సుశీల్‌కుమార్ శంభాజీరావు షిండే (జ.1941, సెప్టంబరు 4; షోలాపూరు, భారతదేశం) మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా, శక్తి శాఖ మంత్రిగా ఉన్నారు. 2014, మే 26 వరకు లోక్ సభ సభాపతిగా కూడా పనిచేశాడు.[1][2] అంతకు మునుపు 2003, జనవరి 18 నుండి 2004 అక్టోబరు వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు.

త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
సుశీల్‌కుమార్ షిండే
Thumb


అంతర్గత వ్యవహారాల మంత్రి
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

శక్తి మంత్రిత్వ శాఖమంత్రి
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

ముందు సుర్జీత్ సింగ్ బర్నాలా
తరువాత రామేశ్వర్ ఠాకూర్

గవర్నరు మహమ్మద్ ఫజల్
ముందు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
తరువాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
ఇతర రాజకీయ పార్టీలు యునైటెడ్ ఫ్రంట్ (1996–2004)
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (2004–present)
పూర్వ విద్యార్థి దయానంద కళాశాల, షోలాపూరు
శివాజీ విశ్వవిద్యాలయం
ముంబై విశ్వవిద్యాలయం
షోలాపూరు విశ్వవిద్యాలయం
మూసివేయి

సుశీల్ కుమార్ షిండే తన 82 ఏళ్ల వయస్సులో 2023 అక్టోబరు 25న క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[3]

ప్రారంభ జీవితం, విద్య

షిండే 1941, సెప్టెంబరు 4న మహారాష్ట్రలోని షోలాపూరులో, ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు.[4] షిండే షోలాపూర్లోని దయానంద కళాశాలలో ఆర్ట్సులో హానర్ డిగ్రీతో పట్టభడ్రుడయ్యాడు. ఆ తర్వాత కాలంలో శివాజీ విశ్వవిద్యాలయం, పూణేలోని ఐ.ఎల్.ఎస్. కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తిచేశాడు.[5]

వ్యాసంగం

షిండే షోలాపూరు సెషన్స్ కోర్టులో బైలిఫ్గా జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడ 1957 నుండి 1965 వరకు పనిచేశాడు. ఆ తరువాత, మహారాష్ట్ర రాష్ట్ర పోలీసు విభాగంలో కానిస్టేబులుగా చేరి,[6] పోలీసు సబ్ ఇన్‌స్పెస్టరుగా ఎదిగాడు. ఆ తర్వాత, తన నేరపరిశోధనా గరువైన అముక్‌రాజ్ పాటిల్ దగ్గర ఆరు సంవత్సరాలపాటు మహారాష్ట్ర నేరపరిశోధనా విభాగంలో పనిచేశాడు.[7]

రాజకీయాలు

షిండే భారత జాతీయ కాంగ్రేసు సభ్యుడు. ఈయన 1978, 1980, 1985, 1990లలో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.[8] 1992 జూలై నుండి 1998 మార్చి వరకు మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[9] 2002లో, షిండే భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసి ఎన్.డి.ఏ అభ్యర్థి భైరాన్ సింగ్ షెకావత్‌ చేతిలో పరాజయం పొందాడు. 2003 నుండి 2004 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్న సుర్జీత్ సింగ్ బర్నాలా, తమిళనాడు గవర్నరుగా నియమితుడైనప్పుడు, 2004 అక్టోబరు 30న ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. గవర్నరుగా 2006, జనవరి 29 వరకు ఉన్నాడు.

షిండే 2006, మార్చి 20న రెండవసారి మహారాష్ట్రనుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, ఆయన స్థానంలో షిండే లోక్‌సభలో అధికారపక్ష నేతగా ఎన్నికయ్యాడు.[10] 2006 నుండి 2012 వరకు షిండే కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖ మంత్రిగా చేశాడు. 2012లో హోం మంత్రిగా నియమితుడయ్యాడు.[11][12] 2014 లోక్‌సభ ఎన్నికల్లో, భారత జాతీయ పార్టీ అభ్యర్థి శరద్ బన్సోడే చేతిలో ఓడిపోయాడు.

విమర్శలు, వివాదాలు

ఉత్తర భారతదేశంలో విద్యుత్ విఫలం

2012లో ఉత్తర భారతదేశం పవర్ గ్రిడ్ విఫలమైన సందర్భంల, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ, ఇలాంటి వైఫల్యం భారతదేశానికి మాత్రమే పరిమితమైనది కాదని, గత కొద్ది సంవత్సరాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కూడా ఇటువంటి బ్లాక్‌అవుట్లు ఎదుర్కొన్నాయి అని వ్యాఖ్యానించాడు.[13][14] ఈ సమస్య ప్రారంభమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు, గ్రిడ్ పండు వేసవిలో, పెరుగుతున్న విద్యుత్తు డిమాండును తట్టుకోలేక విఫలమైందని వివరించారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పోరేషన్ అధ్యక్షుడు అవినాశ్ అవస్థి, ఎండాకాలం డిమాండును ఎదుర్కోవటానికి ఇతర రాష్ట్రాలు తమకు కేటాయించిన దానికంటే ఎక్కువ విద్యుత్తును లాగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించాడు.[14]

"హిందూ తీవ్రవాదం" వ్యాఖ్య

జైపూరు లోని కాంగ్రేస్ సమాలోచన శిబిరంలో ప్రసంగిస్తూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), భాజపా, శిక్షణా శిబిరాలు నిర్వహించి హిందూ తీవ్రవాదాన్ని పోషిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందిందని చెప్పాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబుపేలుళ్లు, మక్కా మసీదు, మాలేగావ్ బాంబుపేలుళ్లలో ఆర్.ఎస్.ఎస్, భాజపా హస్తముందని ఆరోపించాడు. ఈయన వ్యాఖ్యలను నిరాధారమైన ఆరోపణలని భాజపా ఖండించింది. తక్షణమే షిండే రాజీనామా చేయాలని, అలా చేయకపోతే, దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని భాజపా పట్టుబట్టింది.[15] విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు, డా. ప్రవీణ్ తొగాడియా, షిండే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, యావద్దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండు చేశాడు.[16] శివసేన ఈయన వ్యాఖ్యను ఖండిస్తూ, 26/11 తీవ్రవాద దాడి తర్వాత, కాంగ్రేసు తీవ్రవాదానికి మతం, రంగు పులమొద్దని కోరి, ఇప్పుడు దానికి భిన్నంగా "కాషాయ తీవ్రవాదం" అంటూ లేవనెత్తుతుందని వ్యాఖ్యానించింది. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇవి బాధ్యతరహితమైన వ్యాఖ్యలని, స్పష్టంగా షిండే యొక్క అపరిపక్వతను ఎత్తి చూపుతున్నాయని అన్నాడు.[17] పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జమాతుద్దవా, ఈ వ్యాఖ్యలను ఆహ్వానిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినవి.[18]

హఫీజ్ సయ్యద్ ను గౌరవపూర్వకంగా ఉదహరించుట

షిండే, 2012, డిసెంబరు 17న భారత పార్లమెంటు యొక్క ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ముంబై తీవ్రవాద దాడులలో ప్రధాన నిందితుడు, జమాతుద్దవా అధినేత, హఫీజ్ మహమ్మద్ సయ్యద్ ను "మిస్టర్", "శ్రీ" వంటి గౌరవసూచకాలతో సంబోధించి, సుశీల్‌కుమార్ షిండే భారతీయ మాధ్యమాలనుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.[19][20][21][22][23]

ఆదర్శ్ స్కాం, క్విడ్ ప్రో క్వో వివాదం

[24] షిండే, పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉండగా ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, చాలా అనుమతులు పొందింది. కార్గిల్ యుద్ధ అమరవీరుల కోసమై ప్రతిపాదించబడిన ఈ సొసైటీలో, 40% శాతం ఇళ్లు సైనికేతర సభ్యులకు కేటాయించాలని అప్పటి రెవెన్యూ మంత్రి చవాన్ పంపిన ప్రతిపాదనను, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న షిండే ఆమోదించాడు.[25]

వ్యక్తిగత జీవితం

సుశీల్‌కుమార్ షిండే, ఆయన భార్య ఉజ్జ్వలకు ముగ్గురు కూతుర్లు.[26] ఈయన కూతురు ప్రణితి షిండే షోలాపూర్ సిటీ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది.[27]

పాప్యులర్ కల్చర్ లో

మరాఠీ సినిమా, దుసరీ గోష్ట (2014) షిండే బాల్యం నుండి ప్రముఖ రాజకీయనాయకుడిగా ఎదిగే దాక, ఈయన జీవితకథ ఆధారంగా తీయబడింది.[28]

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.