నటి, వ్యాఖ్యాత From Wikipedia, the free encyclopedia
శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది.[1] 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.[2]
శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్. తండ్రి రాం కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి. తల్లి లత బ్యూటీషియన్. ఈమెకు శుశ్రుత్ అనే తమ్ముడున్నాడు. పదో తరగతి, ఇంటర్మీడియట్ లో తొంభై శాతానికిపైగా మార్కులు తెచ్చుకుంది. వైద్యవిద్య నభ్యసించాలనుకున్నది. బి. డి. ఎస్ లో సీటు కూడా సంపాదించింది. కానీ మధ్యలో టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది.[3]
శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక మునుపు[4] అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది.[5][6] తర్వాత 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. తర్వాత పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ధనలక్ష్మి తలుపు తడితే సినిమాలో, నారా రోహిత్ సినిమా సావిత్రి సినిమాల్లో కథానాయికగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడంలో చంద్రిక అనే సినిమాల్లో నటించింది. నానీ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మేన్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది.
రానా దగ్గుబాటి, ఆలీతో కలిసి దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.[7] ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్, మా టీవీ లో ప్రసారమవుతున్న భలే చాంస్ లే రెండో దశ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2012 | జులాయి | రాజి | తెలుగు | |
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ | సోనియా | తెలుగు | అతిథి పాత్ర | |
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | శాంతి | తెలుగు | కథానాయికగా మొదటి సినిమా |
2015 | ఎట్టుదిక్కుం మధయానై | సారా | తమిళం | |
చంద్రిక | శిల్ప | తెలుగు
కన్నడ |
ఒకేసారి తెలుగు, కన్నడ భాషలలో చిత్రీకరించారు | |
ధనలక్ష్మి తలుపు తడితే | చిత్ర | తెలుగు | ||
ఆంధ్రాపోరి | స్వప్న | తెలుగు | ||
2016 | నేను శైలజ | స్వేచ్ఛ | తెలుగు | |
సావిత్రి | బేబీ | తెలుగు | ||
జెంటిల్_మేన్ | నిత్య | తెలుగు | ||
మనలో ఒకడు | తెలుగు | |||
2017 | బాబు బాగా బిజి | తెలుగు | ||
కుటుంబ కథ చిత్రమ్ | పల్లవి | తెలుగు | ||
2021 | 30 రోజుల్లో ప్రేమించటం ఎలా | శ్రీముఖి | తెలుగు | "వాహ్ వా మేరే బావా" పాటలో |
క్రేజీ అంకుల్స్ | స్వీటీ | తెలుగు | ||
మాస్ట్రో | లక్ష్మి/లక్కీ | తెలుగు | ||
2023 | భోళా శంకర్ | శ్రీముఖి, మహా స్నేహితురాలు | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.