సినీ నటుడు, వ్యాఖ్యాత From Wikipedia, the free encyclopedia
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ (డిసెంబర్ 12, 1945 - మార్చి 30, 2011) అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970, 80 పడుల్లో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.
నూతన్ ప్రసాద్ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | తడినాధ వర ప్రసాద్ డిసెంబర్ 12, 1945 కైకలూరు,కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్ | ||||||||||
మరణం | 2011 మార్చి 30 65) హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | (వయసు||||||||||
వృత్తి | నటుడు టీవీ వ్యాఖ్యాత | ||||||||||
ముఖ్య_కాలం | 1973–2009 | ||||||||||
|
నూతన్ ప్రసాద్ 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు.
ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’, ‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు.
1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.
నూతన్ ప్రసాద్ సైతాన్గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా 'బామ్మమాట బంగారుబాట' చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టి, 112 సినిమాలలో నటించాడు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా ప్రసాద్‌లో ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఒకే టేక్‌లో 1200 అడుగులు షాట్ ఒకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికీ ప్రసాద్ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తూ.చ. తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాలను అర్ధం చేసుకొని ఎంతటి క్లిష్టమైనా సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరిలో కలుపుగోలు తనంగా వుంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడ్ని ఆవిష్కరించేవాడు[1] ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[2]
కొద్ది రోజులు రవీంద్ర భారతికి ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని.[3]
మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూశాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.