దక్షిణ భారతీయ సినీ నటుడు. రంగస్థల నటుడు From Wikipedia, the free encyclopedia
దేవరాజ్ (జ. 1953 సెప్టెంబరు 20) ఒక దక్షిణ భారతీయ సినీ, నాటక రంగ కళాకారుడు. ఎక్కువగా కన్నడ సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు.
దేవరాజ్ 1953 సెప్టెంబరు 20[2] న బెంగుళూరులోని లింగరాజపురం అనే ప్రాంతంలో రామచంద్రప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని 3 నెలల వయసులో ఇతని తండ్రి మలేరియాతో మరణించాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా ఇతడు 1976లో హెచ్.ఎం.టి. వాచ్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. అక్కడ 9 సంవత్సరాలు పనిచేశాడు. అక్కడ ఇతని సహోద్యోగి గోవిందరాజ్ సలహామేరకు ఇతడు నాటకాలలో నటించడం ప్రారంభించాడు. మొదట ఇతడు ఆర్.నాగేష్ డ్రామా కంపెనీలో, తర్వాత బి.జయశ్రీ నాటకకంపెనీ స్పందనలో ఆ తర్వాత శంకర్ నాగ్ నాటక కంపెనీ సంకేత్లో పనిచేశాడు.[3] సినిమాలలో త్రిశూల అనే సినిమాతో అడుగుపెట్టాడు.
ఇతడు 1986లో సినీనటి చంద్రలేఖను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత చంద్రలేఖ సినిమాలలో నటించడం మానివేసింది. వీరికి ప్రజ్వల్, ప్రణామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరూ సినిమా రంగంలో చురుకుగా ఉన్నారు. ఇప్పటికే ప్రజ్వల్ సినిమాలలో హీరోగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.[4]
దేవరాజ్ తొలిసారి సహాయనటుడిగా త్రిశూల అనే కన్నడ సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా విడుదలకాలేదు. ఇతడు 27 మావళ్ళిసర్కిల్ ఇతడు నటించి విడుదలైన తొలి సినిమా. అది మొదలు ఇతడు అనేక కన్నడ సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. 1990లో హత్యాకాండ అనే సినిమాలో నాయకపాత్రను పోషించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళ భాషలలో 200పైగా చలనచితాలలో నటించాడు.
ఇతడు నటించిన కొన్ని తెలుగు చలనచిత్రాలు:
Seamless Wikipedia browsing. On steroids.