From Wikipedia, the free encyclopedia
నేషనల్ ఫిల్మ్ అవార్డ్ - స్పెషల్ జ్యూరీ అవార్డ్ (ఫీచర్ ఫిల్మ్) అనేది భారతదేశంలోని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వారు ప్రతి సంవత్సరం అందించే జాతీయ చలనచిత్ర అవార్డులలో ఒకటి. చలన చిత్రాలకు అందించే అనేక పురస్కారాల్లో ఇది ఒకటి. స్పెషల్ జ్యూరీ పురస్కార గ్రహీతలకు రజత కమలం, ₹2,00,000 (US$2,500) నగదు బహుమతి, మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు.
ఈ పురస్కారాన్ని 1978లో 26వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా స్థాపించారు. ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరంలో దేశంలోని అన్ని భారతీయ భాషలలో నిర్మించిన చిత్రాలకు ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం కోసం ఓ ప్రత్యేక రంగం కంటే సినిమా నిర్మాణం లోని అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకుంటారు.
పురస్కార గ్రహీతల జాబితా | ||||||
---|---|---|---|---|---|---|
సంవత్సరం | గ్రహీతలు | ఈ రంగానికి | సినిమాలు | భాషలు | మూలం | Refs. |
1978 (26 వ) | పురస్కారం ఇవ్వలేదు | [1] | ||||
1979 (27 వ) | – | దర్శకుడు | ఆచార్య కృపలానీ | ఇంగ్లీషు | – | |
1980 (28 వ) | పురస్కారం ఇవ్వలేదు | [2] | ||||
1981 (29 వ) | సత్యజిత్ రాయ్ | దర్శకుడు | సద్గతి | హిందీ | ఓ గ్రామం లోని పూజారికీ, ఓ చర్మకారుడికీ మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని చూపించే క్రమంలో వర్ణ వ్యవస్థపై అత్యంతసరళమైన భాషలో అత్యంత తీవ్రమైన వ్యాఖ్యానం చేసినందుకు | [3] |
1982 (30 వ) | పురస్కారం ఇవ్వలేదు | [4] | ||||
1983 (31st) | మంకడ రవివర్మ | దర్శకుడు | నొక్కుకుత్తి | మలయాళం | నాట్యం, కవిత్వం ద్వారా ఓ జానపద గాథకు కొత్త వ్యాకరణాన్ని అద్దినందుకు | [5] |
1984 (32nd) | టి. ఎస్. రంగా | దర్శకుడు | గిద్ధ్ | హిందీ | – | [6] |
1985 (33rd) | సుధా చంద్రన్ | నటి | మయూరి | తెలుగు | తన మొదటి సినిమా లోనే, ధైర్యంంగా దృఢ సంకల్పంతో తన స్వంత జీవిత కథను ఆమోదనీయంగా ప్రదర్శించినందుకు | [7] |
1986 (34 వ) | జాన్ అబ్రహాం | దర్శకుడు | అమ్మ అరియన్ | మలయాళం | అతని దర్శకత్వ నైపుణ్యానికి, ట్రీట్మెంటులో వాస్తవికతకు | [8] |
1987 (35 వ) | ఎం.బి.శ్రీనివాసన్ (మరణానంతరం) | సంగీత దర్శకుడు | – | – | చలనచిత్ర సంగీతం శైలిలో అతని కాంట్రిబ్యూషను కోసం. చలనచిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల సాంకేతిక నిపుణుల సంక్షేమం కోసం కృషి చేసినందుకు, జాతీయ స్థాయిలో బృంద గాన సంగీతానికి మార్గదర్శకత్వం వహించినందుకు | [9] |
1988 (36 వ) | అశోక్ ఆహుజా | దర్శకుడు | వసుంధ | హిందీ | పర్యావరణ వ్యవస్థపై ప్రేమకు, మానవజాతి ప్రకృతికి కలిగిస్తున్న వినాశనం నుండి రక్షించడంలో మానవ పాత్రను నిర్వచించినందుకు | [10] |
1989 (37 వ) | అమితాభ్ చక్రవర్తి | దర్శకుడు | కాల్ అభిరాతి | బెంగాలీ | ఫిల్మ్ మేకింగ్ రంగంలో కొత్త క్షితిజాలను అన్వేషించే ప్రయత్నం చేసిన ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించడంలో అతని నమ్మకానికి, ధైర్యానికి | [11] |
1990 (38 వ) | పంకజ్ కపూర్ | నటుడు | ఏక్ డైరెక్టర్ కీ మౌత్ | హిందీ | మార్గాన్వేషణ స్ఫూర్తికి అవకాశం ఇవ్వక, నిరుత్సాహపరచే వ్యవస్థలో ఔత్సాహిక, సృజనాత్మక మేధస్సు అనుభవించే వేదనను సమర్థవంతంగా ప్రదర్శించినందుకు | [12] |
సన్నీ డియోల్ | నటుడు | ఘాయల్ | హిందీ | ప్రస్తుత పోలీసు వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న దుష్టత్వానికి బలి అయిన యువకుడి ప్రభావవంతమైన చిత్రణకు | ||
జయభారతి | నటి | మరుపక్కం | తమిళం | తెలియకుండానే, మానసికంగా నిర్లక్ష్యం చేయబడిన స్త్రీ వేదనను హత్తుకునేలా చిత్రీకరించినందుకు | ||
1991 (39 వ) | సౌమిత్ర చటర్జీ | నటుడు | అంతర్థాన్ | బెంగాలీ | ముఖ్యంగా సత్యజిత్ రే చిత్రాలలో అతని అత్యుత్తమ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ కోసం. | [13] |
1992 (40 వ) | శివాజీ గణేశన్ | నటుడు | తేవర్ మగన్ | తమిళం | – | [14] |
కేతన్ మెహతా | దర్శకుడు | మాయా మేమ్సాబ్ | హిందీ | – | ||
1993 (41st) | శశి కపూర్ | నటుడు | ముహాఫిజ్ | ఉర్దూ | వస్తువాద విలువల ఒత్తిడితో ఊహల జీవితాన్ని అణగదొక్కే క్రమంలో మరణిస్తున్న మానవీయ సంస్కృతికి ప్రతినిధి అయిన కవి భావాలను సున్నితంగా చిత్రీకరించినందుకు | [15] |
పల్లవి జోషి | నటి | వో చోక్రీ | హిందీ | బాల్యం నుండి యుక్తవయస్సు వరకు మహిళ జీవితాన్ని చిత్రీకరించడంలో చూపిన భావోద్వేగాల మొత్తం స్వరసప్తకం. | ||
1994 (42nd) | రాధు కర్మార్కర్ (మరణానంతరం) | Cinematographer | పరమ వీర చక్ర | హిందీ | భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని మరపురాని క్షణాలను రూపొందించడంలో జీవితకాల విజయాన్ని అభినందిస్తూ. | [16] |
షాజీ కరున్ | దర్శకుడు | స్వాహం | మలయాళం | భారతీయ సినిమా యొక్క అత్యంత అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా, ఒక కుటుంబం లోని మూలస్థంభం మరణించగా ఏర్పడిన శూన్యాన్ని సున్నితంగా పరిశీలించినందుకు | ||
1995 (43rd) | శ్యాం బెనెగల్ | దర్శకుడు | ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా | ఇంగ్లీషు | దక్షిణాఫ్రికాలో అతని ప్రారంభ సంవత్సరాల్లో గాంధీ తొలి జీవితాన్ని సమర్థవంతంగా పునర్నిర్మించడం ద్వారా భవిష్యత్తు "మహాత్మ" గురించి అంతర్దృష్టిని అందించినందుకు | [17] |
1996 (44 వ) | అమోల్ పాలేకర్ | దర్శకుడు | దాయ్రా | హిందీ | సమాజంలో నిర్లక్ష్యానికి గురైన, అట్టడుగు వర్గాల వేదనను బహిర్గతం చేసే సవాలుతో కూడిన థీమ్‌ను సున్నితంగా నిర్వహించినందుకు | [18] |
కిరణ్ ఖేర్ | నటి | సర్దారీ బేగం | ఉర్దూ | సమాజపు సంకెళ్లను తెంచుకుని, తాను ఎంచుకున్న వృత్తిలో శ్రేష్ఠతను సాధించే డైనమిక్ వ్యక్తిని అద్భుతంగా చిత్రించినందుకు | ||
1997 (45 వ) | జయమాల | నటి | తాయ్ సాహెబా | కన్నడం | నిశ్శబ్దంగా, సంయమనంతో జీవన ప్రయాణంలో సాగిపోయే స్త్రీ చిత్రణకు గాను | [19] |
1998 (46 వ) | • దృశ్యకావ్య •అశోక్ విశ్వనాథన్ |
•నిర్మాత •దర్శకుడు |
కిచ్చు సన్లాప్ కిచ్చు ప్రలాప్ | బెంగాలీ | ఈ చిత్రం దాని ప్రయోగాత్మక ప్రయత్నంలో అసాధారణమైనది. నకిలీ మేధావుల ఆధిపత్యంలో ఉన్న విలువల వ్యవస్థపై వ్యంగ్య బాణం | [20] |
1999 (47 వ) | కళాభవన్ మణి | నటుడు | వసంతియుం లక్ష్మియుం పిన్నె నిజానుం | మలయాళం | ఒక అంధుడు తన జీవితాన్ని అర్థవంతం చేసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని పూర్తి సున్నితంగా వాస్తవికంగా చిత్రీకరించినందుకు | [21] |
2000 (48 వ) | సౌమిత్ర చటర్జీ | నటుడు | దేఖా | బెంగాలీ | కంటిచూపు కోల్పోయి కుమిలిపోతున్న కులీనుల వారసుడిని వాస్తవికంగా చిత్రీకరించినందుకు. సౌమిత్ర మనలను తన జీవితంలోని గతాన్ని, వర్తమానాల్లోని అనేక ఉద్వేగభరిత క్షణాల్లోకి గొప్ప సున్నితత్వంతో తీసుకువెళతాడు. | [22] |
2001 (49 వ) | జానకీ విశ్వనాథన్ | దర్శకుడు | కుట్టి | తమిళం | తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుండి చెన్నైకి జీవనోపాధిని వెతుక్కుంటూ వచ్చిన ఆడపిల్ల మారిన విధానాన్ని వాస్తవికంగా చిత్రీకరించినందుకు. మధ్యతరగతి కుటుంబాలలో సాధారణంగా ప్రబలంగా ఉన్న బాల గృహ కార్మికుల దోపిడీ పట్ల వీక్షకులలో స్పందన కలిగిస్తుంది. | [23] |
2002 (50 వ) | ప్రకాష్ రాజ్ | నటుడు | దయ | తమిళం | అతను బహుళ భాషలలో చిత్రాలలో ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ కోసం. | [24] |
2003 (51st) | మనోజ్ బాజ్‌పాయ్ | నటుడు | పింజర్ | హిందీ | తన కమ్యూనిటీ ఆదేశాలకు, భార్యపై ఉన్న ప్రేమకూ మధ్య చిక్కుకున్న వ్యక్తి యొక్క గందరగోళాన్ని చిత్రీకరించినందుకు. | [25] |
•రూప్కథ •గౌతం హాల్దార్ |
•నిర్మాత •దర్శకుడు |
భాలో తేకో | బెంగాలీ | కొత్త సినిమా ఇడియమ్స్లో నిశ్శబ్దంగా కానీ అద్భుతంగా ప్రవేశించినందుకు. | ||
2004 (52nd) | జె. ఫిలిప్ | నటుడు | డ్యాన్సర్ | తమిళం | శారీరకంగా ద్సౌర్బల్యం ఉన్నప్పటికీ అతని అద్భుతమైన నటనకు నృత్య ప్రదర్శనకూ. | [26] |
2005 (53rd) | అనుపం ఖేర్ | నటుడు | మైనే గాంధీ కో నహీ మారా | హిందీ | వాస్తవ ప్రపంచానికి దూరమైన అల్జీమర్స్ రోగి దుస్థితిని సజీవంగా తీసుకువచ్చే అత్యుత్తమ ప్రదర్శనకు గాను. | [27] |
2006 (54 వ) | విశాల్ భరద్వాజ్ | దర్శకుడు | ఓంకార | హిందీ | గాఢమైన, పాతుకుపోయిన సెన్సిబిలిటీతో అంతర్జాతీయ ట్రీట్మెంట్ని సమన్వయం చేసే అత్యుత్తమ చిత్రానికి గాను | [28] |
2007 (55 వ) | •అనిల్ కపూర్ •ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ |
•నిర్మాత •దర్శకుడు |
గాంధీ మై ఫాదర్ | •హిందీ •ఇంగ్లీషు |
జాతిపిత గురించి అంతగా తెలియని అంశాలను, కుమారుడితో అతని సంబంధాన్ని అరుదైన పద్ధతిలో వెలుగులోకి తెచ్చినందుకు. | [29] |
2008 (56 వ) | •NFDC •కె.ఎం. మధుసూదనన్ |
•నిర్మాత •దర్శకుడు |
బయోస్కోప్ | మలయాళం | చరిత్ర లోని అధ్యాయాన్ని తిరిగి చూసేందుకు హృదయపూర్వకంగా, తనదైన శైలిలో చేసిన ప్రయత్నానికి | [30] |
2009 (57 వ) | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ | ఎడీటర్ | •కమీనే •కేరళవర్మ పళస్సిరాజా •కుట్టి శ్రాంక్ |
•హిందీ •మలయాళం •మలయాళం |
అనేక రకాల థీమ్‌లు, స్టైల్‌లను కవర్ చేస్తూ, ఎడిటింగ్ అనే కళలో సాంకేతికతలో అత్యుత్తమత్వాన్ని కొనసాగిస్తున్నందుకు. | [31] |
2010 (58 వ) | •బిందియా ఖానోల్కర్ •సచిన్ ఖానోల్కర్ •అనంత్ మహదేవన్ |
•నిర్మాత •నిర్మాత •దర్శకుడు |
మీ సింధుతాయ్ సప్కాల్ | మరాఠీ | సజీవ పాత్ర యొక్క ఐతిహాసిక ప్రయాణాన్ని శక్తివంతంగా ప్రదర్శించినందుకు. బాధితురాలిగా మారడానికి నిరాకరించిన ఒక మహిళ, ఆ ప్రక్రియలో తన స్వంత జీవితాన్ని మాత్రమే కాకుండా అనేక మంది జీవితాలను కూడా మార్చింది. | [32] |
2011 (59 వ) | అంజాన్ దత్ | •నటుడు •దర్శకుడు •గాయకుడు •రచయిత |
రంజనా అమీ అర్ అష్బోనా | బెంగాలీ | అతని బహుముఖ ప్రజ్ఞ కోసం. అతను నటుడు, గాయకుడు, రచయిత, దర్శకుడు. నటుడిగా, మద్యపానానికి బానిసైన, వృద్ధాప్య పాప్ గాయకుడి పాత్రను పోషించాడు. ప్రారంభంలో రంగస్థల ప్రదర్శన అతని బహుళ డైమెన్షనల్ సామర్ధ్యాలను ఏర్పరుస్తుంది. చివరగా దర్శకుడిగా, దత్ కలలు, డ్రగ్స్, బాధ్యతారాహిత్యంతో కూడిన ప్రపంచపు అధివాస్తవిక రూపంతో చిత్రాన్ని నింపాడు. | [33] |
2012 (60 వ) | ఋతుపర్ణ ఘోష్ | •నటుడు •దర్శకుడు •రచయిత |
చిత్రాంగద | బెంగాలీ | సినిమా మాధ్యమంపై అతని అద్భుతమైన పట్టుకు, బహుముఖ బహుముఖ ప్రజ్ఞకూ | [34] |
Nawazuddin Siddiqui | నటుడు | •దేఖ్ ఇండీయన్ సర్కస్ •గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ •కహానీ •తలాష్ |
హిందీ | వైవిధ్యమైన చిత్రాలలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకుని, హిస్ట్రియానిక్స్ యొక్క ఆశించదగిన రేంజ్ ఉన్న నటుడు. | ||
2013 (61st) | •Viva in En •Mahesh Limaye |
•నిర్మాత •దర్శకుడు |
యెల్లో | మరాఠీ | అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడానికి అన్ని అవాంతరాలను అధిగమించి ప్రత్యేకంగా ప్రతిభావంతురాలైన అమ్మాయి గురించి నమ్మశక్యం కాని స్ఫూర్తిదాయకమైన చిత్రం. | [35] |
•Future East Film Pvt Ltd •Ashim Ahluwalia |
•నిర్మాత •దర్శకుడు |
మిస్ లవ్లీ | హిందీ | ముంబయిలోని సి-గ్రేడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నేరపూరితమైన లోతుల్లో, నీచమైన శృంగారంతో కూడుకున్న కథలో తీవ్రమైన పరస్పర విధ్వంసక సంబంధాలను అన్వేషిస్తుంది. పొరలు పొరలుగా ఉండే కథనం, పాత కాలపు కాస్ట్యూమ్‌లు, ప్రొడక్షన్ డిజైన్ పల్ప్ స్టైల్‌ను తెలియజేస్తాయి. | ||
2014 (62nd) | భావ్‌రావ్ కర్హడే | దర్శకుడు | ఖ్వాడా | మరాఠీ | స్థిరత్వం కోసం వెతుకుతున్న సంచార గొర్రెల కాపరి సంఘం యొక్క కఠినమైన వాస్తవాలను కఠినమైన కానీ సంయమనంతో కూడిన కథన సంవిధానానికి గాను | [36] |
2015 (63rd) | కల్కి కొచ్లిన్ | నటి | మార్గరీటా విత్ ఎ స్ట్రా | హిందీ | సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న యువతిగా వాస్తవిక నటనకు | [37] |
2016 (64 వ) | మోహన్‌లాల్ | నటుడు | •జనతా గ్యారేజ్ •మంత్రివళ్ళికల్ తలిర్కుంబోల్ •పులిమురుగన్ |
•తెలుగు •మలయాళం •మలయాళం |
అసమానమైన నటనా వైభవంతో రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలను డీల్ చేయడంలో ప్రావీణ్యం చూపినందుకు. | [38] |
2017 (65 వ) | •సాని ఘోష్ రే •కౌశిక్ గంగూలీ |
•నిర్మాత •దర్శకుడు |
నగర్‌కీర్తన్ | బెంగాలీ | – | |
2018 (66 వ) | •శ్రద్ధ దంగర్ •శాచి జోషి •డెనీషా ఘుమ్రా •నీలం పాంచల్ •తర్జని భద్లా •బృంద నాయక్ •తేజల్ పంచసార్ • కౌశాంబి భట్ •ఏక్తా బచ్వానీ •కామినీ పంచాల్ •జాగృతి ఠాకూర్ •రిద్ధి యాదవ్ •ప్రాప్తి మెహతా |
నటిలు | హెల్లరో | గుజరాతీ | అగ్రామీణ మహిళా సమూహం సామాజిక పరివర్తన తీసుకురావడంలో ప్రేక్షకుల ఉద్వేగాలను బహిర్గతపరచేలా చేసినందుకు | |
ఇంద్రదీప్ దాస్‌గుప్తా | దర్శకుడు | కేదార | బెంగాలీ | పరిమిత స్థలంలో ఒకే ప్రధాన పాత్రను చూపిస్తూ అనేక రకాల సినిమాటిక్ టెక్నిక్కులను, మెథడాలజీని ఉపయోగించినందుకు | ||
2019 (67 వ) | ఆర్ పార్తిబన్ | •నటుడు •దర్శకుడు • నిర్మాత •రచయిత |
ఒత్త సెరుప్పు సైజ్ 7 | తమిళం | ఓ పేదవాడి నేరాంగీకారం గురించి వినూత్నంగా కథ చెప్పినందుకు. ఇది అతని శాసనం తెరపై మనకు కనిపించని ధ్వనులు, స్వరాల ద్వారా చక్కగా విశదీకరించబడింది. | [39] |
2020 (68 వ) | ఓజశ్వీ శర్మ | దర్శకుడు | • హిందీ
• ఇంగ్లీషు |
[40] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.