ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (2024 -2029) From Wikipedia, the free encyclopedia
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి విజయం సాధించిన తరువాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 2024 జూన్ 12 న అతనితో పాటు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.[1] ఈ కార్యక్రమం 2024 జూన్ 12 న ఉదయం 11:27 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో కేసరపల్లి వద్ద జరిగింది.[1] 2024 జూన్ 14 న ముఖ్యమంత్రి, తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటయించారు.[2]
నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ 28వ మంత్రిమండలి | |
రూపొందిన తేదీ | 2024 జూన్ 12 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | సయ్యద్ అబ్దుల్ నజీర్ గవర్నరు |
ప్రభుత్వ నాయకుడు | ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి |
మంత్రుల సంఖ్య | ప్రకటించాలి |
మంత్రుల మొత్తం సంఖ్య | 1+24 (ముఖ్యమంత్రితో కలుపుకుని) |
పార్టీలు | ఎన్.డి.ఎ |
సభ స్థితి | మెజారిటీ
164 / 175 (94%) |
ప్రతిపక్ష పార్టీ | ఏదీలేదు |
ప్రతిపక్ష నేత | ఏవరూలేరు (శాసనసభ) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2024 |
క్రితం ఎన్నికలు | 2024 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | వై. ఎస్. జగన్‌మోహన్ రెడ్డి |
క్యాబినెట్ మంత్రుల 24 మంది జాబితా (ముఖ్యమంత్రిని మినహాయించి) 2024 జూన్ 12న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ప్రకటించారు.[3] మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి ఇరవై ఒక్కరు, జనసేన పార్టీ నుండి ముగ్గురు, భారతీయ జనతా పార్టీ నుండి ఒకరు ఉన్నారు.[4]
25 మంది సభ్యుల మంత్రివర్గంలో 17 మంది మొదటిసారి మంత్రులుగా నియమితులైనవారు.[5][6]
సంఖ్య | జిల్లా | మొత్తం | మంత్రులు |
---|---|---|---|
1 | అల్లూరి సీతారామరాజు | – | – |
2 | అనకాపల్లి | 1 | |
3 | అనంతపురం | 1 | |
4 | అన్నమయ్య | 1 | |
5 | బాపట్ల | 1 | |
6 | చిత్తూరు | 1 | |
7 | కోనసీమ | 1 | |
8 | తూర్పు గోదావరి | 1 | |
9 | ఏలూరు | 1 | |
10 | గుంటూరు | 2 | |
11 | కాకినాడ | 1 | |
12 | కృష్ణా | 1 | |
13 | కర్నూలు | 1 | |
14 | నంద్యాల | 2 | |
15 | నెల్లూరు | 2 | |
16 | ఎన్టీఆర్ | – | – |
17 | పల్నాడు | – | – |
18 | పార్వతీపురం మన్యం | 1 | |
19 | ప్రకాశం | 1 | |
20 | శ్రీ సత్యసాయి | 2 | |
21 | శ్రీకాకుళం | 1 | |
22 | తిరుపతి | – | – |
23 | విశాఖపట్నం | – | – |
24 | విజయనగరం | 1 | |
25 | పశ్చిమ గోదావరి | 1 | |
26 | కడప | – | – |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.