ఆనం రామనారాయణరెడ్డి

రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia

ఆనం రామనారాయణరెడ్డి

ఆనం రామనారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్కు పాల్పడ్డాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
ఆనం రామనారాయణరెడ్డి
Thumb


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు ధర్మాన ప్రసాదరావు

ఆర్థిక మంత్రి
పదవీ కాలం
25 నవంబర్ 2010  21 ఫిబ్రవరి 2014
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు కొణిజేటి రోశయ్య
తరువాత యనమల రామకృష్ణుడు

పదవీ కాలం
5 జులై 2009  24 నవంబర్ 2010
గవర్నరు * ఎన్.డి. తివారీ
ముందు కోనేరు రంగారావు
తరువాత మానుగుంట మహీధర్ రెడ్డి

పదవీ కాలం
26 ఏప్రిల్ 2007  20 మే 2009
గవర్నరు ఎన్.డి. తివారీ
ముందు వి.లక్ష్మీకాంత రావు
తరువాత జె. గీతారెడ్డి

పదవీ కాలం
16 సెప్టెంబర్ 1984  2 డిసెంబర్ 1989
గవర్నరు * శంకర్ దయాళ్ శర్మ
ముందు ఆనం రామనారాయణరెడ్డి
పదవీ కాలం
10 జనవరి 1983  15 ఆగష్టు 1984
గవర్నరు * కె.సి.అబ్రహాం
తరువాత ఆనం రామనారాయణరెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు మేకపాటి విక్రమ్ రెడ్డి
నియోజకవర్గం ఆత్మకూరు
పదవీ కాలం
2019  2024
ముందు కురుగొండ్ల రామకృష్ణ
తరువాత కురుగొండ్ల రామకృష్ణ
నియోజకవర్గం వెంకటగిరి
పదవీ కాలం
2009  2014
ముందు కొమ్మి లక్ష్మయ్య నాయుడు
తరువాత మేకపాటి గౌతమ్ రెడ్డి
నియోజకవర్గం ఆత్మకూరు
పదవీ కాలం
1999  2009
ముందు వై.శ్రీనివాసులు రెడ్డి
తరువాత నియోజకవర్గం రద్దు
Constituency రాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-10) 10 జూలై 1952 (age 72)
నెల్లూరు, మద్రాసు రాష్ట్రం, భారతదేశం
ప్రస్తుత నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
(1991,2016-2018 వరకు, 2023 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
(1991-2016)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
(2018-2023)
జీవిత భాగస్వామి ఎ.శిరీష
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ
మూసివేయి

ప్రారంభ జీవితం

ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు చెందిన ఆనం వెంకటరెడ్డి కుమారుడు. ఇతని సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా రాజకీయ నాయకుడే. ఇతను సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.కాం, బి.ఎల్ పట్టాలను పొందాడు.[1]

కెరీర్

రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఇతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతను ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖమంత్రిగా పని చేశారు.[2] ఇతను 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. 2007, 2009 మధ్య రామనారాయణరెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూలై 2009 నాటికి ఇతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. 2012 నాటికి ఇతను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖమంత్రిగా నియమింపబడ్డాడు. 2018లో ఇతడు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] 2019 శాసనసభ ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు.[4]

రామనారాయణరెడ్డి వైసీపీని విడి టీడిపికి మద్దతుగా ఉండడంతో వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[5][6][7]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.