1956 తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా, మా గోపి చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో తెనాలి రామకృష్ణ సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. ఎన్టీ రామారావు తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో శివాజీ గణేశన్ వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ భానుమతి పోషించింది. జమునకు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.[1] అప్పట్లో అనామక రచయిత అయిన ఆత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చని ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.[2] విశ్వనాథన్ - రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.
తెనాలి రామకృష్ణ (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
---|---|
నిర్మాణం | బి.ఎస్.రంగా |
కథ | సి.కె. వెంకట్రామయ్య (నాటకం) |
తారాగణం | నందమూరి తారక రామారావు (కృష్ణదేవరాయలు), అక్కినేని నాగేశ్వరరావు (తెనాలి రామకృష్ణ), పి.భానుమతి (రంగసాని), జమున, సంధ్య, చిత్తూరు నాగయ్య (తిమ్మరుసు), సంధ్య, మిక్కిలినేని (కనకరాజు), రాజనాల, వంగర, సురభి బాలసరస్వతి, లక్ష్మీకాంతం, రామకోటి (చాకలి) |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల, భానుమతి, పి. సుశీల |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య, వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | బి.ఎస్.రంగా |
నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 12 జనవరి, 1956 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
01. ఆకతాయి పిల్లమూక అందాల చిలకా నాకేసి సూత్తారు నవ్వుతారు - రామకోటి
02. ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా నీ లక్షపు కోరికనాతో ఆనతీయరా - పి.లీల
03. ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచనరాసులెల్ల (పద్యం) - ఘంటసాల
04. కన్నులు నిండె కన్నెల విన్నా మన్నననీ రారాజా - పి. భానుమతి
05. కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త మార్తాండ (పద్యం) - ఘంటసాల
06. గంజాయి తాగి తురకల సంజాతము చేత కల్లు చవికొన్నావా (పద్యం) - ఘంటసాల
07. గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా (పద్యం) - ఘంటసాల
08. గండుపిల్లి మేను మరచి బండనిదుర పోయెరా కొండ ఎలుకనిచట రెండు - ఘంటసాల,నాగయ్య
09. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ కేళీచలన్మణి - సుశీల (జయదేవుని అష్టపది)
10. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో - ఘంటసాల (రచన: సముద్రాల)
11. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములే (విషాదం) - పి. లీల
12. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములే (సంతోషం) - పి. లీల
13. తీరని నా కోరకలే తీరెను ఈ రోజు కురిమి నా చెలిమి కోరెనురా రాజు - పి. భానుమతి
14. తురుపు జూపున జాలిన కొరత నురుపు (పద్యం) - (గాయకుని వివరాలు తెలియవు)
15. తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ (పద్యం) - ఘంటసాల
16. తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబునన్ (పద్యం) - ఘంటసాల
17. తరుణ శశాంక శఖరమరాళమునకు ... ఓ లాల ఓ లాల కంచెల చెరచే - ఘంటసాల, ఎ.పి. కోమల
18. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి (పద్యం) - ఘంటసాల
19. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరి భిక్కిరి (పద్యం) - ఘంటసాల
20. నీవెగా రారాజీవెగా నయవిజయశాలీనీరాయ నీకు సరి నీవెగా - పి. భానుమతి
21. మరుధృతాతటస్త శతృమండలీగళాంతర (శ్లోకం) - (గాయకుని వివరాలు తెలియవు)
22. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అబ్బునే (పద్యం) - ఘంటసాల
23. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) - ఘంటసాల
24. రంజన చెడి పాండవులరిభంజనలై విరటుకొల్వుపాలై రకటా (పద్యం) - ఘంటసాల
25. రాజనందన రాజ రాజస్తతుల సాటి తలప నన్నయవేమ ధరిణి (పద్యం) - (గాయకుని వివరాలు తెలియవు)
26. స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ (పద్యం) - ఘంటసాల
27. శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) - (మాధవపెద్ది సత్యం)
నిడివి - 170 నిమిషాలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.