Remove ads
ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో హజారీబాగ్ జిల్లా ఒకటి. హజారీబాగ్ [1] దీనికి ముఖ్యపట్టణం. ఇది మావోయిస్టుల రెడ్ కారిడార్‌లో భాగం.[2]
హజారీబాగ్ జిల్లా | |
---|---|
దేశం | India |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | ఉత్తర ఛోటానాగ్పూర్ |
ముఖ్యపట్టణం | హజారీబాగ్ |
Government | |
• లోక్‌సభ | హజారీబాగ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,313 కి.మీ2 (1,665 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,34,495 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనాభా | |
• అక్షరాస్యత | 70.48% |
Time zone | UTC+05:30 (IST) |
రహదారులు | NH2(GT ROAD), NH33(Lifeline of Jharkhand from Barhi{Hazaribag} to Bahragodda{Jamshedpur}) ,NH100(Bagodar to Chatra via Hazaribag) |
Website | http://hazaribag.nic.in/ |
జిల్లా పేరు, దాని ముఖ్యపట్టణం హజారీబాగ్ పేరిట వచ్చింది. హజారీబాగ్ పేరులో రెండు పర్షియన్ పదాలు ఉన్నాయి. హజార్ అంటే "వెయ్యి", బాగ్ అంటే "తోట" - కాబట్టి, హజారీబాగ్‌కు 'వెయ్యి తోటల నగరం' అని అర్థం. ప్రముఖ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ సర్ జాన్ హోల్టన్ ప్రకారం, ఈ పట్టణం పేరు ఓక్ని, హజారీ అనే చిన్న గ్రామాల నుండి వచ్చింది. పాత పటాలలో దీన్ని ఓకున్హజ్రీగా చూపారు. ఆ పేరులోని ద్వితీయ పదం బహుశా మామిడి తోట నుండి వచ్చి ఉంటుంది. కోల్‌కతా వారణాసిల మధ్య 1782 లో నిర్మించిన 'కొత్త సైనిక రహదారి' వెంట ప్రయాణిస్తున్న సైనికులు, ప్రయాణికులూ ఇక్కడ విశ్రాంతి కోసం ఆగేవారు.[3]
హజారీబాగ్ జిల్లాలోని ఇస్కోలో మెజో-చాల్కోలిథిక్ కాలం (క్రీ.పూ 9,000-5,000) నాటి పురాతన గుహ చిత్రాలు ఉన్నాయి.[4] బర్గాగావ్కి దగ్గరగా, హజారీబాగ్ పట్టణం నుండి 25 కి.మీ. దూరంలోని పుంక్రి బార్వాడి వద్ద మెగాలిత్‌ల సమూహం ఉంది. ఇది సా.పూ. 3000 నాటివని భావిస్తున్నారు.[5]
1972 డిసెంబరు 6 న, హజారీబాగ్ నుండి విడదీసి, గిరిడి జిల్లా ఏర్పడింది.[6] 1999 లో మళ్ళీ జిల్లాను విభజించి ఛత్రా, కోడర్మా జిల్లాలను ఏర్పరచారు.[6] 2000 నవంబరు 15 న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హజారీబాగ్ జిల్లా బీహార్ నుండి జార్ఖండ్ లోకి పోయింది.[6] 2007 సెప్టెంబరు 12 న, హజారీబాగ్ జిల్లా నుండి మరొక జిల్లా, రామ్‌గఢ్, ఏర్పడింది.[6]
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1901 | 2,41,612 | — |
1911 | 2,64,297 | +9.4% |
1921 | 2,61,915 | −0.9% |
1931 | 3,11,227 | +18.8% |
1941 | 3,59,218 | +15.4% |
1951 | 3,97,342 | +10.6% |
1961 | 4,98,034 | +25.3% |
1971 | 6,43,086 | +29.1% |
1981 | 8,54,377 | +32.9% |
1991 | 11,01,171 | +28.9% |
2001 | 13,78,881 | +25.2% |
2011 | 17,34,495 | +25.8% |
2011 జనాభా లెక్కల ప్రకారం, హజారీబాగ్ జిల్లాలో జనాభా 17,34,495.[7] ఇది గాంబియా దేశానికి సమానం.[8] ఇది అమెరికా రాష్ట్రం నెబ్రాస్కా జనాభాతో సమానం.[9] జనాభా పరంగా ఇది భారతదేశపు జిల్లాల్లో 279 వ స్థానంలో ఉంది.[7] జనసాంద్రత 403/చ.కి.మీ.[7] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 25.75%.[7] హజారీబాగ్ జిల్లా లింగనిష్పత్తి, ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు.[7] అక్షరాస్యత రేటు 70.48%.[7] మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాలు 17.50% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 7.02%.
జనాభాలో హిందువులు 80.56%, ముస్లింలు 16.21% ఉన్నారు. సర్నా 1.97%, క్రైస్తవులు 0.99% ఉన్నారు.[7]
2011 భారత జనగణన ప్రకారం, జిల్లా జనాభాలో 61,58% మంది ఖోర్తా, 23.59% మంది హిందీ, 7,73% మంది ఉర్దూ, 3.48% మంది సంతాలీ భాషలను తమ మొదటి భాషగా మాట్లాడుతారు.[10]
ఈ జిల్లాలో లభించే ప్రధాన ఖనిజం బొగ్గు. జిల్లా లోని ముఖ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉత్తర కరణ్‌పురా కోల్‌ఫీల్డ్స్ లోని చార్హి, కుజూ, ఘటో తండ్, బర్కాగావ్ లున్నాయి. ఈ జిల్లా వాసులకు బొగ్గు గనులే ప్రధాన జీవనాధారం.
భారత ప్రభుత్వం 2006 లో, దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా హజారీబాగ్‌ని పేర్కొంది.[11] వెనకబడ్డ ప్రాంతాల గ్రాంట్ నిధి (BRGF) కార్యక్రమం నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాల్లో ఇది ఒకటి.[11]
హజారీబాగ్ జిల్లాలో 16 బ్లాక్‌లు ఉన్నాయి.ఆ బ్లాకుల జాబితా ఇది:
జిల్లాలో హజారీబాగ్, బర్హి అనే రెండు ఉప విభాగాలున్నాయి.
హజారీబాగ్ ఉప విభాగంలో 11 బ్లాకులున్నాయి: సదర్, హజారీబాగ్, కట్కంసందీ, బిష్ణుగఢ్, బర్కాగావ్, కెరడారీ, ఇచక్, చర్చూ, దారు, తాటి ఝరియా, కట్కమ్దాగ్, దాడీ.
బార్హి ఉప విభాగంలో పద్మ, బార్హి, చుపారన్, బర్కాథా, చల్కుషా అనే 5 బ్లాకులున్నాయి.
ఈ జిల్లాలో 5 విధానసభ నియోజకవర్గాలు ఉన్నాయి: బర్కాథా, బర్హి, బర్కాగావ్, మండూ, హజారీబాగ్. ఇవన్నీ హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.