From Wikipedia, the free encyclopedia
టెన్నెసీన్ (Ts) పరమాణు సంఖ్య 117 కలిగిన సింథటిక్ రసాయన మూలకం. ఇది రెండవ అత్యంత భారీ మూలకం, ఆవర్తన పట్టికలో 7వ పీరియడ్ లోని చివరి మూలకం .
టెన్నెస్సిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /ˈtɛnəsiːn/[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Appearance | semimetallic (predicted)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Mass number | [294] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
టెన్నెస్సిన్ in the periodic table | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Period | period 7 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Block | p-block | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Electron configuration | [Rn] 5f14 6d10 7s2 7p5 (predicted)[3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 32, 32, 18, 7 (predicted) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Physical properties | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Phase at STP | solid (predicted)[3][4] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Melting point | 623–823 K (350–550 °C, 662–1022 °F) (predicted)[3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Boiling point | 883 K (610 °C, 1130 °F) (predicted)[3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Density (near r.t.) | 7.1–7.3 g/cm3 (extrapolated)[4] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Atomic properties | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Oxidation states | (−1), (+1), (+3), (+5) (predicted)[2][3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Ionization energies | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Atomic radius | empirical: 138 pm (predicted)[4] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Covalent radius | 156–157 pm (extrapolated)[4] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Other properties | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Natural occurrence | synthetic | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
CAS Number | 54101-14-3 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
History | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Naming | after Tennessee region | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Discovery | Joint Institute for Nuclear Research, Lawrence Livermore National Laboratory, Vanderbilt University and Oak Ridge National Laboratory (2009) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Isotopes of టెన్నెస్సిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Template:infobox టెన్నెస్సిన్ isotopes does not exist | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 ఏప్రిల్‌లో రష్యన్-అమెరికన్ సహకారంతో రష్యాలోని డబ్నాలో టెన్నెస్సిన్ ఆవిష్కరణను అధికారికంగా ప్రకటించారు. ఇది 2022 నాటికి అత్యంత తాజాగా కనుగొన్న మూలకం. దాని ఉత్పన్న ఐసోటోప్‌లలో ఒకదాన్ని నేరుగా 2011లో సృష్టించారు. ఇది ప్రయోగం యొక్క ఫలితాలను పాక్షికంగా నిర్ధారిస్తుంది. ఈ ప్రయోగం అదే బృందంతో 2012 లోను, ఉమ్మడి జర్మన్-అమెరికన్ బృందం 2014 మేలోనూ మళ్ళీ చేసి విజయం సాధించారు. 2015 డిసెంబరులో, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ (IUPAC), ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ (IUPAP) యొక్క జాయింట్ వర్కింగ్ పార్టీలు ఈ కొత్త మూలకాన్ని గుర్తించి దీని ఆవిష్కరణలో రష్యా అమెరికా బృందానికి ప్రాధాన్యతనిచ్చింది. ఆవిష్కర్తలు అమెరికా లోని టెన్నెస్సీ, పేరిట దీనికి టెన్నెసీన్ అనే పేరును సూచించారు. IUPAC 2016 జూన్‌లో చేసిన ఒక ప్రకటనలో ఇది తెలియజేస్తూ ఈ పేరును అధికారికంగా 2016 నవంబరులో స్వీకరించింది. [lower-alpha 1]
కొత్తగా కనుక్కునే మూలకాలకు మెండలీవ్ నామకరణ పద్ధతి ప్రకారం పేరు పెడితే ఈ మూలకం 117 కు పేరు ఏకా-ఆస్టాటిన్ అని పెట్టాలి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ (IUPAC) 1979 సిఫార్సులను ఉపయోగించి, ఈ మూలకానికి శాశ్వత పేరును ఎంచుకునే వరకుతాత్కాలికంగా ఉనున్‌సెప్టియం (సింబల్ Uus ) అని పేరు పెట్టారు. ఈ తాత్కాలిక పేరు లాటిన్ మూలాలు "ఒకటి", "ఒకటి" "ఏడు" నుండి వచ్చింది - ఇది మూలకం యొక్క పరమాణు సంఖ్య 117 కు సూచన. [6] ఈ రంగంలోని చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని "మూలకం 117" అని, చిహ్నం E117, (117), లేదా 117 అని పిలిచారు. ఆవిష్కరణ ఆమోదం సమయంలో చెల్లుబాటు అయ్యే IUPAC మార్గదర్శకాల ప్రకారం, కొత్త మూలకాల శాశ్వత పేర్లు "-ium"తో ముగిసి ఉండాలి; ఈ మూలకం హాలోజన్ అయినప్పటికీ అలాగే ఉండి ఉండాలి. సాంప్రదాయకంగా హేలోజెన్ల పేర్లకు చివర "-ine" ఉంటుంది; [7] అయితే, 2016లో ప్రచురించబడిన కొత్త సిఫార్సులలో గ్రూపు 17 లోని అన్ని కొత్త మూలకాలకూ చివర "-ine" అనే ఉండాలని నిశ్చయించారు. [8]
2010లో తొలి సంశ్లేషణ తర్వాత, LLNL కు చెందిన డాన్ షాగ్నెస్సీ, ఒగానెస్సియన్లు పేరు పెట్టడం ఒక సున్నితమైన వ్యవహారం అని ప్రకటిస్తూ వీలైనంత వరకు దాన్ని నివారించాం అని చెప్పారు. [9] అయితే, ఆ సంవత్సరం హామిల్టన్ ఇలా ప్రకటించాడు, "ఈ బృందాన్ని ఒకచోట చేర్చడంలోను, ఆవిష్కరణకు అవసరమైన 249Bk లక్ష్యాన్ని సాధించడం లోనూ నేను కీలకమైన వ్యక్తిని. అంచేత నేనే ఈ మూలకానికి పేరు పెట్టబోతున్నాను. నేను ఇప్పుడు పేరు చెప్పలేను గానీ, అది ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెస్తుంది." [10] (హామిల్టన్, అమెరికా లోని టెన్నెస్సీ రాష్ట్రం నాష్విల్లే లోని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆచార్య్డుడు). 2015 ఇంటర్వ్యూలో, ఒగానెస్సియన్, ప్రయోగం యొక్క కథను చెప్పిన తర్వాత, "అమెరికన్లు దీనిని టూర్ డి ఫోర్స్‌గా పేర్కొన్నారు, తాము దీన్ని లోపాలేంఈ లేకుండా చేయగలమని వారు ప్రదర్శించారు. సరే, త్వరలో వారు 117వ మూలకానికి పేరూ పెట్టనున్నారు."
2016 మార్చిలో డిస్కవరీ బృందం, వివిధ పార్టీల ప్రతినిధులతో కూడిన కాన్ఫరెన్స్ కాల్లో ఈ మూలకానికి "టెన్నెస్సిన్" అనే పేరు పెట్టడానికి అంగీకరించింది. [11] జూన్ 2016లో, IUPAC 115, 117, 118 అనే కొత్త మూలకాలకు పేర్లు పెట్టడం కోసం కనుగొన్న వారి సూచనలు తమకు అందినట్లు ప్రకటించింది. అందులో 117 కు "టేనస్సీ ప్రాంతం" పేరిట Ts చిహ్నంతో టెన్నెస్సిన్ అని వచ్చింది. [12] నవంబర్ 2016లో, టెన్నెస్సిన్తో సహా ఆ పేర్లను అధికారికంగా ఆమోదించారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉపయోగించిన టోసిల్ సమూహానికి సంబంధించిన సంజ్ఞామానంతో ప్రతిపాదిత చిహ్నం Ts ఘర్షణ పడుతుందనే వాదనలను తిరస్కరించారు. ఇప్పటికే అలాంటి ద్వంద్వ అర్థాలున్న చిహ్నాలున్నాయని చెప్పారు: Ac (యాక్టినియం, ఎసిటైల్ ), Pr ( ప్రాసెయోడైమియం, ప్రొపైల్ ). [13] మాస్కోవియం, టెన్నెస్సిన్, ఒగానెసన్లకు నామకరణ కార్యక్రమం 2017 మార్చి 2 న మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జరిగింది; టెన్నెస్సిన్ కోసం విడిగా 2017 జనవరి లో ORNLలో మరొక ప్రత్యేక వేడుక జరిగింది. [14]
అణు లక్షణాలు కాకుండా, టెన్నెస్సిన్ లేదా దాని సమ్మేళనాల లక్షణాలు వేటినీ ఇంకా కొలవలేదు; ఇది చాలా పరిమితమైన, ఖరీదైన ఉత్పత్తి కావడం, ఇది చాలా త్వరగా క్షయం చెందుతుంది కాబటి. టెన్నెస్సిన్ లక్షణాల అంచనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
టెన్నెస్సిన్ ఆవర్తన పట్టికలో సమూహం 17లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ అనే ఐదు హాలోజన్ల క్రింద ఉంటుందని భావిస్తున్నారు; వీటిలో ప్రతి ఒక్కటి ns2np5 ఆకృతీకరణతో ఏడు వేలెన్స్ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. [lower-alpha 2] టెన్నెస్సిన్, ఆవర్తన పట్టికలో ఏడవ పీరియడ్‌లో ఉండటం వలన, ఆ ట్రెండ్ కొనసాగితే 7s27p5, యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌ను ఉంటుందని అంచనా వేయవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ స్థితికి సంబంధించిన అనేక అంశాలలో హాలోజన్ల మాదిరిగానే ప్రవర్తిస్తుందని కూడా అంచనా వేయవచ్చు. అయితే, గ్రూప్ 17 లో కిందికి వెళ్ళేకొద్దీ, మూలకాల లోహత్వం పెరుగుతుంది; ఉదాహరణకు, అయోడిన్ ఇప్పటికే ఘన స్థితిలో లోహ మెరుపును ప్రదర్శిస్తుంది, అస్టాటైన్ లక్షణాలు పైనున్న నాలుగు హాలోజన్ల కంటే చాలా భిన్నంగా ఉండటం వల్ల దాన్ని అర్ధలోహంగా (మెటాలాయిడ్) [గమనికలు 1] వర్గీకరిస్తారు. అలాగే, ఆవర్తన ధోరణులపై ఆధారపడిన ఎక్స్ట్రాపోలేషన్ను బట్టి టెన్నెస్సైన్ను అస్థిరమైన పోస్ట్-ట్రాన్సిషన్ లోహంగా అంచనా వేయవచ్చు. [15]
293Ts, 294Ts అనే టెన్నెస్సిన్ ఐసోటోప్లు రసాయన ప్రయోగాలు చెయ్యలేనంత స్వల్పకాలికమైనవి. అయినప్పటికీ, టెన్నెస్సిన్ యొక్క అనేక రసాయన లక్షణాలను లెక్కించారు. గ్రూపు 17 లోని తేలికైన మూలకాల వలె కాకుండా, టెన్నెస్సిన్ హాలోజన్లకు సాధారణమైన రసాయన ప్రవర్తనను ప్రదర్శించకపోవచ్చు. [16] ఉదాహరణకు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లు నోబుల్ గ్యాస్ యొక్క మరింత స్థిరమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌ను సాధించడానికి ఒక ఎలక్ట్రాన్‌ను సాధారణంగా స్వీకరించి, వాటి వాలెన్స్ షెల్లలో ఏడుకి బదులుగా ఎనిమిది ఎలక్ట్రాన్లను ( ఆక్టెట్ ) పొందుతాయి. [17] గ్రూపులో మూలకాల అణు బరువు పెరిగే కొద్దీ ఈ సామర్థ్యం బలహీనపడుతుంది; ఎలక్ట్రాన్‌ను తీసుకోడానికి టెన్నెస్సిన్, గ్రూపు 17 లో అత్యంత విముఖంగా ఉంటుంది. అంచనా వేసిన ఆక్సీకరణ స్థితులలో, −1 అతి తక్కువ సాధారణమైనదిగా అంచనా వేసారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.