మరుగు స్థానం అనగా సాధారణ వాతారవరణ పీడనం వద్ద ఒక ద్రవ పదార్థం ఆవిరిగా మారడానికి అవసరమైన స్థిర ఉష్ణోగ్రత.[1] .ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవం బాష్పపీడనం దాని పరిసర వాతావరణ పీడనం బాష్ప పీడనంతో సమానంగా ఉంటుంది. [2][3] ఒక ద్రవం యొక్క మరూ స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.[4]
తక్కువ పీడనం వద్ద గల ద్రవ పదార్థ మరుగు స్థానం సాధారణ వాతావరణ పీడనం వద్ద దాని మరుగు స్థానం కన్నా తక్కువ ఉంటుంది. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం 99.97 °C (211.95 °F), కానీ 1,905 మీటర్లు (6,250 అ.) పైకి పోయినపుడు దాని మరుగు స్థానం 93.4 °C (200.1 °F) ఉంటుంది. [5]
సాధారణ పీడనం వద్ద వివిధ ద్రవ పదార్థాలు వేర్వేరు మరుగు స్థానాలను కలిగి ఉంటాయి.
ఒక ద్రవం బాష్పపీడనం సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనానికి ( 1 ఎట్మాస్పియర్) సమానంగా ఉండటం సాధారణ మరుగు స్థానం (దీనిని వాతావరణ మరుగుస్థానం లేదా వాతావరణ పీడన మరుగు స్థానం అని కూడా అంటారు) యొక్క ప్రత్యేక సందర్భం.[6][7]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.