Remove ads
త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia
ఖోవాయ్ జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఖోవాయ్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.[1] పశ్చిమ త్రిపుర జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది.[2] జిల్లాను ఖోవాయ్, తేలియామురా అనే రెండు ఉపవిభాగాలుగా విభజించారు.[3][4]
ఖోవాయ్ జిల్లా | |
---|---|
త్రిపుర జిల్లా | |
Coordinates (ఖోవాయ్): 23.8974°N 91.6372°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
ఏర్పాటు | జనవరి 2012 |
ముఖ్య పట్టణం | ఖోవాయ్ |
తహసీల్ | 1. ఖోవాయ్ 2. తేలియామురా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,377.28 కి.మీ2 (531.77 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,27,564 |
జనాభా | |
• అక్షరాస్యత | 87.78 |
• స్త్రీ పురుష నిష్పత్తి | 957 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Average annual precipitation | 2570 mm |
ఖోవాయ్ నది నుండి ఈ జిల్లాకు ఖోవాయ్ అనే పేరు వచ్చింది. ఈ నది ఉత్తర-దక్షిణ దిశలో దాదాపు జిల్లా అంతటా ప్రవహిస్తోంది.[1]
ఖోవాయి జిల్లా తూర్పు వైపు దలై జిల్లాలోని కమల్పూర్ ఉపవిభాగం, పశ్చిమం వైపు పశ్చిమ త్రిపుర జిల్లాలోని సదర్ ఉపవిభాగం, దక్షిణం వైపు గోమతి జిల్లాలోని అమర్పూర్ ఉపవిభాగం, ఉత్తరం వైపు బంగ్లాదేశ్ దేశ సరిహద్దు ఉన్నాయి.
ఈ జిల్లా పరిధిలో 55 గ్రామ పంచాయితీలు, 2 మున్సిపాలిటీలు (ఖోవాయ్, తేలియామురా) ఉన్నాయి. 69 గ్రామ కమిటీలు ఏడీసీ పరిధిలోకి వస్తాయి.[5]
ఈ జిల్లా ఖోవాయ్ ఉపవిభాగం, తేలియామురా ఉపవిభాగం అని రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది.[3][4] జిల్లాను ఖోవయ్, పద్మబిల్, తులశిఖర్, కల్యాణ్పూర్, తేలియామురా, ముంగియాకుమి అనే 6 బ్లాక్లుగా విభజించారు.
ఈశాన్య సరిహద్దు రైల్వే ఆధ్వర్యంలోని లమ్డింగ్-సబ్రూమ్ మార్గం ఖోవాయ్ జిల్లా మీదుగా వెళుతోంది. జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషనైన తేలియామురా రైల్వే స్టేషను నుండి త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాంలకు రైలు సౌకర్యం ఉంది.
ఖోవాయ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు[5]:-
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.