Remove ads
From Wikipedia, the free encyclopedia
మేదినీనగర్ జార్ఖండ్ రాష్ట్రంలోని నగరం. ఇది పాలము డివిజన్ లోని, పాలము జిల్లాకు మ్ముఖ్యపట్టణం. గతంలో దీన్ని డాల్టన్‌గంజ్ అనేవారు. పట్టణ పరిపాలన నగరపాలక సంస్థ చేతిలో ఉంది. ఈ నగరం ఉత్తర కోయల్ నది ఒడ్డున ఉంది. రాష్ట్రంలో చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన పట్టణాలలో ఇదొకటి.
డాల్టన్‌గంజ్ | |
---|---|
మేదినీనగర్ | |
Coordinates: 24.03°N 84.07°E | |
దేశం | India |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | పాలము |
జిల్లా | పాలము |
Established | 1880 |
Named for | మేదినీ రాయ్ |
విస్తీర్ణం | |
• Total | 150 కి.మీ2 (60 చ. మై) |
Elevation | 215 మీ (705 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,58,941 |
• Rank | జార్ఖండ్‌లో 10వ స్థానం |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,700/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 822101 |
telephone | 06562 |
Vehicle registration | JH-03 |
1861 లో, బ్రిటీష్ రాజ్ సమయంలో, మానవ శాస్త్రవేత్త, ఛోటా నాగ్‌పూర్ కమిషనరు అయిన ఐరిష్మన్ కల్నల్ ఎడ్వర్డ్ ట్యూట్ డాల్టన్ (1815-1880) పేరిట ఈ నగరానికి డాల్టన్‌గంజ్ అనే పేరు వచ్చింది. [1] [2] 2004 లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మేదినీనగర్ అని మార్చింది. [3] నగరంలోని రైల్వే స్టేషన్ పేరును మార్చకుండా అలాగే ఉంచారు. ఇది 2015 మే 30 న ఏర్పడిన మేదినీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. ఈ నగరానికి చేరో రాజవంశపు రాజు మేదిని రాయ్ పేరు పెట్టారు.
మేదినీనగర్ 24.03°N 84.07°E వద్ద, [4] సముద్రమట్టం నుండి సగటున 215 ం. ఎత్తున ఉంది.
నగరం నుండి దాదాపు 20 కి.మీ. దూరంలో బెట్లా నేషనల్ పార్కుఉంది. ఈ పార్కు పులులకు ప్రసిద్ధి. ఇది పాలమౌ టైగర్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. సమీపంలోని పిక్నిక్ స్పాట్ కెచ్కి. ఇది డాల్టన్‌గంజ్ నుండి 18 కి.మీ. దూరంలో, కోల్, ఔరంగా నదుల సంగమం వద్ద ఉంది. దట్టమైన అడవులతో నిండిన పీఠభూమి అయిన నెతర్‌హాట్ కూడా నగరానికి సమీపంలో ఉంది.
మేదినీనగర్ న్యూ ఢిల్లీకి ఆగ్నేయంగా 1036 కి.మీ. దూరంలో ఉంది. లక్నో, పాట్నా, రాంచీ, కోట, భోపాల్ జంక్షన్, అహ్మదాబాద్, ఢిల్లీ, జబల్పూర్, కోల్‌కతా, వారణాసి, గయల నుండి డాల్టన్‌గంజ్ రైల్వే స్టేషనుకు (DTO) రైళ్ళున్నాయి.
సమీప విమానాశ్రయం 165 కి.మీ. దూరంలో రాంచీలో ఉంది. నగరానికి దగ్గరలో, దక్షిణాన, చియాంకి ఎయిర్‌స్ట్రిప్ ఉంది. దీనిని ఎక్కువగా ప్రైవేట్ ఛాపర్లు, చిన్న విమానాలు ఉపయోగిస్తాయి. మీడియం సైజు విమానాల ఆపరేషన్ కోసం ఎయిర్‌స్ట్రిప్‌ను బలోపేతం చేయడానికీ, విస్తరించడానికీ ఒక ప్రణాళిక ఉంది. [5]
మేదినీనగర్ నుండి పాట్నా, రాంచీ, రాయపూర్, అంబికాపూర్, కోల్‌కతా, దుర్గాపూర్, వారణాసి, జంషెడ్పూర్, ధన్‌బాద్, ఢిల్లీ, లక్నో, అలహాబాద్, కోట, కాన్పూర్ గయ, మొదలైన నగరాలకు చక్కటి రోడ్డు మార్గాలున్నాయి.
2011 జనగణన నాటికి,[6] మేదినీనగర్ జనాభా 3,89,307. జనాభాలో పురుషులు 53% కాగా మహిళలు 47%. అక్షరాస్యత 87.29%. ఇది జాతీయ సగటు 74.04%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 91.92%, స్త్రీల అక్షరాస్యత 82.10%. జనాభాలో 13% 6 సంవత్సరాల లోపు వారు.
మేదినీనగర్‌లో ప్రధాన హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ పండుగలు జరుపుకుంటారు. ఈ పట్టణం డాల్టన్‌గంజ్ రోమన్ కాథలిక్ డియోసెస్కు స్థానం. పట్టణంలో పాలమౌ క్లబ్బు, రోటరీ క్లబ్బు, రిడా ఫౌండేషన్‌తో సహా అనేక సొసైటీలు, క్లబ్బులు, NGO లూ ఉన్నాయి. [7]
సత్యజిత్ రే బెంగాలీ చిత్రం, ఆరణ్యేర్ దిన్ రాత్రిని పాలములో చిత్రీకరించారు. బాలీవుడ్ చిత్రం అర్జున్ రాంపాల్ నటించిన <i id="mwaw">నాస్తిక్</i> చిత్రీకరణ కూడా మేదినీనగర్‌లో చేసారు. [8]
మేదినీనగర్‌లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది ( కొప్పెన్ వాతావరణ వర్గీకరణ Cwa ).
శీతోష్ణస్థితి డేటా - Medininagar (1981–2010, extremes 1901–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 34.2 (93.6) |
40.6 (105.1) |
43.9 (111.0) |
46.5 (115.7) |
47.8 (118.0) |
46.9 (116.4) |
43.8 (110.8) |
40.2 (104.4) |
39.7 (103.5) |
40.0 (104.0) |
36.5 (97.7) |
33.2 (91.8) |
47.8 (118.0) |
సగటు అధిక °C (°F) | 25.2 (77.4) |
28.4 (83.1) |
33.9 (93.0) |
39.3 (102.7) |
40.8 (105.4) |
37.8 (100.0) |
32.8 (91.0) |
32.0 (89.6) |
32.3 (90.1) |
31.9 (89.4) |
29.5 (85.1) |
26.3 (79.3) |
32.5 (90.5) |
సగటు అల్ప °C (°F) | 9.1 (48.4) |
11.9 (53.4) |
16.5 (61.7) |
22.0 (71.6) |
26.2 (79.2) |
27.4 (81.3) |
25.9 (78.6) |
25.5 (77.9) |
24.5 (76.1) |
20.4 (68.7) |
14.3 (57.7) |
9.7 (49.5) |
19.5 (67.1) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0.0 (32.0) |
0.6 (33.1) |
5.6 (42.1) |
11.2 (52.2) |
17.8 (64.0) |
18.6 (65.5) |
18.2 (64.8) |
20.6 (69.1) |
17.2 (63.0) |
10.0 (50.0) |
5.0 (41.0) |
1.7 (35.1) |
0.0 (32.0) |
సగటు వర్షపాతం mm (inches) | 11.9 (0.47) |
19.6 (0.77) |
15.6 (0.61) |
9.4 (0.37) |
24.8 (0.98) |
151.6 (5.97) |
285.2 (11.23) |
288.6 (11.36) |
179.0 (7.05) |
49.5 (1.95) |
8.4 (0.33) |
6.3 (0.25) |
1,049.8 (41.33) |
సగటు వర్షపాతపు రోజులు | 1.1 | 1.6 | 1.8 | 0.9 | 1.9 | 7.0 | 14.9 | 13.5 | 9.4 | 2.9 | 0.6 | 0.7 | 56.2 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 50 | 41 | 32 | 24 | 30 | 52 | 77 | 79 | 76 | 62 | 57 | 57 | 53 |
Source: India Meteorological Department[9][10] |
మేదినీనగర్ లోని నీలాంబర్-పీతాంబర్ విశ్వవిద్యాలయాన్ని 2009 లో స్థాపించారు. [11] [12]
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర ఉన్నత విద్య కోసం మేదినీనగర్ చుట్టుపక్కల అనేక కళాశాలలు ఉన్నాయి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.