మత్తకోకిల
From Wikipedia, the free encyclopedia
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
మత్తకోకిల
సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్ మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.
ఉదాహరణ 1
రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపతీ
లక్షణములు
నడక
- మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
- తాన తానన తాన తానన తాన తానన తాన తా
ఉదాహరణ 2
అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్
ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై
తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా
జన్యమున్ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున్
గ్రహించగలరు
మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric"గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయ వచ్చు!
మూస:వృత్తములు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.