తరలము

ఉదాహరణ 1

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ

శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో

దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో

ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్

లక్షణములు

  • పాదాలు : నాలుగు
  • ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
  • యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
  • ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

నడక

  • మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
  • తనన తానన తాన తానన తాన తానన తాన తా

ఉదాహరణ 2

"క్రతుశతంబుల బూర్ణకుక్షివి కాని, నీవిటు క్రేపులున్

సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక

స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా

సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!

పోతన భాగవతము - 10 - 569"

గ్రహించగలరు

  • ఇది మత్తకోకిలకి జంట వృత్తము
  • మత్తకోకిలలోని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.