సుర్జీత్ సింగ్ బర్నాలా
From Wikipedia, the free encyclopedia
సుర్జీత్ సింగ్ బర్నాలా (1925-2017) పంజాబ్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవుల మాజీ గవర్నరు, మాజీ కేంద్రమంత్రి కూడా.
సుర్జీత్ సింగ్ బర్నాలా | |||
![]() | |||
తమిళనాడు గవర్నరు | |||
పదవీ కాలం 3 నవంబరు 2004 – 31 ఆగస్టు 2011 | |||
ముందు | పి.ఎస్. రామ్మాహన రావు | ||
---|---|---|---|
తరువాత | కొణిజేటి రోశయ్య | ||
పదవీ కాలం 9 నవంబరు 2000 – 7 జనవరి 2003 | |||
ముందు | ప్రారంభించబడింది | ||
తరువాత | సుదర్శన్ అగర్వాల్ | ||
పంజాబ్ పదకొండవ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 29 సెప్టెంబరు 1985 – 11 జూన్ 1987 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | అతేలీ, పంజాబ్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియా, (ప్రస్తుతం హర్యానాలో ఉంది) | 1925 అక్టోబరు 21||
మరణం | 14 జనవరి 2017 91) చండీఘర్, భారతదేశం | (aged||
రాజకీయ పార్టీ | శిరోమణీ అకాలీ దళ్[1] | ||
జీవిత భాగస్వామి | సూర్జిత్ కౌర్ బర్నాలా | ||
మతం | సిక్కు మతం |
జీవితం
సుర్జీత్ సింగ్ హర్యానాలోని అతేలీ లోని ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు.[2] ఆయన తండ్రి ఒక న్యాయమూర్తి. 1946 లో బర్నాలా లక్నో విశ్వవిద్యాలయం నుంచి లా పూర్తి చేశాడు. 1942 లో లక్నోలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. తరువాత కొద్ది రోజులు న్యాయవాద వృత్తి కొనసాగించాడు. 1960 దశకం చివర్లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి అకాలీ దళ్ పార్టీ శ్రేణుల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. 1952 లో మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో పోటీ చేసినా కేవలం నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
రాజకీయ ప్రస్థానం
బర్నాలా మొట్టమొదటిసారిగా 1969లో జస్టిస్ గుర్నామ్ సింగ్ ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేశాడు. అమృత్ సర్ లో గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1977 లో భారత పార్లమెంటుకు ఎన్నికై మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు.
శిరోమణి అకాలీ దళ్ అనే సిక్కు సాంప్రదాయ వాద పార్టీకి చెందిన బర్నాలా సెప్టెంబరు 29, 1985 నుంచి మే 11, 1987 వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అప్పుడే పంజాబ్ లో సిక్కు మిలిటెంట్ ఉద్యమం చెలరేగింది. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆయన గవర్నరుగా పనిచేశారు.
మరణం
చండీఘర్‌లోని పిజిఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేరిన ఆయన 2017 జనవరి 14న తుదిశ్వాస విడిచారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.