రాంగఢ్ కంటోన్మెంట్

From Wikipedia, the free encyclopedia

రాంగఢ్ కంటోన్మెంట్map

రామ్‌గఢ్ కంటోన్మెంట్, జార్ఖండ్ రాష్ట్రం, రాంగఢ్ జిల్లా లోని కంటోన్మెంట్ పట్టణం. దీన్ని రామ్‌గఢ్ కాంట్ లేదా రామ్‌గఢ్ అని కూడా పిలుస్తారు. చారిత్రికంగా, పెద్ద హజారీబాగ్ జిల్లాలో ఉపవిభాగంగా ఉన్న రామ్‌గఢ్ చివరకు 2007 సెప్టెంబర్ 12 న జిల్లా స్థాయికి ఎదిగింది. [1]

త్వరిత వాస్తవాలు రామ్‌గఢ్ కంటోన్మెంటు, దేశం ...
రామ్‌గఢ్ కంటోన్మెంటు
పట్టణం
ThumbThumb
Thumb
Clockwise from top left: Temples of Mahavidyas, Maa Chhinnamasta Temple, Naikari Dam
Thumb
రామ్‌గఢ్ కంటోన్మెంటు
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23.62°N 85.48°E / 23.62; 85.48
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లారామ్‌గఢ్
జనాభా
 (2011)
  Total1,32,441
భాషలు
  అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
829122
Vehicle registrationJH-24
మూసివేయి

సుమారుగా లక్ష కంటే కొద్దిగా తక్కువ జనాభా కలిగిన పట్టణం ఇది. [2] భారతదేశంలోని రెండు పురాతన పదాతిదళ రెజిమెంట్‌లు ఇక్కడ ఉన్నాయి.1761 లో పంజాబ్ రెజిమెంట్ ఏర్పాటు కాగా, 1846 లో సిక్కు రెజిమెంట్ ఏర్పాటైంది. బ్రిటిషు పాలనా కాలంలో ఈ రెండూ ప్రధానమైన రెజిమెంట్లు. ఈ రెండు రెజిమెంట్ల జవాన్లు ఆఫ్ఘన్ యుద్ధాలు, టోఫ్రేక్ యుద్ధం, అబిస్సినియా యుద్ధం, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో సహా అనేక ఇతర యుద్ధాలలో తమ శౌర్యాన్ని ప్రదర్శించారు.

రామ్‌గఢ్ కంటోన్మెంట్ ఒక క్యాటగిరీ-1 (జనాభా 50,000 దాటింది ) కంటోన్మెంటు. దీని పరిపాలనను కంటోన్మెంట్ బోర్డు నిర్వహిస్తుంది. ప్రజారోగ్యం, నీటి సరఫరా, పారిశుధ్యం, ప్రాథమిక విద్య, వీధి దీపాలు వంటి విధులతో సహా, మునిసిపల్ పరిపాలన మొత్తం ఇదే చూస్తుంది. ప్రాథమిక సౌకర్యాలను అందించడంతో పాటు, బోర్డు అనేక స్థాయిలలో ప్రజల కోసం వివిధ సామాజిక, సాంస్కృతిక, విద్యా సంస్థలను నిర్వహిస్తుంది.

ఎక్స్-అఫిషియో, నామినేటెడ్ సభ్యులతో పాటు, కంటోన్మెంట్స్ చట్టం, 2006 ప్రకారం పలు వార్డుల నుండి స్థానికంగా ఎన్నికైన సభ్యులు కూడా బోర్డులో ఉంటారు. బోర్డు సభ్యునికి పదవీకాలం ఐదేళ్లు. బోర్డులో ఎనిమిది మంది ఎన్నికైన సభ్యులు, సైన్యం నుండి నామినేటైన ముగ్గురు సభ్యులు, ముగ్గురు ఎక్స్-అఫిషియో సభ్యులు (స్టేషన్ కమాండర్, గారిసన్ ఇంజనీర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ ఆఫీసర్), ఒక జిల్లా మేజిస్ట్రేటు ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.

రాంగడ్ చుట్టుపక్కల రాజరప్ప, లాయో, ఘాటో, భుర్కుందా, టోపా, సరుబేరా, సిర్కా, ఉర్రిమరీ, సయాల్, గిడీ మొదలైన చోట్ల ఖనిజ నిక్షేపాలున్నాయి. చుటుపాలూ మనోహరమైన లోయ ద్వారా పట్టణం నుండి రాష్ట్ర రాజధాని రాంచీకి (45 కి.మీ) రహదారి వెళ్తుంది. పట్టణానికి ఉత్తరాన దామోదర్ నది ప్రవహిస్తోంది.

రామ్‌గఢ్ కంటోన్మెంట్ 23.62°N 85.48°E / 23.62; 85.48 వద్ద ఉంది.

జనాభా

2011 భారత జనగణన ప్రకారం, రామ్‌గఢ్ పట్టణ ప్రాంత జనాభా 1,32,441, ఇందులో పురుషులు 70,871, మహిళలు 61,562. [2] రామ్‌గఢ్ పట్టణ ప్రాంతంలో రామ్‌గఢ్ కంటోన్మెంట్ (కంటోన్మెంట్ బోర్డ్ ), సిర్కా (జనగణన పట్టణం), మరార్ (CT), బర్కకానా (CT) లున్నాయి. [3]

2011 భారత జనగణన ప్రకారం, రామ్‌గఢ్ కంటోన్మెంట్‌ జనాభా 88,781, ఇందులో 48,110 మంది పురుషులు, 40,671 మంది మహిళలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా 4,382, షెడ్యూల్డ్ తెగల జనాభా 4,283. [4]

2001 జనగణన ప్రకారం,[5] రామ్‌గఢ్ కంటోన్మెంట్ జనాభా 73,455. జనాభాలో పురుషులు 57%, మహిళలు 43% ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 68%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 59%. జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

అక్షరాస్యత

2011 జనాభా లెక్కల ప్రకారం రామ్‌గఢ్ యుఎలో అక్షరాస్యుల సంఖ్య 95,734 (మొత్తం జనాభాలో 82.97 శాతం) వీరిలో 55,352 (పురుషులలో 89.57 శాతం) పురుషులు, 40,362 (స్త్రీలలో 75.35 శాతం) మహిళలు. [2]

2011 జనాభా లెక్కల ప్రకారం రామ్‌గఢ్ కంటోన్మెంట్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 64,795, ఇందులో 37,578 మంది పురుషులు, 27,267 మంది మహిళలు ఉన్నారు. [4]

రవాణా

Thumb
రామ్‌గఢ్ క్యాంట్ సమీపంలో జాతీయ రహదారి 20

రైల్వేలు

రామ్‌గఢ్ కంటోన్‌మెంట్‌లో రామ్‌గఢ్ కాంట్ రైల్వే స్టేషన్ (RMT) SER, రాంచీ రోడ్ (RRME) ECR, అర్గాడా (ARGD) ECR, బార్కకానా జంక్షన్ (BRKA) ECR అనే నాలుగు రైల్వే స్టేషను లున్నాయి .

రహదారులు

రామ్‌గఢ్ కంటోన్మెంట్ జాతీయ రహదారి 20 ద్వారా రాష్ట్ర రాజధాని రాంచీకి అనుసంధానించబడి ఉంది.

పరిశ్రమ

రామగఢ్ జార్ఖండ్‌లోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి. ఖనిజ వనరుల సామీప్యత కారణంగా అనేక చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. సెయిల్-IFICO వారి రిఫ్రాక్టరీ పరిశ్రమ ఇక్కడ ఉంది, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ వారికి రాంగడ్, బర్కాకానా, రాజరప్ప, టోపా, భుర్కుందా, కుజు మొదలైన చోట్ల ప్రాజెక్టులున్నాయి. అంతే కాకుండా బర్న్‌పూర్ సిమెంట్స్, PTPS, NTPC పాత్రాటు, దామోదర్ వ్యాలీ కార్పొరేషను, కరణ్‌పురా ఎనర్జీ లిమిటెడ్ వంటి ప్రభుత్వ. సంస్థలు ఇక్కడ ఉన్నాయి.

ముకంద్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఇన్లాండ్ పవర్. లిమిటెడ్, ఇండో అసాహి గ్లాస్, బ్రహ్మపుత్ర మెటాలిక్స్ లిమిటెడ్, జార్ఖండ్ ఇస్పాట్, ఈస్టర్న్ ఇండియా పవర్‌టెక్ లిమిటెడ్ (DLF పవర్), అలోక్ స్టీల్ ఇండస్ట్రీస్, మా చిన్నమాస్తిక సిమెంట్ & స్టీల్, చింతపూర్ణి స్టీల్, మొదలైన వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.