జార్ఖండ్
భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ (ఝార్ఖండ్) (Jharkhand) తూర్పు భారతదేశంలో ఒక రాష్ట్రం. బీహార్‌లోని దక్షిణ భాగమైన జార్ఖండ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ రాష్ట్రానికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దక్షిణాన ఒడిషా, తూర్పున పశ్చిమ బెంగాల్ సరిహద్దులుగా ఉన్నాయి. విస్తీర్ణం మేరకు జార్ఖండ్ దేశంలో 15వ పెద్ద రాష్ట్రంగా ఉండగా.. జనభా రీత్యా 14వ పెద్ద రాష్ట్రంగా ఉంది. రాంఛి జార్ఖండ్ రాష్ట్ర రాజధాని కాగా దుమ్కా ఉప రాజధానిగా ఉంది. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్ కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు. ఈ రాష్ట్ర వైశాల్యం 79,714 చదరపు కిమీ.
Jharkhand | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
Etymology: "Forest Land" | |||||||||
Nickname: "Land of Forests" | |||||||||
Motto(s): Satyameva Jayate (Truth alone triumphs) | |||||||||
Coordinates: 23.35°N 85.33°E | |||||||||
Country | India | ||||||||
Region | East India | ||||||||
Before was | Part of Bihar | ||||||||
Formation (as a state) | 15 November 2000 | ||||||||
Capital | Ranchi | ||||||||
Largest City | Jamshedpur | ||||||||
Districts | 24 (5 divisions) | ||||||||
Government | |||||||||
• Body | Government of Jharkhand | ||||||||
• Governor | C. P. Radhakrishnan | ||||||||
• Chief Minister | Hemant Soren (JMM) | ||||||||
State Legislature | Unicameral | ||||||||
• Assembly | Jharkhand Legislative Assembly (81 seats) | ||||||||
National Parliament | Parliament of India | ||||||||
• Rajya Sabha | 6 seats | ||||||||
• Lok Sabha | 14 seats | ||||||||
High Court | Jharkhand High Court | ||||||||
విస్తీర్ణం | |||||||||
• Total | 79,716 కి.మీ2 (30,779 చ. మై) | ||||||||
• Rank | 15th | ||||||||
Dimensions | |||||||||
• Length | 380 కి.మీ (240 మై.) | ||||||||
• Width | 463 కి.మీ (288 మై.) | ||||||||
Elevation | 277 మీ (909 అ.) | ||||||||
Highest elevation | 1,382 మీ (4,534 అ.) | ||||||||
జనాభా (2011)[2] | |||||||||
• Total | 3,29,88,134 | ||||||||
• Rank | 14th | ||||||||
• జనసాంద్రత | 414/కి.మీ2 (1,070/చ. మై.) | ||||||||
• Urban | 24.05% | ||||||||
• Rural | 75.95% | ||||||||
Demonyms | Jharkhandi | ||||||||
Language | |||||||||
• Official | Hindi[3] | ||||||||
• Additional Official | |||||||||
GDP | |||||||||
• Total (2023–24) | ₹4.23 లక్ష కోట్లు (US$53 billion) | ||||||||
• Rank | 19th | ||||||||
• Per capita | ₹1,07,436 (US$1,300) (30th) | ||||||||
Time zone | UTC+05:30 (IST) | ||||||||
ISO 3166 code | IN-JH | ||||||||
Vehicle registration | JH | ||||||||
HDI (2019) | 0.598 Medium (34th) | ||||||||
Literacy (2011) | 66.41% (32nd) | ||||||||
Sex ratio (2021) | 948♀/1000 ♂[6] (26th) | ||||||||
Symbols of Jharkhand | |||||||||
Language | Hindi[3] | ||||||||
Bird | Koel | ||||||||
Flower | Palash | ||||||||
Mammal | Indian elephant[7] | ||||||||
Tree | Sal | ||||||||
State Highway Mark | |||||||||
State Highway of Jharkhand JH SH1 - JH SH | |||||||||
List of State Symbols |
2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ఝార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు.[8] చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున ఝార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం అని చాలాసార్లు ఝార్ఖండ్ ను ప్రస్తావించారు.
బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు (1928లో ఒలింపిక్ జట్టుకు కెప్టెన్, స్వర్ణపతక విజేత కూడాను) ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న భారత పార్లమెంటులో "బీహారు పునర్వవస్థీకరణ బిల్లు" (Bihar Reorganization Bill) ఆమోదించబడింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం.
కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా ఝార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. మగధ సామ్రాజ్యంకాలం నుంచీ ఉంది. 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన "రాజా జైసింగ్" తనను ఝార్ఖండ్ రాజుగా ప్రకటించుకొన్నాడు. ముఘల్ సామ్రాజ్యంకాలంలో ఝార్ఖండ్‌ను "కుకర"ప్రాంతమనేవారు. బ్రిటిష్ పాలన సమయంలో ఎత్తుపల్లాల కొండలు, అడవులు, దిబ్బలతో నిండినందున ఝార్ఖండ్ అనే పేరు ఈ ప్రాంతానికి పరిపాటి అయ్యింది. ("ఝరీ" - అంటే పొద). చోటానాగపూర్ పీఠభూమి, సంథాల్ పరగణాలలో విస్తరించి ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దౌర్జన్యాలతో వేసారిన ఝార్ఖండ్ ఆదివాసుల తిరుగుబాటు 1857నాటి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంకంటే నూరేళ్ల ముందే ప్రారంభమైనది.
రాష్ట్రంలో అధికభాగం ఛోటానాగపూరు పీఠభూమిలో ఉంది. కోయల్, దామోదర్, బ్రహ్మణి, ఖర్కాయ్, సువర్ణ రేఖ వంటి నదులకు ఇది జన్మస్థానం. రాష్ట్రంలో చాలా భాగం అటవీమయం. పులులు, ఏనుగులకు కొన్ని చోట్లు ఆవాసం.
ఎక్కువగా రాళ్ళు అరిగినందువల్ల ఏర్పడిన నేల. రాష్ట్రంలో ఉన్న నేలల రకాలు:
ఝార్ఖండ్ లో వైవిధ్యంగల వృక్ష సంపద, జంతుసంపద పుష్కలంగా ఉంది. చాలా జాతీయోద్యానవనాలు, జంతు ప్రదర్శన శాలలు ఉన్నాయి.
ఝార్ఖండ్ వన్యసంపద ఎంత సంపన్నమైనదో తెలుసు కోవడానికి ఒక ఉదాహరణ: పలములోని ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులో ఒక్కో జాతికి ఎన్నిరకాలున్నాయో గమనించవలసింది - - క్షీరదాలు (39 రకాలు), పాములు (8వ రకాలు), తొండలు (4 రకాలు), చేపలు (6 రకాలు), కీటకాలు (21 రకాలు), పక్షులు (170 రకాలు), విత్తనపు మొక్కలు (97 రకాలు), పొదలు (46 రకాలు), తీగెలు, పరాధీనమొక్కలు Climbers, పరాన్నజీవ మొక్కలు & అర్ధపరాన్నజీవులు (25 రకాలు), గడ్డి-వెదురులు (17 రకాలు).
ఝార్ఖండ్ జనాభా 2కోట్ల 69 లక్షలు. మగవారు 1కోటి 39 లక్షలు. ఆడువారు 1కోటి 30 లక్షలు. (ఆడ:మగ నిష్పత్తి 941:1000) జనాభాలో 28% ఆదివాసీలు, 12% షెడ్యూల్డ్ కులాలవారు. 60% ఇతరులు. ప్రతి చదరపు కి.మీ.కు 274మంది జనాభా. (గుమ్లా జిల్లా జన సాంద్రత 148, ధన్‌బాద్ జిల్లా జనసాంద్రత: 1167)
ఎంతోకాలం నుండి చాలామంది ఆదివాసులకు ఝార్ఖండ్ ఆవాసంగా ఉంటూ వచ్చింది. కొన్ని జిల్లాలలో ఆదివాసుల జనాభా మెజారిటీగా ఉంది. మొత్తం ఝార్ఖండ్‌లో 32 ప్రధాన ఆదివాసి తెగలున్నాయి. అవి అసుర్, బైగా, బంజారా, బతుడీ, బెడియా, బింఝియా, బిర్‌హోర్, బిర్జియా, చెరో, చిక్-బరైక్, గోడ్, గొరైత్, హో, కర్మాలి, ఖర్వార్, ఖోండ్, కిసన్, కొరా, కోర్వా, లోహ్రా, మహిలి, మల్-పహారియా, ముండా, ఒరావొన్, పర్హైయా, సంతల్, సౌరియా-పహారియా, సవర్, భుమిజ్, కోల్, కన్వర్ తెగలు.
ఇంకా ఇక్కడి ఖనిజ సంపదల వల్లా, భారీ పరిశ్రమల వల్లా లభించే అవకాశాల కారణంగా చాలామంది బీహారు, బెంగాలు వగటి పొరుగు రాష్ట్రాలవారు (ఇంతకు ముందు బీహారు పొరుగు రాష్ట్రం కాదు. ఝార్ఖండ్ బీహారులో భాగం) ఇక్కడ. ముఖ్యంగా ధన్‌బాద్, జంషెడ్‌పూర్, రాంచీ వంటి పారిశ్రామిక నగరాలలో - స్థిరపడ్డారు.
హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం - ఇవి ఝార్ఖండ్‌లో ప్రధానమైన మతాలు.
పేద ప్రజలున్న ధనికరాష్ట్రమని ఝార్ఖండ్‌ను వర్ణింపవచ్చును. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడి జంషెడ్‌పూర్, ధన్‌బాద్, బొకారోలలో ఉన్నాయి.
కాని చాలా వెనుకబడిన పల్లెలు, పట్టణాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. పట్టణ జనాభా 22.5%. సగటు తలసరి వార్షిక ఆదాయం $90 మాత్రమే
ఝార్ఖండ్ రాష్ట్రం ఖనిజసంపదకు పెట్టింది పేరు.
ఝార్ఖండ్ పాలనా వ్యవస్థ దేశంలో అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి 33, భారతీయ జనతా పార్టీ కూటమి 36, ఇండిపెండెట్లు 12 స్థానాలలో విజయం సాధించాయి. ఎవరికీ పూర్తి మెజారిటీ దక్కలేదు. శిబూసోరెన్ రెండుసార్లు, స్వతంత్ర అభ్యర్థి మధుకోడా రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగు సంవత్సరాలలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం మారింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉంది. 2009 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. 2010లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకు చెందిన అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఝార్ఖండ్ మొదట బీహారు రాష్ట్రంనుండి వేరుచేసి 18 జిల్లాలతో ఏర్పరచారు. తరువాత జిల్లాలను పునర్వ్యవస్థకరించి, మరో 4 జిల్లాలను ఏర్పరచారు. లాతెహార్, సరైకెలా ఖరస్వాన్, జమ్‌తారా, సాహెబ్‌గంజ్ అనేవి ఆ క్రొత్త జిల్లాలు. ఇప్పుడు మొత్తం 22 జిల్లాలున్నాయి.
మూడు ప్రధాన భాషా కుటుంబాలకు చెందిన భాషలు, యాసలు ఝార్ఖండ్‌లో మాట్లాడుతారు.
ఆరోగ్యం
ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంవల్ల 1918లోనే రాంచిలో ప్రత్యేక మానసిక అవసరాలున్నవారికోసం మానసిక వైద్యసదుపాయ కేంద్రాన్ని నిర్మించారు (for treatment of mentally challenged) – కేంద్రీయ మానసిక వైద్య సంస్థ
కొన్ని ప్రాంతాలలో పేదరికం, ఆహారలోపం వల్ల క్షయ వ్యాధి ప్రబలంగా ఉంది. రామకృష్ణామఠం వంటి సేవా సంస్థలు 1948నుండి అటువంటి వారికి కొన్ని వైద్య సదుపాయాలు నిర్వహిస్తున్నాయి.. కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం జంషెడ్‌పూర్‌లో టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉత్తమసేవలను అందిస్తున్నది.
అయినా వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపరచవలసిన అవసరం చాలా ఉంది.
విద్య
ఝార్ఖండ్‌లో అక్షరాస్యత 54.13% (2001) . ఆడువారిలో అయితే 39.38% మాత్రమే. విద్యా సదుపాయాలు ఒకోచోట బాగాను, చాలాచోట్ల అధమంగానూ ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సంస్థలు మారుమూల ప్రాంతాలలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నాయి.
ఝార్ఖండ్‌లో 5 విశ్వ విద్యాలయాలున్నాయి
ఇతర ముఖ్యమైన విద్యా సంస్థలు
కాని చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యలకోసం ఇతరరాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తున్నది.
రాష్ట్ర రాజధాని రాంచీ నుండి వెలువడే హిందీ పత్రికలు రాంచీ ఎక్స్‌ప్రెస్, ప్రభాత్ ఖబర్ ముఖ్యమైన వార్తా పత్రికలు. పెద్ద నగరాలలో దేశ నలుమూలలనుండి ప్రధానమైన పత్రికలు - ముఖ్యంగా హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషలవి- లభిస్తాయి. దేశంలో అన్ని ప్రాంతాలవలెనే రేడియో, టెలివిజన్, టెలిఫోన్ సౌకర్యాలున్నాయి.
ఝార్ఖండ్ రాష్ట్రములో హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఆదరణ ఉంది. భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు జైపాల్ సింగ్, ప్రస్తుతం హాకీ జట్టు సభ్యుడు విమల్ లక్రా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని ఈ రాష్ట్రం వారే.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.