Remove ads
From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాంగఢ్ (హిందీ: रामगढ़ जिला) జిల్లా ఒకటి. రాంగఢ్ జిల్లా 2007 సెప్టెంబరు 12 లో ఏర్పాటయినది. ఇది ఆనాటి హజారిభాగ్ జిల్లా (జార్ఖండ్ స్టేట్ మధ్యలో)నుండి విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. రాంగఢ్ అనగా రాముని కోట అని అర్థం. ఈ జిల్లా కేంద్రమైన రాంగఢ్ కు ఆ పేరు జిల్లా పేరు రాంగఢ్ నుండి వచ్చింది.
రాంగఢ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | ఉత్తర ఛోటా నాగ్‌పూర్ |
ముఖ్య పట్టణం | రాంగఢ్ కంటోన్మెంట్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | హజారీబాగ్ |
• శాసనసభ నియోజకవర్గాలు | రాంగఢ్, మండూ, బర్కాగావ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,211 కి.మీ2 (468 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 9,49,159 |
• జనసాంద్రత | 780/కి.మీ2 (2,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.92 % |
• లింగ నిష్పత్తి | 921 |
ప్రధాన రహదార్లు | NH 33 and NH 23 |
Website | అధికారిక జాలస్థలి |
రాంగఢ్ 2007 సెప్టెంబరు 12 న జిల్లాగా రూపొందుంచబడింది. హజారీబాగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరిచేసి ఈ జిల్లా రూపొందించబడుంది.రాంగఢ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రం కేంద్రస్థానంలో ఉంది. జిల్లా గనులు, పరిశ్రమలు, సస్కృతికి కేంద్రంగా ఉంది.[1] జిల్లా " మా చిన్నమస్తా ఆలయం ఉంది. రాంగఢ్ అంటే " రాముని ఇల్లు " అని అర్ధం. జిల్లాకు కేంద్రంగా ఉన్న రాంగఢ్ పట్టణం పేరును జిల్లాకు పెట్టారు.
పురాణ కథనాలను అనుసరించి రాంగఢ్ అంటే " రాముని ఇల్లు " అని అర్ధం. రామాయణ కాలంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఇక్కడ నివసించాడని విశ్వసిస్తున్నారు.
భారతభూమిలో మానవ ఆవాసాలు ఆరభం అయిన నాటి నుండి రాంగఢ్ చరిత్రకు సంబంధం ఉందని భావిస్తున్నారు.
అశోక చక్రవర్తి (క్రి.పూ 273-232 ) సామ్రాజ్యంలో చోటానాగపూరు ప్రాతంతం అతా సామంత రాజ్యంగ ఉంది. కనుక బుద్ధుని కాలంనాటికి రాంగఢ్ ఉందని ఋజువులు ఉన్నాయి.
బౌద్ధ కాలానికి ౠజువుగా గోలా గ్రామంలో బుద్ధుని ఆలయం ఉంది. 8వ శతాబ్ధంలో జైన్ తీర్ధంకరులు పర్సనాథ్‌లో నిర్మించిన ఆలయం ఈ ప్రాంతానికి జైనిజంతో ఉన్న సంబంధం తెలుస్తుంది.
సముద్రగుప్త మహారాజు (సా.శ. 385-380) [6] తూర్పు కనుమల ప్రాంతంమీద దండయాత్రచేసమయంలో రాంగఢ్ మీదుగా ప్రయాణించినాడని భావిస్తున్నారు. ఈ కాలాన్ని భారతదేశ స్వర్ణ యుగమని భావిస్తున్నారు.
ఆ సమయంలో రాంగఢ్ రాజధాని సిరాలో ఉండేది. తరువాత రాజధాని ఉద్రా, బాదం, రాంగఢ్, పద్మ ఒకటి తరువాత ఒకటిగా మారింది. 1670 లో రాంగఢ్ పాలన రాజధాని రాంగఢ్‌కు మారింది. రాంగఢ్ రాజ్యాన్ని పద్మరాజా రాజ్యం అని పిలిచేవారు. 1740 లో రాంగఢ్ రాజ్యంలో రాంగఢ్ " రాంగఢ్ జంగిల్ జిల్లాగా "ఉండేది.[8]
బ్రిటిష్ పాలన: రెండవ షాహ్ అలాం రాంగఢ్ పాలనాధికారం ఈస్టిండియా కంపనీ పరం చేసాడు.
1771 లో కేప్టన్ కొమాక్ రాంగఢ్ సైనికాధికారిగా నియమినబడ్డాడు.[9] ఆయన ప్రధాన కార్యాలయం చత్రాలో ఉంది. రాంగఢ్ సైనిక జిల్లాలో రాంగఢ్‌లో నాగపూర్, పాలమూ, హజారీబాగ్, చత్రా, గిరిడి, కొడెర్మా ప్రాంతాలు ఉన్నాయి.[10] రాంగఢ్ బెటాలియన్ ప్రధానకార్యాలయం హజారీబాగ్‌లో ఉంది. దీనికి యురేపియన్ కమాండర్‌గా ఉన్నాడు.
ప్రముఖ సాంఘిక సంస్కర్త బ్రహ్మసమాజ స్థాపకుడు అయిన రాజారామమోహనరాయ్ 1805 -1806 లో రాంగఢ్‌లో నివసించాడు. విలియం డిగ్గీ రాంగఢ్ మెజిస్ట్రేట్, రిజిస్టారుగా పనిచేసాడు. రాజారామమోహనరాయ్ కలెక్టరేట్‌లో షెరిస్టేదార్‌గా పనిచేసాడు. అప్పుడు రాజారామమోహనరాయ్ విలియం డిగ్గీ ఒకే సత్రంలో నివసించేవారు. వారిద్దరి మధ్య ఉన్న మైత్రికారణంగా విలియం డిగ్గీ రాంగఢ్‌కు వచ్చే సమయంలో రాజారామమోహనరాయ్‌ను కూడా తనతో తీసుకు వాచ్చాడు.
పోలీస్ స్టేషనుగా చేయబడింది.
1940 లో ఐ.ఎన్.సి 53 సభ [11][12] మౌలానా అబ్దుల్ కలాం అజిద్ నాయకత్వంలో రాంగఢ్ లోని ఝందాచోక్ (రాంగఢ్ కంటోన్మెంట్) వద్ద నిర్వహించబడింది. మహాత్మాగాంధి ,[13] జహర్లాల్ నెహ్ర, సరదార్ పఠేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద, సరోజినీ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆచార్య జె.బి. క్రిపలానీ, జమన్ లాల్ బజాజ్ (పారిశ్రామికవేత్త), ఇతర స్వంతంత్ర సమర ప్రముఖులు [14] రాంగఢ్ సమావేశంలో పాల్గొన్నారు. [15] రాంగఢ్‌లో మహాత్మాగాంధీ చేత ఖాది, గ్రామీణ పరిశ్రమల ప్రదర్శన ఆరంభించబడింది..[16] అదే సమయంలో తుఫాను, హరికేన్ ఉచ్చస్థాయిలో ఉండడం విశేషం. అదే సమయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో సమఝౌతాకు వ్యతిరేకంగా సమావేశం ముగిసింది. రాంగఢ్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ " ఆల్‌ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ " పార్టీకి అద్యక్షత వహించాడు. అలాగే " రాడికల్ డెమొక్రసీ " పార్టీకి ఎం.ఎన్.రాయ్ అధ్యక్షత వహించాడు.
1947లో స్వతంత్రం వచ్చిన ప్రస్తుత రాంగఢ్ జిల్లా ప్రాంతం మునుపటి హజారీబాగ్ జిల్లాలో భాగం అయింది. 1952లో రాంగఢ్ బ్లాక్ రుఇపొందించబడింది. 1991లో రాంగఢ్ ఉపవిభాగం ఏర్పడ్జింది. 1976లో సిఖ్ రెజిమెంటల్ సెంటర్ మెరుట్ నుండి రాంగఢ్ కంటోన్మెంటుకు తరలించబడింది. 2007 సెప్టెంబరు 12 న రాంగఢ్ జిల్లాగా రఒందించబడింది. రాంగఢ్, గోలా, మండు, పత్రతు బ్లాకులు జిల్లాలో చేర్చబడ్డాయి. తరువాత రాష్ట్ర జిల్లాల సంఖ్య 24కు చేరింది.
రాంగఢ్ జిల్ల్ చోటానాగపూర్ మైదానంలో ఒక భాగం. రాంగఢ్ ప్రధాన నైసర్గిక భూభాగం.[19] జిల్లాలోని దామోదర్ నది దిగువ, ఎగువ లోయలు మొత్తంగా దామోదర్ లోయ అనిపిలువబడుతుంది. జిల్లాలోని అధిక భాగం దామోదర్ లోయలు ఉన్నాయి.దామోదర్ లోయ ఉత్తర సరిహద్దులో హజారీబాగ్ పీఠభూమి, దక్షిణ సరిహద్దులో రాంచీ పీఠభూమి ఉంది. రాంచి, హజారీబాగ్ పీఠభూమి తూర్పు, పడమరగా ఉన్న దామోద లోయ విడదీస్తుంది.
రాంగఢ్ - రాంచీ సరిహద్దులో ఉన్న సముద్రమట్టానికి 1049 మీ ఎత్తులో ఉన్న బర్కా పహర్ (మరంగ్ బురు) [20] జిల్లాలో ఎత్తైనశిఖరంగా భావించబడుతుంది. ఇది రెండు జిల్లాలను వేరు చేస్తుంది.
జిల్లాలో ప్రధాననది దామోదర్. అంతేకాక దామోదర్ నది జిల్లాలో నదీమైదానం ఏర్పరచింది. ఈ నదికి పలు ఉపనదులుకూడా ఉన్నాయి: నైకరి, భైరవి బొకారో నదులు ప్రధానమైనవి.
హిందూ పురాణాలు, ప్రజాకథనాలు దామోదర్ నది నాద్ (నాద్ అంటే పురుష అని అర్ధం)నది అంటే పురుషనది అని వివరిస్తున్నాయి. వీటిలో చిన్నదులు ఉన్నాయి : హుర్హురి, గోమై, బర్కి, కురుం, కొచి, షెర్భుకి, ధొబ్ధాబ్. మొదలైనవి. స్వర్ణరేఖా నది జిల్లా భూభాగంలో దక్షిణం నుండి తూర్పుదిశగా ప్రవహిస్తుంది.[21] స్వర్ణరేఖా నది కదంగరా, ఖాత్గరా మొదలైనవి.
రాజ్‌పరా జలపాతం: భైరవి (భెరా), దామోదర్ నదుల సంగమ ప్రాంతంలో ఉంది.
జిల్లాలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు, మిథేన్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. అంతేకాక సున్నపురాయి, ఫైర్ క్లే వంటి నిక్షేపాలు కూడా ఉన్నాయి. రాంగఢ్ జిల్లా లోని బొగ్గు నిక్షేపాలు దామోదర్ నదీ తీరంలో ఉన్నాయి. భౌగోళికంగా జిల్లా భూభాగం గోండ్వానా సిస్టానికి చెందింది. " డముడా గ్రూప్ ఆఫ్ లోవర్ గోండ్వానా ఏజ్ "కు చెందిన శిలలు అధికంగా బొగ్గు నిక్షేపాలు ఉంటాయి. ప్రధాంగా జిల్లాలోని దక్షిణ కర్ణపరా వద్ద బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.[22]
" ది కోయల్ ఇండియ లిమిటెడ్ " సబ్సిడరీ " సెంట్రల్ కోయల్ లిమిటెడ్.[23]
కాప్టివ్ కోయల్ బ్లాకులు అల్లొకేటెడ్ [26]
కోయల్ బెడ్ మిథేన్ (సి.బి.ఎం) [27] ఇది " పర్యావరణ సహాయక సహజవాయువు " .
కోయిల్ ఇండియా లిమిటెడ్ కైతా బ్లాకులో రెండు ప్రదేశాలను యు.జి.సి కొరకు కనిపెట్టింది [28] వాటిలో ఒకటి రాంగఢ్ కోయిల్ ఫీల్డ్ ఒకటి.
సున్నపురాయి: కోయల్ నిక్షేపాలకు సమాంతరంగా తూర్పు, పడమరలుగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఐరన్ గనులు : రాంగఢ్‌లో బొకారో అండ్ కరంపురా కోయల్ - ఫీల్డ్స్, నోడుల్స్ & లెంటికల్స్ ఇనుప ఖనిజాలు కనిపెట్టబడ్డాయి. ఒకప్పుడు స్థానిక లోహపు వ్యాపారుల ఆధీనంలో ఉండేవి.
రాంగఢ్ జిల్లా తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధిచెందింది. ముడి సరుకు లభ్యత కారణంగా జిల్లాలో స్టీల్, స్పాంగ్ ఐరన్, సిమెంట్, రిఫ్రాక్టరి, థర్మల్ పవర్ ప్లాంట్ వంటి పలు ఖనిజ సంబంధిత పరిశ్రమలు స్థాపినచబడ్డాయి.
ఈ ప్రాజెక్ట్ ధుర్మి గ్రామంలో 2×660 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్ట్ స్థాపించడానికి ప్రయత్నిస్తుంది.
రాంగఢ్ జిల్లా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జివిస్తుంటారు. జిల్లాలో ప్రధానంగా 3 వ్యవసాయ సీజన్లు ఉన్నాయి. జిల్లాలో 1) కరీఫ్, 2) రబి, 3) జైద్. బియ్యం, మొక్కజొన్న, రాగి, పండ్లు, కూరగాయలు ప్రధాన పంటలుగా పండించబడుతున్నాయి. [42]
జిల్లాలోని అరణ్యప్రాంత వైశాల్యంజ్ 487.93 చ.కి.మీ. జిల్లా వృక్షజాలం, జంతుజాలంతో సుసంపన్నమై ఉంది. జిల్లాలో ప్రభుత్వం డీర్ పార్కును ఏర్పాటు చేసింది. [43] ఈ పార్క్ వైశాల్యం 25 ఎకరాలు ఉంటుంది. ఇది గోలా గ్రామంలో గోలా - మురి రోడ్డులో ఉంది. [44] ఈ జిల్లాలో మగ ఏనుగులు అధికంగా ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 949,159,[45] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[46] |
అమెరికాలోని. | డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[47] |
640 భారతదేశ జిల్లాలలో. | 459 వ స్థానంలో ఉంది.[45] |
1చ.కి.మీ జనసాంద్రత. | 684 [45] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.06%.[45] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 921:1000 [45] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 73.92%.[45] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లా చక్కగా రైలుమార్గాలతో అనుసంధానించబడి ఉంది. 1927లో బెంగాల్ నాగపూర్ రైల్వే (బి.ఎ.ఆర్) [48] చందిల్ - బర్కకానా సెక్షన్‌లో 116కి.మీ మార్గం నిర్మించబడింది. అదే సంవత్సరం సెంట్రల్ ఇండియా కోయిల్ ఫీల్డ్స్ (సి.ఐ.ఎస్ ) గొమొహ్ - బర్కకానా మార్గాన్ని ఆరంభించింది. 1929లో ఇది డాల్టన్ గంజ్ వరకు పొడిగించబడింది.
బర్కకానా కూడలి :
వయా బాద్
రాంగఢ్ కంటోన్మెంట్: '
జాతీయ రహదారి 33 సమీపంలో బిజులియ నెలకొని పరి భాష రైల్వే స్టేషను రాం ఘర్. ఇది నగరం బస్సు స్టాండ్ నుండి ఒక కిలో చుట్టూ ఉంది
రాంచీ రోడ్: '
జిల్లాలలో ప్రధాన రవాణా రహదారిమార్గంలో జరుగుతుంటాయి. జిల్లాలో 3 ప్రధాన అతివేగ రహదారి మార్గాలు ఉన్నాయి: జాతీయ రహదారి 33, జాతీయ రహదారి 33& ఎస్.హెచ్2) జిల్లా మీదుగా పోతున్నాయి.
.
సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
సాదర్ ఆసుపత్రి: రాంగఢ్ బ్లాక్ సమీపంలో.
'రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు'
'మార్కెట్' ': మార్కెట్లలో రామ్ పత్రతు, భుర్కుండా, కుజు, గోలా ప్రధానమైనవి.
జార్ఖండ్ ప్రభుత్వం పత్రతు సమీపంలో ఆధునిక ఫిల్మ్ సిటీ నిర్మించాలని ప్రణాళిక చేస్తుంది.
చితేర్‌పూర్ వద్ద జరినా ఖటూన్ మ్యూజియం కం రీసెర్చి సెంటర్ ఉంది.
రాంగఢ్ సంస్కృతి విభిన్నమైనది. రాజ్‌రప్పా మందిరం, టూటి జర్నా మందిర్ వంటి వివాహవేడుకలు నిర్వహించడానికి అనుకూల ప్రాంతాలు ఉన్నాయి.
జిల్లాలో అత్యంత ఉత్సాహంతో జరుపుకునే ఉత్సవాలలో దీపావళి, హోళి, చాథ్, దసరా లేక దుర్గాపూజ లేక నవరాత్రి, శ్రీరామనవమి, కర్మ, సర్హుల్, తుసు, ఈద్, సరస్వతి పూజ, మకర సంక్రాంతి, జీవిత్పుత్రిక లేక జితియా (హిందీ: जिउतिया) [67] మొదలైనవి ప్రధానమైనవి. గనులు, పరిశ్రమలు అధికం కావడంతో విశ్వకర్మ పూజ కూడా చక్కగా నిర్వహించబడుతుంది. రాజ్‌రప్పా మందిరం వద్ద నిర్వహించే మకర సంక్రాంతి సంత [68] పెద్ద ప్రజలను ఆకర్షిస్తుంది. జితియా సందర్భంలో కూడా సంత నిర్వహించబడుతుంది [69] కర్మ, ఇతర పండుగలు.
రాంగఢ్ జిల్లాలో పలు విధమైన ఆహారాలు, వంటకాలు అందుబాటులో ఉన్నాయి. రోటీ, పుల్కా, అన్నం లేక బాత్, డాల్, సబ్జి లేక తర్కరి, అచర్ లేక ఊరగాయ వంటివి సాధారణంగా ప్రతిగృహంలో తయారుచేయబడుతుంటాయి. ప్రాంతీయ వాసుల అభిమాన అల్పాహారాలలో దుస్కా, వడ ప్రధానమైనవి. దుస్కా చేయడానికి బియ్యం, మినపప్పు అవసరం. వడచేయడానికి మినపప్పు అవసరం. జిల్లాలో ప్రత్యేకంగా వెదురు మొలకల పకోడాలు, గుమ్మడిపూల పకోడా, ఖుర్కి లేక పుట్టగొడుగుల తర్కరి మొదలైన వంటకాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. రజ్‌రప్పా వద్ద లభించే ఖొయా పెడాలు కూడా ప్రబల ఆహారాలలో ఒకటిగా భావిస్తుంటారు.
టూటీ ఝర్న ఆలయం రాంగఢ్ కంటోన్మెంటుకు 7 కి.మీ దూరంలో జాతీయరహదారి 33 పాట్నా - రాంచి రహదారిలో ఉంది. ఇక్కడ శివలింగం మీద జలపాతం నుండి నేరుగా పడుతుంది. సమీపం లోని దిగ్వర్ గ్రామంలో ఉన్న రఘునాథ్ బాబా, పలువురు దిగ్వర్ గ్రామవాసులు ఈ ఆలయం నిర్వహణ చేస్తుంటారు. రాంచీ - పాట్నా రహదారి నుడి దిగ్వర్ గ్రామానికి చేరుకునే మార్గంలో 2-3 కి.మీ దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.
రాంగఢ్‌కు దక్షిణంగా 5 కి.మీ దూరంలో చుతుపలు లోయలో మాయాతుంగి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పర్వతరాజు పుత్రిగా భావించబడుతుంది. సుందరమైన ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రదేశం ప్రముఖ విహారప్రదేశంగా ఉంది. ఇది సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున ఉంది. ఈ శిఖరానికి చేరుకోవడానికి 15 నిమిషాల సమయం చాలు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో కర్మా ఉత్సవం ఉత్సాహభరితంగా నిర్వహిస్తుంటారు. అలాగే సమీప గ్రామాల నుండి వచ్చే ప్రజలు సంతను కూడా నిర్వహిస్తుంటారు. ఈ కొండ మీద ఆరాధనలు జరిపితే వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ ప్రజలు విశ్వసిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో దుర్గాపూజ, నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు.
కతియా శివమందిర్:[70] ఈ పురాతన శివాలయం జాతీయరహదారి 23 పక్కన రాంగఢ్ కంటోన్మెంటుకు 3 కి.మీ దూరంలో ఉంది. దీనిని జాతీయ స్మృతి చిహ్నంగా ప్రకటించింది. ఈ ఆలయం 1670లో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న శివలిగం రెండు అంతస్తుల ఎత్తున ఉంటుంది. ఈ ఆలయంలో కొంత భాగాన్ని ఒకప్పుడు సైనిక స్థావరంగా వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.
కెరే మఠం ఆలయం[71] ఇది ఒక గౌతమ బౌద్ధాలయం. జాతీయరహదారి 23 పక్కన మాత్వా-తండ్ గ్రామంలో ఉంది.
1940లో రాంగఢ్ లోని సిక్కు ప్రజలు షివాజి రోడ్ వద్ద చిన్న రూములో గురుద్వారా సింఘ్ సభను స్థాపించి ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి గురుద్వారా రూపంలో బ్రహ్మాండమైన ప్రత్యేకభవనం నిర్మించబడింది. ఇందులో కేంద్రంగా ఉన్న సమాధి, మీనార్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ తీసుకు వచ్చింది. గురుద్వారా సాహెబ్ దర్బార్ హాల్ బహుసుందరంగా ఉంటుంది.
ప్రఖ్యాత " మాతా చిన్మస్తిక ఆలయం " (హిందీ: मां छिन्नमस्तिका मंदिर) [72] ఇది రాజ్‌రప్పా (హిందీ: రాజ్‌రప్పా) సమీపంలో రాంగఢ్ కంటోన్మెంట్‌కు 20కీమీ దూరంలో దామోదర్, భైరవి నదీ (బెరా) సంగమంలో ఉంది. ఈ ఆలయ ప్రసక్తి పురాణాలు, వేదాలలో ఉంది. పురాతన శక్తి ఆరాధనకు ఇది బలమైన సాక్ష్యంగా ఉండేది. హిదువుల యాత్రలో చినమస్తిక ఆలయం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక్కడకు సంవత్సరం అంతా దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. ఇది అతిపురాతనమైన ఆలయం. ఆలయ నిర్మాణం తాంత్రిక ప్రాముఖ్యత కలిగిన ఆలయనిర్మాణాన్ని తలపిస్తుంది. అయినప్పటికీ దీని నిర్మాణ కాలం నిర్ణయించబడలేదు. ఇక్కడ పెద్ద ఎత్తున వివాహవేడుకలు జరుగుతుంటాయి. శిరోరహిత చినమస్తికాదేవి తామరపుష్పం కండియో, రాతి శరీరాల మీద నిలబడి ఉంటుంది. పురాతన ఆలయం చుట్టూ పలు చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి. మహావిద్యా, ( తార,షోడసి,భువనేశ్వరి, భైరవి, బగ్లా, కమ్ల, మాతంగి, ధుమవతి) వరుస నిర్మించబడింది. ఇతర ఆలయాలలో సూర్యాలయం, శివాలయం, హనుమాలయం, మాతా కాళీ ఆలయం మొదలైనవి ఉన్నాయి. పురాణకథనాలు దామోదర్ అంటే శివుడు అని, భైరవి అంటే శక్తి అని వివరిస్తున్నాయి. దామోదర్ నది బబైరవి నదితో సంగమిస్తున్న ఈ ప్రదేశం అతి పవిత్రమైనదని భావిస్తున్నారు. దామోదర్ నదికి ఎగువన ప్రవహిస్తూ భైరవీ నది దిగువన ఉన్న దామోదర్ నదితో సంగమిస్తుంది. భక్తులు పూజ నిర్వహించే ముందు నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.
రాజ్‌రప్పా ఆలయం ప్రముఖ శక్తిపీఠం మాత్రమే కాక విహారకేంద్రంగా కూడా ఆకర్షిస్తూ ఉంది. పర్యాటకులు ఇక్కడ దేవిని ఆరాధిస్తూనే అరణ్యాలు, కొండలు, పచ్చదనం, నదులతో మిశ్రితమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడి మార్కెట్లలో వంటసామగ్రి, ఆహారం, పాలు, వంటకు కావలసిన పదార్ధాలు, తాజా కూరగాయలు లభ్యమౌతాయి. ప్రస్తుతం మందిర్ సమితి కేర్ టేకర్ ఏజంట్ సాయంతో భైరవీ నదీ తీరంలో కొంతభాగాన్ని విహార ప్రదేశంగా మార్చారు. వారు కొంత ప్రదేశం, చటై, టేబులు మొదలైనవి అందిస్తారు. వీటిని పొందడానికి నామ మాత్రం రుసుము చెల్లించాలి. వర్షాకాలంలో ఈ ప్రాంతం బదీజలాలతో నిండి పోతుంది.
వాయు మార్గం సమీపంలో ఉన్న విమానాశ్రయం " రాంచీ " (70 కి.మీ దూరం)
రైలు మార్గం ' సమీపంలో ఉన్న రైల్వే స్టేషను రాంగఢ్ కంటోన్మెంటు 28 కి.మీ దూరం, రాంచీ రోడ్ (30 కి.మీ దూరం), బర్కరకానా (33 కి.మీ దూరం), రాంచీ (70 కి.మీ దూరం),కొడెర్మా (135 కి.మీ దూరం).
రహదారి మార్గం : రాంగఢ్ కంటోన్మెంటు నుండి ట్రెక్కర్ లేక జీపులో రాజ్‌పరా మందిరం చేరుకోవచ్చు. పాత బస్ స్టాపు వద్ద తెల్లవారు ఝాము నుండి ట్రెక్కర్ లేక జీపు అద్దెకు లభిస్తాయి.
బస్ సర్వీస్ రాంగఢ్ కోపరేటివ్ సొసైటీ ఒక బస్ సర్వీస్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది రాంచు, రాజ్‌పరా మందిరం వరకు రాంగఢ్ కంటోన్మెంటు మీదుగా పోతుంది.
రహదారి మార్గం :
మహాత్మా గాంధీ సమాధి శాంతల్ :[12] శాతల్ ప్రాముఖ్యతను అధికం చేస్తున్న మహాత్మా గాంధీ సమాధి ( ప్రాంతీయ వాసులు గాంధి ఘాట్ అంటారు) రాంగఢ్ లోని దామోదర్ నదీ తీరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని మోహన్‌దాస్ 1940లో రాంగఢ్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కరంచంద్ గాంధి విజయం చేస్తున్నారు.[73] మహాత్మా గాంధీని కాల్చి చంపిన తరువాత సంఘటనా స్థలంలో ఉన్న మట్టిని దేశంలోని వివిధ ప్రాతాలకు పంపారు. అటువంటి ప్రదేశాలలో ఒకటి రాంగఢ్ ఒకటి. తరువాత ఈ ప్రదేశంలో గంధిసమాధి నిర్మించబడింది. ఆరంభంలో గాంధిసమాధి సమీపంలో గాంధీజీ పుట్టినరోజు, వర్ధంతిరోజున ప్రదర్శన ఏర్పాటు చేయబడుతుండేది. అయినా ప్రస్తుతం ఈ ప్రదేశం నిర్లక్ష్యానికి గురైంది. ఈ సమాధి నల్లని గ్రానైట్ రాళ్ళతో చేయబడింది.
చైనా సమాధి:[74] రాంగఢ్ కంటోన్మెంటుకు ఇది 5కి.మీ దూరంలో ఉంది. చైనా కబ్రిస్థాన్ ప్రఖ్యాత చారిత్రిక స్మారక చిహ్నం. రెండవప్రపంచ యుద్ధం ఆరంభం అయిన తరువాత సాంస్కృతిక ఉద్యమానికి చెందిన గొప్ప నాయకుడు " మాత్సే తుంగ్‌కు "కు వ్యతిరేకంగా అలాగే మిత్రరాజ్యాల బృదానికి మదాతుదారులైన కొంతమంది సైనికులు పట్టుబడి రాంగఢ్‌లో బంధించబడ్డారు. తరువాత కొంతకాలానికి ఈ సైనికులు ఆకలి, పాముకాటుకు బలై మరణించారు. మరణించిన సైకులందరినీ మూకుమ్మడిగా సమాధి చేసిన ప్రాంతంలో " చైనా కబ్రిస్తాన్ " నిర్మించబడింది. ఇక్కడ దాదాపు 667 సమాధులు ఉన్నాయి. ఈ సమాధుల మధ్య స్థాపించిన స్తంభం మీద " చ్యాన్ కి సేక్ " స్మారక చిహ్నాలు చెక్కబడ్డాయి. ఈ సమాధి భూమి మొత్తం వైశాల్యం 7 ఎకరాలు. ఇక్కడి నుండి ఒక భౌద్ధాలయం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమాధి ప్రాంతంలో 3 సైనిక స్థావరాలు ఉన్నాయి. సమాధి ప్రదేశంలో పక్కా మర్గాలు, అనమైన పూలమొక్కలు చోటు చేసుకున్నాయి. రాంగఢ్ చారిత్రక సంఘటనలకు ఇది తార్కాణంగా నిలిచింది.
రాంగఢ్ పలు స్మారకచిహ్నాలకు ఆలవాలమై ఉంది. చితార్పూర్,గోలా, కుజు వద్ద ఉన్న స్మారకచిహ్నాలు (మెగలిత్స్) కనిపెట్టబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.