Remove ads

సాహెబ్‌గంజ్ జార్ఖండ్ రాష్ట్రం, సాహెబ్‌గంజ్ జిల్లా లోని పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం. దీన్ని సాహిబ్‌గంజ్ అని కూడా పిలుస్తారు. నిర్మలమైన గంగానది ఒడ్డున చుట్టూ కొండలతో కూడిన సుందరమైన పట్టణం ఇది. సాహెబ్‌గంజ్ సబ్ డివిజన్‌కు, సాహెబ్‌గంజ్ (కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్) లకూ ఇది ప్రధాన కార్యాలయం.

త్వరిత వాస్తవాలు సాహెబ్‌గంజ్ సాహిబ్‌గంజ్, దేశం ...
సాహెబ్‌గంజ్
సాహిబ్‌గంజ్
పట్టణం
Thumb
సాహెబ్‌గంజ్
సాహెబ్‌గంజ్
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25.25°N 87.65°E / 25.25; 87.65
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాసాహెబ్‌గంజ్
విస్తీర్ణం
  Total4.25 కి.మీ2 (1.64 చ. మై)
Elevation
16 మీ (52 అ.)
జనాభా
 (2011)
  Total88,214
  జనసాంద్రత21,000/కి.మీ2 (54,000/చ. మై.)
భాషలు
  అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
PIN
816109
Telephone code06436
Vehicle registrationJH-18
లింగ నిష్పత్తి952 /
మూసివేయి

చరిత్ర

సాహెబ్‌గంజ్ పట్టణ చరిత్ర ప్రధానంగా రాజ్‌మహల్, తెలియాగఢీ కోట చరిత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతంలో మాల్ పహాడియాలు మాత్రమే నివసిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. వారు రాజమహల్ కొండల వద్ద స్థిరపడ్డ తొలి నివాసులు. వారు ఇప్పటికీ అదే కొండలలోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారు. 302 BC లో రాజమహల్ కొండల సమీపంలో సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్ పేర్కొన్న "మల్లి" వీరేనని భావిస్తున్నారు. సా.శ. 645 లో చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ సందర్శించే వరకు, ఈ ప్రాంతపు చరిత్ర అస్పష్టతంగా ఉంది. గంగకు దగ్గరలో ఇటుకలు, రాతితో కట్టిన ఎత్తైన టవర్‌ను త్సాంగ్ తన యాత్రా కథనంలో తెలియాఘర్హి కోట గురించి (ప్రస్తుత రైలు మార్గంలో, మిర్జాచౌకి రైల్వే స్టేషన్ సమీపంలో) ప్రస్తావించాడు,  

13 వ శతాబ్దం నుండి జిల్లాకు నిరంతరం చరిత్ర ఉనికిలో ఉంది, బెంగాల్‌కు బయలుదేరిన ముస్లిం సైన్యాలకు తెలియాగఢీ ప్రధాన ద్వారంగా ఉండేది. ఢిల్లీలో సుల్తానేట్ పాలనలో బక్తియార్ ఖిల్జీ తెలియాగ్రాహి కనుమ ద్వారానే బెంగాల్, అసోం ల వైపు కవాతు చేశారు. అతను బెంగాల్‌ను స్వాధీనం చేసుకున్నపుడు దాని రాజు, లక్ష్మణ్ సేన కూచ్ బెహార్ (పశ్చిమ బెంగాల్‌లో) కు పారిపోయాడు.

1538 లో, షేర్ షా సూరి, హుమయూన్‌లు తెలియాగఢీ సమీపంలో తలపడి నిర్ణయాత్మక యుద్ధం చేసారు. 1576 జూలై 12 న జరిగిన రాజమహల్ యుద్ధంతో బెంగాల్‌లో మొఘల్ పాలనకు పునాది పడింది.

అక్బరుకు అత్యంత విశ్వసనీయమైన సేనాని మాన్ సింగ్, బెంగాల్, బీహార్ వైస్రాయ్ హోదాలో 1592 లో రాజమహల్‌ను బెంగాలుకు రాజధానిగా చేశాడు. 1608 లో రాజధానిని ఢాకాకు మార్చడంతో రాజమహల్‌కు దక్కిన ఈ గౌరవం స్వల్పకాలికమే అయింది.

ఇది జరిగిన కొద్దికాలానికే, తెలియాగఢ్, రాజమహల్‌లు తిరుగుబాటుదారుడైన ప్రిన్స్ షాజహాన్, ఇబ్రహీం ఖాన్‌ల మధ్య భీకర యుద్ధానికి వేదికయ్యాయి. ఇందులో షాజహాన్ విజయం సాధించి, కొంతకాలం పాటు బెంగాలుకు అధిపతి అయ్యాడు. చివరకు 1624 లో అలహాబాద్‌లో ఓడిపోయాడు.

1639 లో, షాజహాన్ చక్రవర్తి రెండవ కుమారుడు షా షుజాను బెంగాల్ వైస్రాయ్‌గా నియమించినపుడు రాజమహల్‌ను రాజధానిగా చేసుకోవడంతో తన వైభవాన్ని తిరిగి పొందింది. ఇది 1660 వరకు మొఘల్ వైస్రాయ్ స్థావరంగా, 1661 వరకు నాణేలను ముద్రించే పట్టణంగా కొనసాగింది. డా. గాబ్రియేల్ బౌటెన్, షా షుజా కుమార్తెకు నయం చేయడం రాజమహల్‌లోనే జరిగింది. దీంతో డాక్టర్ బైటెన్, బెంగాల్‌లో వ్యాపారం చేయడానికి ఆంగ్లేయులకు స్వేచ్ఛనిచ్చే ఫర్మనాను సాధించాడు. ఆ విధంగా బ్రిటిష్ పాలనకు అతిచిన్న పునాది ఇక్కడే పడింది. 1757 లో ప్లాసీ యుద్ధం తర్వాత పారిపోయిన సిరాజ్-ఉద్-దౌలా రాజమహల్ వద్దనే పట్టుబడ్డాడు.

భౌగోళికం

సాహెబ్‌గంజ్ 25.25°N 87.65°E / 25.25; 87.65 వద్ద,[1] సముద్రమట్టం నుండి సగటున 16 మీటర్ల ఎత్తున ఉంది,

సాహెబ్‌గంజ్ విస్తీర్ణం 4.25 చ.కి.మీ.

Remove ads

జనాభా వివరాలు

జనాభా

త్వరిత వాస్తవాలు సాహిబ్‌గంజ్ జనాభా, Census ...
సాహిబ్‌గంజ్ జనాభా 
CensusPop.
19017,558
191114,78395.6%
192111,880-19.6%
193115,88333.7%
194120,74230.6%
195125,66923.8%
196131,40922.4%
197135,64013.5%
198145,15426.7%
199149,2579.1%
200180,15462.7%
201188,21410.1%
మూలం:[2]
మూసివేయి

2011 భారత జనగణన ప్రకారం, సాహెబ్‌గంజ్‌లో జనాభా 88,214. ఇందులో 46,449 (53%) పురుషులు, 41,675 (47%) మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల జనాభా 12,262. సాహెబ్‌గంజ్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 75,952 (ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 79.21%).[3]

Remove ads

రవాణా

సాహెబ్‌గంజ్ తూర్పు రైల్వేలోని సాహెబ్‌గంజ్ లూప్‌లో ఉంది.[4]

సాహెబ్‌గంజ్ను మణిహారికి అనుసంధానం చేస్తూ భారత ప్రభుత్వం గంగా నదిపై వంతెనను నిర్మిస్తోంది. ఈ వంతెన జార్ఖండ్‌ను ఈశాన్య భారతదేశానికి కలుపుతుంది. ఖనిజాల రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.

జాతీయ జలమార్గం 1, అంటే హల్దియా నుండి అలహాబాద్ మధ్య గంగానదిని అభివృద్ధి చేసే ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా రైలు, రహదారి, జలమార్గాలను కలిపే బహుళ మోడల్ రవాణా కేంద్రం కూడా ఇక్కడ నిర్మాణంలో ఉంది.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads