Remove ads
మిజోరాం రాష్ట్రంలోని సైహ జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
సైహ[2] మిజోరాం రాష్ట్రంలోని సైహ జిల్లా ముఖ్య పట్టణం. ఇది రాష్ట్రంలోని దక్షిణ మధ్య భాగంలో ఉంది. ఈ పట్టణం మరా ప్రజలకు వాణిజ్య కేంద్రంగా ఉంది.
'సియా' అంటే ఏనుగు అని, 'హ' అంటే ఏనుగు దంతం అని అర్థం. ఇక్కడ పెద్ద మొత్తంలో ఏనుగు దంతాలు దొరుకుతాయి. స్థానిక ప్రజలు ఈ పట్టణానికి 'సియాహా' అని పేరు పెట్టినప్పటికీ, మిజా ప్రజలు దీనిని 'సైహ' అని పిలుస్తారు.
సైహ పట్టణం 22.48°N 92.97°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 729 మీటర్లు (2,391 అడుగులు) ఎత్తులో ఉంది.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] సైహ పట్టణంలో 19,731 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 79% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 77% గా ఉంది. పట్టణ జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. 2001లో 19,731 మంది జనాభా ఉండగా, 2008లో 29,275 జనాభా ఉన్నారు.[5]
ఈ పట్టణంలో పవన్ హన్స్[6] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[7] 54వ జాతీయ రహదారి ద్వారా సైహ పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. సైహ, ఐజాల్ మధ్య 378 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[8]
సైహ పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.