కింజరాపు అచ్చెన్నాయుడు
From Wikipedia, the free encyclopedia
కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు. ఆయన 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా వున్నాడు.[1] ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.
కింజరాపు అచ్చంనాయుడు | |||
![]() కింజరాపు అచ్చంనాయుడు | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు టెక్కలి శాసనసభ నియోజకవర్గం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 జూన్ 2014 - ప్రస్తుతం | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 1996 – 2009 | |||
ముందు | మజ్జి నారాయణరావు | ||
---|---|---|---|
తరువాత | పిరియా సాయిరాజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం | 26 మార్చి 1971||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం | ||
తల్లిదండ్రులు | దాలినాయుడు (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | విజయమాధవి | ||
బంధువులు | కింజరాపు ఎర్రన్నాయుడు (సోదరుడు) రామ్మోహన్ నాయుడు (సోదరుని కుమారుడు) | ||
సంతానం | కృష్ణ మోహన్ నాయుడు , తనూజ | ||
నివాసం | నిమ్మాడ గ్రామం శ్రీకాకుళం జిల్లా | ||
పూర్వ విద్యార్థి | కృష్ణా కళాశాల, విశాఖపట్నం | ||
వృత్తి | రాజకీయము , వ్యవసాయము | ||
మతం | హిందూ |
జీవిత విశేషాలు
ఆయన మార్చి 26 1971 న టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు. ఆయన కృష్ణా కళాశాల, విశాఖపట్నంలో బి.యస్సీ చదివారు.
రాజకీయ జీవితం
ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రంనాయుడు. అచ్చంనాయుడు హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మూడుసార్లు ఎం.ఎల్.ఎగా ఎన్నికైనారు. ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గానికి మారారు. ఆయన 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కె.రేవతీపతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో రేవతీపతి ఆకశ్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన మరల రేవతీపతి భార్య అయిన కె.భారతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.[2] 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో గల ఏడు శాసన సభ నియోజకవర్గాలలో ఒక్క పాతపట్నం శాసన సభ నియోజకవర్గం తప్ప అన్నింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలుపుటకు కృషిచేసిన అచ్చన్నాయుడును రాష్ట్ర కేబినెట్ లో కార్మిక శాఖను అప్పగించారు.[3]
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరార తిలక్ పై విజయం సాధించాడు.[4]
ఎన్నికలలో పోటీ
అచ్చెన్నాయుడు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 1999లో రెండోసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గం నుండి 2014, 2019, 2024లో వరుసగా మూడుసార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 19 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కార్మికశాఖ, క్రీడలు, యువజనశాఖ, వెనుకబడిన తరగతులు సంక్షేమం, జౌళి శాఖ మంత్రిగా పని చేసి,[5] 2024 జూన్ 12 నుండి చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ, పశుసంవర్థకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[6]
మూలాలు
ఇతర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.