భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది.

భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది. అయితే పుదుచ్చేరి, జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలు అయినప్పటికీ వాటికి స్వంత ప్రభుత్వాలు ఉన్నాయి. స్వంత ప్రభుత్వం కలిగిన ఢిల్లీ మాత్రం అటు రాష్ట్రం కాక, ఇటు కేంద్ర పాలిత ప్రాంతం కాక మధ్యస్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీకి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
రాజధానులు
వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన, చట్టసభల, న్యాయ కేంద్రాల జాబితా ఇది. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే స్థానాన్ని పరిపాలక కేంద్రం గాను, శాసనసభ ఉండే ప్రదేశాన్ని శాసన కేంద్రం గాను, హైకోర్టు ఉండే ప్రదేశాన్ని న్యాయ కేంద్రం గాను గుర్తించబడ్డాయి.
రాజధానిగా ఎప్పటినుండి ఏర్పడింది అనేది "ఎప్పటి నుండి" అనే నిలువులో ఇవ్వబడింది. వేసవి, శీత అనేవి శాసన సభ బడ్జెట్ సమావేశాల కాలాలను సూచిస్తాయి.
పరిపాలనా కేంద్రం రాష్ట్ర రాజధానిగా గుర్తించబడుతుంది. పూర్వ రాజధాని అంటే ప్రస్తుత రాజధానికి ముందు లేదా భారత్ లో విలీనానికి ముందు ఉన్న రాజధాని అని అర్థం. చట్ట రాజధాని స్థానం ఖాళీగా ఉంటే దానర్థం, అది కేంద్ర పాలనలో ఉందని అనుకోవాలి.
గమనికలు:జమ్మూ కాశ్మీర్ కు శ్రీనగర్, జమ్మూలు రాజధానులుగా, లఢఖ్ కు లేహ్ రాజధానిగా 2019 అక్టోబరు 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడ్డాయి.
మూలాలు
వనరులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.