లష్కరే తోయిబా
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
లష్కరే తోయిబా దక్షిణాసియాలో ప్రాబల్యం ఉన్న ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధ. హఫీజ్ మహమ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్ లు కలిసి ఈ సంస్ధను స్ధాపించారు.
లష్కరే తోయిబా | |
---|---|
క్రియాశీలంగా ఉన్న సమయం | 1990 - ప్రస్తుతం |
అధ్యక్షుడు | హఫీజ్ మహమ్మద్ సయీద్ |
లక్ష్యాలు | జమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతంచేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం[1] |
క్రియాశీలంగా ఉన్న ప్రాంతాలు | భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్[1] |
సిద్ధాంతాలు | ఇస్లామిజం, ఇస్లామిక్ ఫండమెంటలిజం, పాన్ ఇస్లామిజం వహ్హబిజం, జమ్ము కాశ్మీర్ స్వాతంత్ర్యం |
ప్రముఖ చర్యలు | ఆత్మాహుతి దాడులు, ముస్లిమేతరుల వధ, భద్రతా దళాలపై దాడులు[1] |
ప్రముఖ దాడులు | జమ్ము కాశ్మీర్ దాడులు; 2008 ముంబై దాడులు |
స్థితి | అమెరికా గుర్తించిన విదేశీ ఉగ్రవాద సంస్థ (26 Dec 2001); యు. కె లో నిషేధం. (2001); పాకిస్థాన్ లో నిషేధం (2002); అమెరికాలో అనుబంధ జమాత్ ఉద్దవా పార్టీ నిషేధం (2006), యు. ఎన్ లో నిషేధం. (2008) |
2001 లో భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడులు, 2019లో పుల్వామాలో భారత సైనిక దళాలపై జరిగిన దాడికి ఈ సంస్థ కారణమంటూ భారతదేశం ఆరోపణలు చేసింది.[2] కాశ్మీర్ ను భారతదేశం నుంచి విడదీసి పాకిస్థాన్ లో కలపడం ఈ సంస్థ ఉద్దేశ్యంగా పేర్కొంది.[3]
ఈ సంస్థను పాకిస్థాన్ లో నిషేధించినా దీని అనుబంధ రాజకీయ సంస్థ జమాత్ ఉద్దవా మాత్రం అప్పుడప్పుడు నిషేధాలకు గురైంది. అయినా ఇది తన గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.