మిజోరాం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో లంగ్‌త్లై జిల్లా ఒకటి. జిల్లా ఉత్తరసరిహద్దులో లంగ్‌లై జిల్లా, పడమర సరిహద్దులో బంగ్లాదేశ్, దక్షిణ సరిహద్దులో మయన్మార్, తూర్పు సరిహద్దులో సైహ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2557.1. లవంగ్‌త్లై పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లాలో వివసిస్తున్న ప్రజలలో అత్యధికులు గిరిజనసంప్రదాయానికి చెందినవారు. వీరు లై, చక్మ జాతులకు చెందిన వారు. మిజోరాం రాష్ట్రంలో వీరు అల్పసంఖ్యాకులు. ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. గ్రామప్రాంత ప్రజలు అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చందుర్ లోయకు పడమటి దిశలో పర్వతమయమై ఇరుకైన ప్రదేశంగా ఉంటుంది.
లవంగ్‌త్లై జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | లవంగ్‌త్లై |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. తుయిచాంగ్, 2. పశ్చిమ లాంగ్ట్లై, 3. తూర్పు లాంగ్ట్లై |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,557 కి.మీ2 (987 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,17,894 |
• జనసాంద్రత | 46/కి.మీ2 (120/చ. మై.) |
• Urban | 20,830 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.88 |
• లింగ నిష్పత్తి | 945 |
సగటు వార్షిక వర్షపాతం | 2558 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశించే వరకు లనంగ్‌త్లై జిల్లా ప్రాంతాన్ని స్థానిక ప్రభువుల పాలనలో ఉంటూ వచ్చింది. ఈ ప్రభువులు పాలన ఒక గ్రామం వరకు కాని కొన్ని చిన్న చిన్న గ్రామాలకు గాని పరిమితమై ఉండేది.[1] 1888లో ఫంఖా గ్రామం ప్రభువు బ్రిటిష్ సర్వేబృందాన్ని ఎదుర్కొని ఎల్.టి స్టీవర్ట్‌తో సహా బృందంలోని వారిలో 4 మందిని హతమార్చాడు. తతువాత సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఈ ప్రాంతం మీద దాడి చేసింది. తరువాత ల్యూషై పర్వతదక్షిణ ప్రాంతం లవంత్లై జిల్లాగా రూపొందించబడి బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్ అధికార ప్రాంతంలో భాగమైంది.[1] 1898లో ఉత్తర, దక్షిణ లూషై పర్వతప్రాంతాలు లూషై హిల్స్ జిల్లాలో మిళితం చేయబడి అస్సాం భూభాగంలో భాగమైంది. 1919లో లూషై హిల్స్‌ను మరికొన్ని హిల్స్ జిల్లాలతో కలిపి " గవర్నమెంటాఫ్ ఇండియా యాక్ట్ " చట్టం బ్యాక్వర్డ్ టారాక్ట్స్ ప్రకటించింది. 1935లో దీనిని ప్రత్యేక ప్రాంతంగా మార్చారు. 1952లో లూషై అటానిమస్ జిల్లా కైంసిల్ రుఇపొందించబడి స్థానిక ప్రభువుల పాలన ముగింపుకు వచ్చింది. 1972లో మిజోరాం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తరువాత ఈ ప్రాంతం మిజోరాంలో భాగమై 1987లో మిజోరాంకు రాష్ట్ర అంతస్తు వచ్చే వరకు అలాగే ఉంది.[1] చింతుయిపుయి జిల్లాలో భాగంగా ఉండే ఈ ప్రాంతం లవంగ్‌త్లై జిల్లాగా రూపొందించబడింది. లవంగ్‌త్లై జిల్లా రెండు రూరల్ డెవెలెప్మెంట్ బ్లాకులుగా విభజించబడ్డాయి. వీటిలో లవంగ్‌త్లై రూరల్ దెవెలెప్మెంట్ బ్లాక్ లవంగ్‌త్లై కేంద్రగా ఏర్పాటు చేయబడింది రెండవది చాంగ్టే కేంద్రగా చాంగ్టే రూరల్ డెవెలెప్మెంట్ బ్లాక్ ఏర్పాటు చేయబడ్జింది.[1] లవంగ్‌త్లై జిల్లా 1998 నవంబరు 11 న రూపొందించబడింది. [1][2]
లవంగ్‌త్లై జిల్లా భౌగోళికంగా మిజోరాం రాష్ట్రం నైరుతీ ప్రాంతంలో ఉంది. ఈ జిల్లా దక్షిణం సరిహద్దులో మయన్మార్, పడమటి సరిహద్దులో బంగ్లాదేశ్ లతో అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి.[3] జిల్లా ఉత్తర సరిహద్దులో లంగ్‌లై జిల్లా, దక్షిణ సతిహద్దులో సైహ జిల్లాలు ఉన్నాయి.[3] జిల్లా పడమటి ప్రాంతంలో బంగ్లాదేశ్ మద్య సరిహద్దుగా తెగానది ఉంది. తూర్పు సరిహాదులో సైహ జిల్లా సరిహద్దుగా కలాదాన్ నది ఉంది.[3] లవంగ్‌త్లై జిల్లా వైశాల్యం 2557.1 చ.కి.మీ (2001 గణాంకాలు). జిల్లాలో అత్యధిక భూభాగం చందూర్ లోయ ప్రాంతంలో స్వల్పంగా నదీమైదానాలు ఉన్నాయి. వర్షాకాలంలో సహజంగా కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి. పడమటి ప్రాంతం దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. జిల్లాలో కాలాదాన్ నది, త్యిచాంగ్ నది, చింతుయిపుయి నది, నెంగ్పుయి నది, చాంగ్టే నది, తుయిఫల్ నది ప్రధాననదులుగా భావించబడుతున్నాయి.[4][5][6]
లవంగ్‌త్లై జిల్లా సాధారణంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చల్లని వేసవి కాలం, చలి అధికం లేని శీతాకాలం ఇక్కడ సహజం. శీతాకాల ఉష్ణోగ్రత 8-24 సెంటీగ్రేడ్ ఉంటుంది. వేసవి కాల ఉష్ణోగ్రత 18-32 సెంటీగ్రేడ్ ఉంటుంది. తూర్పు ప్రాంతం కంటే పడమటి ప్రాంతం సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉంటుంది. అంతేకాక తూర్పుప్రాంతం కంటే పడమటి ప్రాంతం కొంచం వేడిగా ఉంటుంది. నైరుతీ ౠతుపవనాలు వీస్తున్న కాలంలో గాలిలో తేమ అధికంగా ఉండి దాదాపు 85% ఉంటుంది.జిల్లాలో నైరుతీ ౠతుపవనాల ప్రభావం అధికంగా ఉన్న కారణంగా మే-సెప్టెంబరు మాసాలలో వర్షపాతం అధికంగా ఉంటుంది. సరాసరి వర్షపాతం 2558 మి.మీ. మార్చి - ఆగస్టు మాసాలలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. మార్చి మాసం నుండి ఆకాశంలో మేఘాలు అధికం ఔతూ ఉంటాయి. సెప్టెంబరు మాసంలో ప్రారంభం అయ్యే చలి జనవరి వరకు కొనసాగుతూ ఉంటుంది.[1]
లంగ్‌త్లై లోని ప్రజలలో మూడింట ఒక వంతు సంప్రదాయ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. నగరప్రాంతాల ప్రజలు కొంతమంది మాత్రం స్థిరమైన ఉద్యోగాలను జీవనోపాధిగా ఎంచుకుని జీవిస్తున్నారు. ప్రభుత్య ఉద్యోగాలు, బ్యాంక్, పాఠశాలలు ఉపాధి అవకాశం కలిగిస్తున్నాయి. లఘు పరిశ్రమలలో మరికొంత మంది ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. మిజోరాం రాష్ట్ర జిల్లాలలో ల్వంగ్‌త్లై ఆర్థికంగా చివరి స్థానంలో ఉంది. .[4][5]
లవంగ్‌త్లై జిల్లా 2 అటానిమస్ జిల్లా కౌంసిల్స్‌గా (లై అటానిమస్ జిల్లా కౌంసిల్, చక్మా అటానిమస్ జిల్లా కౌంసిల్) విభజించబడ్డాయి. వారి ప్రధాన కార్యాలయాలు లవంగ్‌త్లై, చవాంగ్‌తేలలో ఉన్నాయి. జిల్లా 4 రూరల్ డెవెలెప్మెమ్ంటు బ్లాకులుగా విభజించబడింది.[7]
జిల్లా కేంద్రంగా లవంగ్‌త్లై పట్టణం ఉంది. జిల్లాలో 158 గ్రామాలు ఉన్నాయి. జిల్లాను 3 అసెంబ్లీ నియోజకవర్గాలుగా (తుయిచ్వాంగ్, లవంగ్‌త్లై వెస్ట్, లవంగ్‌త్లై ఈస్ట్) విభజించారు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 117,894, [8] |
ఇది దాదాపు | గ్రెనెడా దేశ జనసంఖ్యకు సమానం [9] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 611 వ స్థానంలో ఉంది |
1చ.కి.మీ జనసాంద్రత | 46 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 59.53%. |
స్త్రీ పురుష నిష్పత్తి | 945:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 66.41%.[8] |
జాతియ సరాసరి (72%) కంటే | అల్పం |
లవంగ్‌త్లై జిల్లాలో లై, చక్మాలు, తంచంగ్య, బాం, పాంగ్ మొదలైన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ గిరిజన ప్రజల మద్య ప్రబలమైన సంప్రదాయ వారసత్వం ఉంది. జిల్లా తూర్పు భూభాగంలో ప్రధానంగా లై ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. చాంగ్‌లైజవాన్, సర్లంకై, పహ్లోత్లా మొదలైన ప్రధాన సంప్రదాయ నృత్యసంప్రదాయాలు ఉన్నాయి. చక్మా ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో వెనుకబడిన జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. లై ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో క్రైస్తవ మతం ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో చక్మా ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో బుద్ధిజం ప్రాధాన్యత కలిగి ఉంది. జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో లై, చక్మా, తంచంగ్యా ప్రధానమైనవి. ఇతరభాషలలో ప్రధానమైనవి పాంగ్, బ్రూ, బాం ముఖ్యమైనవి. ఈ సంప్రదాయ ప్రజలకు వాతికే ప్రత్యేకమైన జానపద నృత్యాలు, జానపద గాథలు, జానపద కథనాలు ఉన్నాయి. చక్మా ప్రజల సాధారణ నృత్యాలలో నౌ జుమో నాచ్, బిజూ నృత్యాలు ముఖ్యమైనవి.
లవంగ్‌త్లై జిల్లా ఉష్ణమండల భూభాగంలో ఉంది. జిల్లాలో సాధారణంగా మే నుండి సెప్టెంబరు వరకు అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉష్ణమండల సతతహరితారణ్యాలు, అడవి అరటి వనాలు అధికంగా కనిపిస్తున్నాయి. పడమటి ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. స్కిమా వల్లిచి, మర్రి, గుల్మొహర్, గమారి, జారుస్, చంపా, పలు జాతుల వెదురు చెట్లు, అనేక విధాలైన లతలు, పలురకాల పండ్లు ఈ అరణ్యాలలో అధికంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉపకరించే అనేక ఔషధ మొక్కలు కూడా ఇక్కడ లభిస్తుంటాయి. 1997లో లవంగ్‌త్లై జిల్లాలో 110చ.కి.మీ వైశాల్యంలో " నంగ్పుయి అభయారణ్యం " స్థాపించబడింది.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.