంతరాక్కరకు ఉదాహరణ:
ఇను డొకండును నింద్రి-లిద్దరును నొక్క
వనజ వైరియు గూడి-వైభవ మొనర్చ
గనక వస్త్రుని గృత్త-కైటభుని గొల్తు
రనుచు జెప్పుదు రంత-రాక్కర బుధులు.
ఈ పద్యము కర్ణాట చతుష్పద (5 మాత్రల గణములు, ఒక సూర్య గణము) రీతిగాను, ద్విపద రీతిగాను నడచినది (చివరి పాదము). రెండవ పాదము తేటగీతి రీతిగా గూడ నడచును.
అనంతునకు తరువాతివారగు చిత్రకవి పెద్దనార్యుడును, అప్పకవియు ఇట్లే త్రిగణాంత వర్ణమున యతి నిలువవలెనని చెప్పురి. చిత్రకవి పెద్దనార్యుడు దీనిని అక్కరల 5 ఇంటిలో చివరిదిగా పేరొనినాడు. తక్కిన వారందరు దీనిని నాల్గవదానిగా చెప్పిరి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.