సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya) (జూలై 19, 1902 - మార్చి 16, 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాసారు. అనేక పాటలు కూడా వ్రాసారు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

త్వరిత వాస్తవాలు సముద్రాల రాఘవాచార్య, జననం ...
సముద్రాల రాఘవాచార్య
Thumb
సముద్రాల రాఘవాచార్య
జననం
సముద్రాల వేంకట రాఘవాచార్యులు

జూలై 19, 1902
మరణంమార్చి 16, 1968
ఇతర పేర్లుసముద్రాల సీనియర్
వృత్తిరచయిత
పిల్లలుసముద్రాల రామానుజాచార్య (ముని మనవడు ) సముద్రాల శ్రీనివాస్
తల్లిదండ్రులు
  • సముద్రాల వేంకట శేషాచార్యులు (తండ్రి)
  • లక్ష్మీతాయారు (తల్లి)
మూసివేయి

జీవిత విశేషాలు

సముద్రాల వేంకట రాఘవాచార్య గుంటూరు జిల్లా, పెదపులివర్రు (భట్టిప్రోలు) గ్రామంలో 1902, జూలై 19వ తేదీన పండితవంశంలో జన్మించారు. ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించారు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో "భాషాప్రవీణ" పరీక్ష ఉత్తీర్ణులైనారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించారు. 1918 నుండి అవధానాలను చేయడం మొదలుపెట్టారు. వీరి అవధాన ప్రావీణ్యాన్ని గురించి విన్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి వీరిని కుమారునికి తెలుగు నేర్పవలసినదిగా కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన సముద్రాల తన మకామును గుంటూరుకు మార్చారు. అక్కడ వారికికొసరాజు రాఘవయ్య చౌదరి, గూడవల్లి రామబ్రహ్మంలతో స్నేహం ఏర్పడింది. కట్టమంచి రామలింగారెడ్డి రెడ్ల చరిత్రపై పరిశోధన చేస్తున్నట్టు తెలుసుకున్న కుప్పుస్వామి చౌదరి వీరిని, కొసరాజును, గూడవల్లిని మద్రాసు వెళ్లి కమ్మ చరిత్రపై పరిశోధనలు చేయవలసినదిగా అభ్యర్థించారు. మద్రాసులో వీరు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో కమ్మచరిత్రపై పరిశోధన చేస్తూ, సమదర్శిని పత్రికలో కూడా పనిచేసారు. సమదర్శిని కారణాంతరాల వల్ల నిలిచిపోగా వీరు మళ్ళీ గుంటూరుకు చేరారు. కృష్ణాజిల్లా ప్రజామిత్ర పక్షం వారు విజయవాడలో ప్రారంభించిన ప్రజామిత్ర పత్రికను మద్రాసుకు తరలించి దానికి సంపాదకునిగా గూడవల్లిని నియమించారు. గూడవల్లి అభ్యర్థన మేరకు సముద్రాల తిరిగి మద్రాసు చేరి ప్రజామిత్రలో సహాయ సంపాదకునిగా చేరారు. ప్రజామిత్ర ప్రచురించే బి.ఎన్.కె ప్రెస్ యజమానులైన బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరులతో వీరికి పరిచయం ఏర్పడింది.[1]

తెలుగు చిత్ర పరిశ్రమ

సినీరంగప్రవేశం

వేల్ పిక్చర్స్ అధినేత పి.వి.దాస్‌తో గూడవల్లి రామబ్రహ్మంకు ఉన్న పరిచయం వల్ల ఆయనతోపాటు సముద్రాల రాఘవాచార్య తరచూ స్టూడియోకు వెళుతుండేవాడు. ఆ స్నేహంతో సీతాకళ్యాణం, శ్రీకృష్ణ లీలలు సినిమాలకు ప్రకటనలు వ్రాసియిచ్చాడు. తరువాత వేల్ పిక్చర్స్ వారి మాయాబజార్,ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే సహకరించాడు. ఆ విధంగా ఇతడు సినిమా రచనలో అనుకోకుండా వేలుపెట్టాడు. తరువాత కనకతార సినిమాలో ఇతనికి సంభాషణలు, పాటలు వ్రాసే అవకాశం చిక్కింది. కనకతార నిర్మాణ సమయంలోనే బి.యన్.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డిలు రోహిణీ పిక్చర్స్ అనే సినీనిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు ఇతడిని రచయితగా పెట్టుకున్నారు. తరువాత బి.యన్.రెడ్డి రోహిణి సంస్థనుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించాడు. వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయాడు. ఇతడు దాదాపు 80 చిత్రాలకు పనిచేసి సుమారు 1000 పాటలను రచించాడు[1].

రచయితగా

  1. కనకతార (1937) (మాటలు, పాటలు) (మొదటి సినిమా)
  2. గృహలక్ష్మి (1938) (కథ, మాటలు, పాటలు)
  3. వందేమాతరం (1939) (మాటలు, పాటలు)
  4. సుమంగళి (1940) (మాటలు, పాటలు)
  5. దేవత (1941) (మాటలు, పాటలు)
  6. భక్త పోతన (1942) (కథ, మాటలు, పాటలు)
  7. జీవన్ముక్తి (1942) (పాటలు)
  8. గరుడ గర్వభంగం (1943) (మాటలు)
  9. భాగ్యలక్ష్మి (1943 (మాటలు, పాటలు)
  10. చెంచులక్ష్మి (1943) (కథ, మాటలు, పాటలు)
  11. పంతులమ్మ (1943) (మాటలు, పాటలు)
  12. స్వర్గసీమ (1945) (మాటలు, కొన్ని పాటలు)
  13. త్యాగయ్య (1946) (మాటలు, కొన్ని పాటలు)
  14. పల్నాటి యుద్ధం (1947) (మాటలు, పాటలు)
  15. యోగి వేమన (1947) (మాటలు, పాటలు)
  16. రత్నమాల (1947) (మాటలు, పాటలు)
  17. బాలరాజు (1948) (మాటలు, పాటలు మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో)
  18. మన దేశం (1949) (చిత్రానువాదం, మాటలు, పాటలు)
  19. లైలా మజ్ను (1949) (మాటలు, పాటలు)
  20. తిరుగుబాటు (1950) (పాటలు)
  21. స్వప్న సుందరి (1950) (మాటలు, పాటలు)
  22. షావుకారు (1950) (పాటలు)
  23. నవ్వితే నవరత్నాలు (1951)
  24. పెళ్లికూతురు (1951) (మాటలు, పాటలు)
  25. స్త్రీ సాహసము (1951) (కథ, మాటలు, పాటలు)
  26. సౌదామిని (1951) (మాటలు, పాటలు)
  27. ధర్మ దేవత (1952) (కొన్ని పాటలు)
  28. చండీరాణి (1953) (మాటలు, పాటలు)
  29. బ్రతుకు తెరువు (1953) (మాటలు) (కథ)
  30. దేవదాసు (1953) (మాటలు, పాటలు)
  31. వయారిభామ (1953) (పాటలు)
  32. విప్రనారాయణ (1954) (మాటలు, పాటలు)
  33. అనార్కలి (1955) (మాటలు, పాటలు)
  34. కన్యాశుల్కం (1955) (కీచకవధ వీధినాటకం)
  35. జయసింహ (1955) (మాటలు) (కథ)
  36. దొంగ రాముడు (1955) (పాటలు)
  37. సంతోషం (1955) (మాటలు, పాటలు)
  38. చరణదాసి (1956) (పాటలు)
  39. జయం మనదే (1956) (మాటలు) (కథ) (కొన్ని పాటలు)
  40. తెనాలి రామకృష్ణ (1956) (మాటలు, పాటలు)
  41. భక్త మార్కండేయ (1956) (కథ, మాటలు, పాటలు)
  42. సొంతవూరు (1956) (కొన్ని పాటలు)
  43. సారంగధర (1957) (కథ, మాటలు, పాటలు)
  44. వినాయక చవితి (1957) (కథ, మాటలు, పాటలు, దర్శకత్వం)
  45. సువర్ణసుందరి (1957) (కొన్ని పాటలు)
  46. భూకైలాస్ (1958) (కథ, మాటలు, పాటలు)
  47. దీపావళి (1960) (కథ, మాటలు, పాటలు)
  48. భక్త రఘునాథ్ (1960) (కథ, చిత్రానువాదం)
  49. సీతారామ కళ్యాణం (1961) (మాటలు, పాటలు)
  50. బాటసారి (1961) (మాటలు, పాటలు)
  51. భక్త జయదేవ (1961) (కథ, మాటలు, పాటలు)
  52. సతీ సులోచన (1961) (కథ, మాటలు, పాటలు)
  53. దశావతారములు (1962) (డబ్బింగ్ సినిమా పాటలు)
  54. స్వర్ణమంజరి (1962) (పాటలు)
  55. నర్తనశాల (1963) (మాటలు, పాటలు)
  56. లవకుశ (1963) (కొన్ని పాటలు)
  57. వాల్మీకి (1963) (కథ, మాటలు, పాటలు)
  58. సోమవార వ్రత మహత్యం (1963) (కథ, మాటలు, కొన్ని పాటలు)
  59. అమరశిల్పి జక్కన (1964) (మాటలు, కొన్ని పాటలు)
  60. బభ్రువాహన (1964) (కథ, మాటలు, పాటలు)
  61. పాండవ వనవాసం (1965) (మాటలు, కొన్ని పాటలు)
  62. సతీ సక్కుబాయి (1965) (కథ, మాటలు, పాటలు)
  63. పరమానందయ్య శిష్యుల కథ (1966)
  64. భక్త పోతన (1966) (కథ, కొన్ని పాటలు)
  65. శకుంతల (1966) (మాటలు, కొన్ని పాటలు)
  66. శ్రీకృష్ణ పాండవీయం (1966) (మాటలు, కొన్ని పాటలు)
  67. శ్రీకృష్ణ తులాభారం (1966) (మాటలు, కొన్ని పాటలు)
  68. భక్త ప్రహ్లాద (1967 సినిమా)
  69. రహస్యం (1967)
  70. శ్రీకృష్ణావతారం (1967) (మాటలు, కొన్ని పాటలు)
  71. భార్య (1968)
  72. వీరాంజనేయ (1968)
  73. శ్రీరామకథ (1968) (చివరగా రచించిన సినిమా)
  74. తారాశశాంకం (1969) (మాటలు, కొన్ని పాటలు) (చివరగా విడుదలైన సినిమా)

దర్శకత్వం

  1. వినాయక చవితి (1957)
  2. భక్త రఘునాథ్ (1960)
  3. బభృవాహన (1964)

నిర్మాత

  1. దేవదాసు (1953) (నిర్మాత) (uncredited)
  2. శాంతి (1952) (నిర్మాత) (uncredited)
  3. స్త్రీసాహసం (1951) (నిర్మాత) (uncredited)

నేపధ్య గాయకుడు

  1. భక్త రఘునాథ్ (1960) (playback singer)

మరణం

ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన శ్రీరామకథ సినిమాకు చివరి పాటను రచించిన సముద్రాల రాఘవాచార్య మరుసటి రోజు 1968, మార్చి 16న మరణించారు. [1].

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.