Remove ads
From Wikipedia, the free encyclopedia
ప్రణితి సుశీల్ కుమార్ షిండే (జననం 1980 డిసెంబరు 9) మహారాష్ట్రకు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యురాలు, షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎన్నికైన మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు.[2] ఆమె 2021 నుండి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా.[3] అలాగే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరించింది.[4]
ప్రణితి సుశీల్ కుమార్ షిండే | |
---|---|
మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ | |
Incumbent | |
Assumed office 2009 - ప్రస్తుతం | |
నియోజకవర్గం | షోలాపూర్ సిటీ సెంట్రల్ |
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ | |
Incumbent | |
Assumed office 2021 | |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు | నానా పటోలే |
చైర్పర్సన్- మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ | |
Incumbent | |
Assumed office 2021 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1980 డిసెంబరు 9 |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లిదండ్రులు | సుశీల్ కుమార్ షిండే (తండ్రి) ఉజ్వల షిండే (తల్లి) |
కళాశాల | సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై, ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబై |
నైపుణ్యం | రాజకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త |
As of అక్టోబరు 11, 2022 Source: |
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకుగాను ఆమె కాంగ్రెస్ తరుపున జుక్కల్ నియోజకవర్గానికి అదనపు పరిశీలకురాలిగా వ్యవహరించింది.[5]
ప్రణితి షిండే 1980 డిసెంబరు 9న సుశీల్‌కుమార్ షిండే, ఉజ్వల షిండే దంపతులకు చిన్న కూతురుగా జన్మించింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.[6] సుశీల్ కుమార్ షిండే. గతంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా చేశాడు. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[7]
ఆమె తన ప్రభుత్వేతర సంస్థ (NGO) జైజుయ్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్త.[8] అంతేకాకుండా, తన తండ్రి సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రణితి షిండే రాజకీయ వారసురాలుగా పగ్గాలు అందుకుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.