Remove ads
మిజోరాం రాష్ట్రంలోని లవంగ్త్లై జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
లవంగ్త్లై, మిజోరాం రాష్ట్రంలోని లవంగ్త్లై జిల్లా ముఖ్య పట్టణం.
లవంగ్త్లై | |
---|---|
పట్టణం | |
Coordinates: 22.532°N 92.899°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | లవంగ్త్లై |
Founded by | హైహ్ముంగా హ్లాన్చెయు |
జనాభా (2011) | |
• Total | 20,838 |
భాషలు | |
• అధికారిక | లై, మిజో, చక్మా |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 796891 |
Vehicle registration | ఎంజెడ్ |
సమీప నగరం | ఐజాల్ |
లోక్సభ నియోజకవర్గం | మిజోరాం లోక్సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | లవంగ్త్లై |
వాతావరణం | Cwa |
1880లో హైహ్ముంగా హ్లాన్చెయు అనే వ్యక్తి ఈ లవంగ్త్లై గ్రామాన్ని స్థాపించాడు. లవంగ్ అంటే పడవ అని, త్లై అంటే స్వాధీనం అని అర్థం[1]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 20,830 జనాభా ఉంది. ఇందులో పురుషులు 10,659 మంది, స్త్రీలు 10,171 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 3,122 (14.99%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 95.66% కాగా, ఇది రాష్ట్ర సగటు 91.33% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 96.97% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 94.28%గా ఉంది.[2]
ఇక్కడ పవన్ హన్స్[3] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[4] 54వ జాతీయ రహదారి ద్వారా లవంగ్త్లై పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. లవంగ్త్లై, ఐజాల్ మధ్య 296 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[5] ఈ పట్టణం వరకు రైల్వేను విస్తరించాలని మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.[6]
ఈ పట్టణంలో మిజోరం విశ్వవిద్యాలయ పరిధిలోని లవంగ్త్లై కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
లవంగ్త్లై పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.