From Wikipedia, the free encyclopedia
ఆవర్తన పట్టికలో పీరియడ్, రసాయన మూలకాల అడ్డువరుస. ఒక అడ్డువరుస లోని మూలకాలన్నీ ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్ షెల్లను కలిగి ఉంటాయి. ఒక పీరియడ్ లోని ప్రతి తదుపరి మూలకం లోను ఒక ప్రోటాన్ ఎక్కువ ఉంటుంది. దాని ముందున్న దాని కంటే తక్కువ లోహంగా ఉంటుంది. ఈ విధంగా అమర్చబడినప్పుడు, ఒకే గ్రూపు (నిలువు వరుస) లోని మూలకాలు ఒకే విధమైన రసాయనిక, భౌతిక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఆవర్తన నియమాన్ని ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, హాలోజన్‌లు చివరి నుండి రెండవ గ్రూపు (గ్రూప్ 17) లో ఉంటాయి. వీటన్నిటికీ అధిక రియాక్టివిటీ ఉంటుంది. జడ వాయువుల ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌కు చేరుకోవడానికి ఒక ఎలక్ట్రాన్‌ను పొందడం వంటి సారూప్య లక్షణాలు వీటికి ఉంటాయి. 2021 నాటికి మొత్తం 118 మూలకాలను కనుగొన్నారు.
ఆధునిక క్వాంటం మెకానిక్స్, ఎలక్ట్రాన్ షెల్స్ పరంగా లక్షణాలలో ఉండే ఈ ఆవర్తన పోకడలను వివరిస్తుంది. పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ, ఆర్డరింగ్ రూల్ రేఖాచిత్రంలో చూపిన క్రమంలో షెల్‌లు ఎలక్ట్రాన్‌లతో నింపబడతాయి. ప్రతి షెల్ యొక్క పూరకం పట్టికలోని వరుసకు అనుగుణంగా ఉంటుంది.
ఆవర్తన పట్టికలోని s-బ్లాక్, p-బ్లాక్‌లలో, ఒకే పీరియడ్లో ఉన్న మూలకాలు సాధారణంగా లక్షణాలలో పోకడలు సారూప్యతలను ప్రదర్శించవు. అయితే, డి-బ్లాక్‌లో, పీరియడ్స్‌లో పోకడలు ముఖ్యమైనవిగా మారతాయి. ఎఫ్-బ్లాక్ లో, అన్ని పీరియడ్స్ లోనూ ఆయా పీరియడ్లో ఉండే మూలకాల్లో అధిక స్థాయిలో సారూప్యత ఉంటుంది.
ఆవర్తన పట్టికలో ప్రస్తుతం ఏడు పూర్తి పీరియడ్లు ఉన్నాయి. ఇందులో 118 తెలిసిన మూలకాలు ఉన్నాయి. ఏదైనా కొత్త మూలకాలు కనుగొంటే వాటిని ఎనిమిదో పీరియడ్లో ఉంచుతారు. మూలకాలు వాటి బ్లాక్ ను బట్టి క్రిందివిధంగా రంగు సూచించబడింది: s-బ్లాక్‌కు ఎరుపు, p-బ్లాక్‌కు పసుపు, d-బ్లాక్‌కు నీలం, f-బ్లాక్‌కు ఆకుపచ్చ.
మొదటి పీరియడ్‌లో హైడ్రోజన్, హీలియం అనే రెండు మూలకాలున్నాయి. అందువల్ల అవి ఆక్టెట్ నియమాన్ని అనుసరించవు. దాని బదులు డ్యూప్లెట్ నియమాన్ని అనుసరిస్తాయి. రసాయనికంగా, హీలియం ఒక జడ వాయువు లాగా ప్రవర్తిస్తుంది. అందువలన దీన్ని గ్రూపు 18 మూలకాలలో భాగంగా తీసుకుంటారు. అయితే, దాని అణు నిర్మాణం పరంగా ఇది s-బ్లాక్‌కు చెందినది, అందువలన కొన్నిసార్లు గ్రూపు 2 మూలకం లేదా ఏకపీరియడ్లో 2, 18 రెండిటిగానూ వర్గీకరించబడుతుంది. హైడ్రోజన్ తక్షణమే ఎలక్ట్రాన్‌ను కోల్పోతుంది, పొందుతుంది, కాబట్టి రసాయనికంగా గ్రూపు 1, గ్రూపు 17 మూలకం లాగా ప్రవర్తిస్తుంది.
పీరియడ్ 2 మూలకాలు 2s, 2p కక్ష్యలను కలిగి ఉంటాయి. వాటిలో హైడ్రోజన్‌తో పాటు జీవశాస్త్రపరంగా అత్యంత ముఖ్యమైన మూలకాలైన కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ లు ఉన్నాయి.
పీరియడ్ 3 లోని మూలకాలన్నీ ప్రాకృతికంగా లభిస్తాయి. వీటన్నిటికీ కనీసం ఒకటైనా స్థిరమైన ఐసోటోప్‌ను ఉంది. జడవాయువు ఆర్గాన్ మినహా అన్నీ ప్రాథమిక భూగర్భ శాస్త్రం, జీవశాస్త్రానికి చాలా అవసరం.
గ్రూపు | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పరమాణు # పేరు |
19
K |
20
Ca |
21
Sc |
22
Ti |
23
V |
24
Cr |
25
Mn |
26
Fe |
27
Co |
28
Ni |
29
Cu |
30
Zn |
31
Ga |
32
Ge |
33
As |
34
Se |
35Br | 36Kr |
పీరియడ్ 4 జీవులకు అవసరమైన పొటాషియం, కాల్షియంలను కలిగి ఉంటుంది. d-బ్లాక్‌లో తేలికైన పరివర్తన లోహాలతో ఉండే మొదటి పీరియడ్. వీటిలో ఇనుము, ప్రధాన-శ్రేణి నక్షత్రాలలో సంశ్లేషణ చేయబడిన భారీ మూలకం. భూమి యొక్క ప్రధాన భాగం. అలాగే ఈ పీరియడ్లో కోబాల్ట్, నికెల్, రాగి వంటి ఇతర ముఖ్యమైన లోహాలు ఉన్నాయి. వీటన్నిటికీ జైవిక పాత్ర ఉంది.
నాల్గవ పీరియడ్‌లో ఆరు p-బ్లాక్ మూలకాలు కూడా ఉన్నాయి: గాలియం, జెర్మేనియం, ఆర్సెనిక్, సెలీనియం, బ్రోమిన్, క్రిప్టాన్ .
గ్రూపు | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Atomic #పేరు | 37
Rb |
38
Sr |
39
Y |
40
Zr |
41
Nb |
42
Mo |
43
Tc |
44
Ru |
45
Rh |
46
Pd |
47
Ag |
48
Cd |
49
In |
50
Sn |
51
Sb |
52
Te |
53
I |
54Xe |
పీరియడ్ 5లో పీరియడ్ 4కి సమానమైన మూలకాలున్నాయి. అదే సాధారణ నిర్మాణాన్ని అనుసరిస్తుంది కానీ ఒక అదనపు పోస్ట్ ట్రాన్సిషన్ మెటల్ ఒక తక్కువ అలోహంతో ఉంటుంది. జైవికపాత్రలు కలిగిన మూడు భారీ మూలకాలలో రెండు (మాలిబ్డినం, అయోడిన్) ఈ పీరియడ్లో ఉన్నాయి; 6వ పీరియడ్లో= ఉండే అనేక ప్రారంభ లాంతనైడ్‌లతో పాటు టంగ్‌స్టన్ బరువుగా ఉంటుంది. పీరియడ్ 5లో టెక్నీషియం కూడా ఉంటుంది, ఇది రేడియోధార్మిక మూలకాల్లో అత్యంత తేలికైనది.
గ్రూపు | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Atomic #పేరు | 55
Cs |
56
Ba |
57
La |
58
Ce |
59
Pr |
60
Nd |
61
Pm |
62
Sm |
63
Eu |
64
Gd |
65
Tb |
66
Dy |
67
Ho |
68
Er |
69
Tm |
70
Yb |
71
Lu |
72
Hf |
73
Ta |
74
W |
75
Re |
76
Os |
77
Ir |
78
Pt |
79
Au |
80Hg | 81
Tl |
82
Pb |
83
Bi |
84
Po |
85
At |
86Rn |
పీరియడ్ 6, లాంతనైడ్ (అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు) ఉండే ఎఫ్-బ్లాక్‌ను చేరిన మొదటి పీరియడ్. భారీ స్థిరమైన మూలకాలను కలిగి ఉంటుంది. ఈ భారీ లోహాలలో చాలా వరకు విషపూరితమైనవి, కొన్ని రేడియోధార్మికమైనవి. ఈ పీరియడ్ లోని మూలకాల్లో ప్లాటినం, బంగారం చాలావరకు జడత్వం కలిగినవి.
గ్రూపు | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Atomic #పేరు | 87
Fr |
88
Ra |
89
Ac |
90
Th |
91
Pa |
92
U |
93
Np |
94
Pu |
95
Am |
96
Cm |
97
Bk |
98
Cf |
99
Es |
100Fm | 101Md | 102No | 103Lr | 104Rf | 105Db | 106Sg | 107Bh | 108Hs | 109Mt | 110Ds | 111Rg | 112Cn | 113Nh | 114Fl | 115Mc | 116Lv | 117Ts | 118Og |
పీరియడ్ 7లోని అన్ని మూలకాలన్నీ రేడియోధార్మికత కలిగినవే. ఈ పీరియడ్లో భూమిపై సహజంగా సంభవించే భారీ మూలకం ప్లూటోనియం ఉంది. పీరియడ్లోని అన్ని తదుపరి మూలకాలు కృత్రిమంగా సంశ్లేషణ చేయబడ్డవే. వీటిలో ఐదు (అమెరిషియం నుండి ఐన్‌స్టీనియం వరకు) ఇప్పుడు స్థూల పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. మిగతావి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని మైక్రోగ్రామ్ మొత్తాలలో లేదా అంతకంటే తక్కువగానే తయారు చేసారు. ఆ తరువాతి మూలకాల్లో కొన్ని, కొన్ని అణువుల పరిమాణంలో మాత్రమే ప్రయోగశాలలలో గుర్తించబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.