From Wikipedia, the free encyclopedia
కొలుసు పార్థసారథి (జ. 1965 ఏప్రిల్ 18) భారతీయ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు శాసససభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యునిగా ఉన్నాడు. 2004, 2009, 2019 లో మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004 లో మొదటిసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు, తరువాత 2009, 2019 లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆయన కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు.[1][2]
కొలుసు పార్థసారథి | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | జోగి రమేష్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
ముందు | చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | ||
మాధ్యమిక విద్యా మంత్రి | |||
పదవీ కాలం 25 నవంబర్ 2010 – 21 ఫిబ్రవరి 2014 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | మోపిదేవి వెంకటరమణ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పశుసంవర్ధక, మత్స్య & పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 25 మే 2009 – 24 నవంబర్ 2010 | |||
గవర్నరు | * ఎన్.డి. తివారీ | ||
ముందు | మండలి బుద్ధ ప్రసాద్ | ||
తరువాత | తోట నరసింహం | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | మేకా వెంకట ప్రతాప్ అప్పారావు | ||
నియోజకవర్గం | నూజివీడు | ||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | బోడె ప్రసాద్ | ||
తరువాత | బోడె ప్రసాద్ | ||
నియోజకవర్గం | పెనమలూరు | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
తరువాత | బోడె ప్రసాద్ | ||
నియోజకవర్గం | పెనమలూరు | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | అన్న బాబు రావు | ||
తరువాత | నియోజకవర్గం రద్దు | ||
నియోజకవర్గం | వుయ్యూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | కొలుసు పార్థసారథి యాదవ్ కరకంపాడు, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 18 ఏప్రిల్ 1965||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (2024 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (2014-2024) భారత జాతీయ కాంగ్రెస్ (2004-2014) | ||
తల్లిదండ్రులు | కొలుసు పెద రెడ్డయ్య యాదవ్, సామ్రాజ్యం | ||
జీవిత భాగస్వామి | కె. కమలా లక్ష్మి | ||
సంతానం | కె. నితిన్ కృష్ణ | ||
నివాసం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
వై.ఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయ మంత్రిగా పనిచేశాడు. రాజశేఖర్ రెడ్డి. పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పోర్ట్‌ఫోలియోను కేటాయించాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మాధ్యమిక విద్యకు చివరి మంత్రిగా ఉన్నాడు. ఆయన 2014లో వైఎస్సార్సీపీ తరఫున మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.
పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని 2024లో వైసీపీ టికెట్ నిరాకరించి ఆయన స్థానంలో మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు ఇంఛార్జిగా ప్రకటించడంతో[3] కొలుసు పార్థసారథి 2024 ఫిబ్రవరి 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]
పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కరకంపాడు గ్రామంలో రాజకీయ నేపథ్యంగల కుటుంబంలోజన్మించాడు. అతని తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ రాజకీయ నాయకుడు, మచిలీపట్లం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1991, 1996 లలో ఎన్నికయ్యాడు.[5] అతని తల్లి గృహిణి.
Seamless Wikipedia browsing. On steroids.