Remove ads
మిజోరాం రాష్ట్రంలోని లంగ్‌లై జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
లంగ్‌లై, మిజోరాం రాష్ట్రంలోని లంగ్‌లై జిల్లా ముఖ్య పట్టణం. లంగ్‌లై అంటే 'రాక్ వంతెన' అని అర్థం. ఇది రాష్ట్ర రాజధాని ఐజాల్ తరువాత అతిపెద్ద పట్టణం. ఇది, ఐజాల్ పట్టణానికి దక్షిణాన 165 కి.మీ. (102 మైళ్ళు) దూరంలో ఉంది.
1888 నుండి 10 సంవత్సరాలపాటు లంగ్‌లై పట్టణం దక్షిణ లుషాయ్ కొండ జిల్లాల రాజధానిగా ఉంది.[1] మిజోరాంలో రెండవ అతిపెద్ద పట్టణం ఇది. ఇది బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నగరానికి ఈ పట్టణం నుండి ప్రవేశం ఉంది. ఈ పట్టణం వాణిజ్య, విద్యాకేంద్రంగా నిలిచింది.[2] 1912 నుండి 1922 వరకు ఇక్కడ కేవలం 2 షాపులు మాత్రమే ఉండేవి. 1922లో 4 షాపులు ఏర్పాటు చేయబడ్డాయి. 1950లలో లంగ్‌లై పట్టణానికి మొట్టమొదటి రహదారి వేశారు.[3]
లంగ్‌లై పట్టణం 22.88°N 92.73°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[4] ఇది సముద్రమట్టానికి 1,222 మీటర్లు (4,009 అడుగులు) ఎత్తులో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] లంగ్‌లై పట్టణంలో 57,011 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 52% మంది, స్త్రీలు 48% మంది ఉన్నారు. లంగ్‌లై సగటు అక్షరాస్యత రేటు 84% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 84% కాగా, స్త్రీల అక్షరాస్యత 83% గా ఉంది. మొత్తం జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
ఈ జిల్లాలో దక్షిణ తుయిపుయి, ఉత్తర లంగ్‌లై, తూర్పు లంగ్‌లై, పశ్చిమ లంగ్‌లై, దక్షిణ లంగ్‌లై, తోరాంగ్, పశ్చిమ తుయిపుయి అనే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లంగ్‌లై పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయబడింది.[6]
లంగ్‌లై 35 కిలోమీటర్ల దూరంలో తలాబుంగ్ అనే పట్టణం ఉంది. ఇక్కడున్న కర్నాఫులి నది 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టగాంగ్‌కు కలుపుతుంది. 1940వ దశకంలో లంగ్‌లై నుండి షిల్లాంగ్ లేదా కోల్‌కతాకు చిట్టగాంగ్ రహదారి ఏర్పడింది.[9]
లంగ్‌లై పట్టణం నుండి ఐజాల్ నగరానికి పవన్ హన్స్ (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[10] లంగ్‌లై, ఐజ్వాల్ మధ్య 200 కి.మీ.ల (120 మైళ్ళ) దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[11] లంగ్‌లై నుండి 25 కి.మీ. (16 మైళ్ళ) దూరంలో ఉన్న ఖాజాల్ పట్టణంలో ఒక చిన్న విమానాశ్రయాన్ని నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నాయి.[12]
ఈ పట్టణం విస్తీర్ణంలో 9.97% అటవీ భూమి ఉంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కాఫీ, రబ్బరు వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి. ఇక్కడి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో వరి పంట ప్రధాన పాత్ర వహిస్తోంది. చేనేత, ఫర్నిచర్, వ్యవసాయ పరికరాలు, వస్త్రాలు, వెదురు, చెరకు వంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.