Remove ads
త్రిపుర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో పశ్చిమ త్రిపుర జిల్లాలలో (బెంగాలీ భాషలో : পশ্চিম ত্রিপুরা জেলা) ఒకటి. జిల్లా కేంద్రంగా అగర్తలా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాగా పశ్చిమ త్రిపుర జిల్లా గుర్తించబడింది.[1]
పశ్చిమ త్రిపుర జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
Seat | అగర్తలా |
విస్తీర్ణం | |
• Total | 2,997 కి.మీ2 (1,157 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 15,30,531 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://westtripura.nic.in/ |
త్రిపుర ఒకప్పటి రాజరిక ప్రాంతాలలో ఒకటి. త్రిపుర రాజ్యానికి మొదటి రాజు రత్నా ఫా అలాగే చివరి రాజు బీర్ బిక్రం కిషోర్ మాణిక్య.1947 మే మాసంలో బీర్ బిక్రం కిషోర్ మాణిక్య మరణం తరువాత రాజరిక కౌంసిల్ ఆధ్వర్యంలో మైనర్ రాజకుమారుడు కీర్తి బిక్రం కిషోర్ మాణిక్య స్థానంలో మహారాణి కాంచనపురా దేవి పాలనా బాధ్యతను తీసుకుంది. 1947 సెప్టెంబరు 9 న రాజ్యపాలన ముగింపుకు వచ్చింది. చీఫ్ కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. 1956 నవంబరు 1 న త్రిపుర కేంద్రపాలిత ప్రాతంగా చేయబడింది. 1959 ఆగస్టు 15 న టెర్రిటోరియల్ కౌంసిల్ రూపుదిద్దబడింది. 1963 జూలైలో టెర్రిటోరియల్ శాసనసభ రద్దుచేయబడి లెజిస్కేటివ్ శాసనసభ కౌంసిల్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటు చేయబడింది. 1972 జనవరిలో త్రిపుర పూర్తిస్థాయి రాష్ట్ర అంతస్తు సంతరించుకుంది. 1970 ఆగస్టు 31న జిల్లా నిర్వహణ ఒక మేయర్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుపబడుతుంది. ఎక్కువ శ్రద్ధ వహిస్తూ భూవివాదాలు పరిష్కరిస్తూ ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి త్రిపుర 3 జిల్లాలు (ఉత్తర త్రిపుర జిల్లా, దక్షిణ త్రిపుర జిల్లా, పశ్చిమ త్రిపూ జిల్లా) గా విభజించబడింది. 1970 సెప్టెంబరు 1 నుండి 3 జిల్లాలకు మెజిస్ట్రేట్లు కలెక్టర్లు నియమించబడ్డారు. ఇది ఒక జిల్లాగా ఉన్నప్పుడు 10 ఉపవిభాగాలుగా విభజించబడ్డాయి. తరువాత త్రిపుర 3 జిల్లాలుగా విభజించబడిన తతువాత కూడా 10 ఉపవిభాగాలు అలాగే ఉన్నాయి. పశ్చిమ త్రిపురా జిల్లా 4 ఉపవిభాగాలుగా (ఖోవై, సర్దార్, సోనామురా) లుగా విభజింపబడ్డాయి. ఉత్తర త్రిపుర జిల్లా కైలాషర్, ధర్మనగర్, కమలాపూర్ ఉపవిభాగాలుగా విభజించబడగా అలాగే దక్షిణ త్రిపుర ఉదయపూర్, అమర్పూర్, బెలోనియా, సొనామురాగా విభజించబడ్డాయి. జిల్లాలో భారంపురా, అధంపురా లోని కొంతభాగంతో కలిసి 6 పర్వతశ్రేణులు ఉన్నాయి.[2]
త్రిపురను టిప్పరా కొండ అని అంటారు. జిల్లాలోని అధికభాగం పర్వతశ్రేణులు, లోయలతో ఎగుడుదిగుడుగా ఉంటుంది. అల్లగే ఉత్తరదిశగా కొండలశ్రేణులు సాగుతుండగా దక్షిణ ప్రాంతం లోయలతో కొంత మైదానభూములు, అడవిచెట్లతో నిండిన కొండలు ఉన్నాయి. జిల్లాలో తూర్పు పడమరలుగా విస్తరించి ఉన్న కొండలు 6 వరుసలలో పడమర నుండి తూర్పుకు పోయేకొద్ది ఎత్తు పెరుగుతూ ఉంటాయి. ఈ కొండల నుండి చూస్తున్నప్పుడు చుట్టూ విస్తరించి ఉన్న పచ్చటి పర్వతశ్రేణుల సౌందర్యన్ని తిలకించవచ్చు. పశ్చిమ త్రిపుర జిల్లాలోని 6 పర్వతశ్రేణులలో బాతముల్లా, డియోటమురా, అధ్రమురా పర్వతశ్రేణులు ప్రధానమైనవి. భారమురా డియోటమురా పర్వతశ్రేణులు: పశ్చిమ త్రిపురాలో 47 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న భారముల్లా పర్వతశ్రేణులలో " 249 " మీటర్ల ఎత్తైన సైసం సిబ్ పర్వతశిఖరం ఎత్తైనదిగా గురించబడుతుంది. ఆంధ్రమురా పర్వతశ్రేణులు : దక్షిణ త్రిపుర జిల్లాలోని అమరపురా నుండి ఆరంభమై ఖోవై ఉపభాగంలోకి ప్రవేశించి పశ్చిమ త్రిపుర, ఉత్తర త్రిపురా సరిరిహద్దులలో సాగిపోతూ ఉంటాయి. పశ్చిమ త్రిపురాలో ఈ పర్వతశ్రేనులకు చెందిన ప్రత్వతాలలో ఎత్తన శిఖరంగా సముద్రమట్టానికి 481 మీటర్ల ఎత్తైన " నియంగన్వారా " గుర్తించబడితుంది. జిల్లా వైశాల్యం 2,997 చ.కి.మీ.
పశ్చిమ త్రిపుర జిల్లా పూర్వంలో వనసంపదతో సుసంపన్నమై ఉండేది. జనసంఖ్య అధికం కావడంతో నివాసభూమి కొరకు సుసంపన్నతను ఇచ్చిన అరణ్యాలు క్షీణిస్తూవచ్చాయి. గతంలో రాజ్యాంగపరంగా జరిగిన గొప్ప యుద్ధాలు, ప్రస్తుతం నివాసగృహాల అవసరాల కారణంగా చెట్లను నిర్లక్ష్యంగా నరికివేసి భూమిని నివాస, వ్యవసాయానికి అనుగుణంగా మార్చబడింది. ఈ చిన్న రాష్ట్రానికి ప్రజలు అదనంగా వచ్చి చేరుతున్న కారణంగా పెరుగుతున్న భాభాగం అవసరాలకొరకు పొడవైన చెట్లను సహితం నరికివేస్తున్నారు. పర్యావరణానికి కలుగుతున్న హానిని పరిగణనలోకి తీసుకోకుండా విచక్షణా రహితంగా చెట్లను నరికివేస్తున్న కారణంగా గత దశాబ్ధంగా అరణ్యసంపద క్షీణిస్తూ వచ్చింది. త్రిపురా రాష్ట్రంలో ప్రయాగాత్మకంగా చేపట్టిన రబ్బరు తోటల పెంపకం ద్వారా ఈ ప్రాతం రబ్బరు తోటల పెనోకానికి అనువైనదని ౠజువైంది. రాష్ట్రప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఎంతో సహకరించగలదని భావిస్తున్నారు. 3320.77 హెక్టార్లలో రబ్బరు తోటలపెంపకం సాధ్యమని భావిస్తున్నారు. 1963లో రబ్బరు తోటలు 5.8 హెక్టార్లలో మాత్రమే సాగుచేయబడింది. త్రిపురా రాష్ట్ర ప్రభుత్వ ఎంటర్ప్రైసెస్ " ది త్రిపురా ఫారెస్ట్ డెవలెప్మెంటు అండ్ ప్లాంటేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ " రాష్ట్రంలో రబ్బరు తోటల పెంపకానికి విశేషంగా కృషిచేస్తుంది .[3] 1975లో 2.4 హెక్టార్లలో సాగుచేయబడిన కాఫీతోటల పెంపకం 1981 నాటికి 10,183 హెక్టార్లకు చేరుకుంది. భూ అంతర్గత రాష్ట్రమైన త్రిపుర నిరంతరంగా గృహావసరాల కొరకు బొగ్గును దిగుమతి చేదుకుంటూనే ఉంది. అరణ్యాల నుండి 1,77,000 క్యూబిక్ మీటర్ల వంటచెరుకు లభిస్తుంది. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు వంటచెరుకు సరఫరా ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 1980-81 లో అరణ్యాల నుండి 37,204 క్యూబిక్ మీటర్ల కలప లభించింది. [4]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 1,724,619, |
ఇది దాదాపు... | గాంబియా దేశజనసంఖ్యతో సమం[6] |
అమెరికాలోని | నెబ్రాస్కా జనసంఖ్యకు సమం [7] |
640 భారతదేశ జిల్లాలలో | 281 |
1చ.కి.మీ జనసాంద్రత | 576 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 12.5%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 964:1000,[1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 88.91%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
Agartala | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
వెస్ట్ త్రిపుర డిస్ట్రిక్ట్ సిక్స్ ఉంది [భారతదేశం యొక్క [ఉపవిభాగాలు | ఉప]]:
వెస్ట్ త్రిపుర జిల్లా 16 ఉంది బ్లాక్స్:
వెస్ట్ త్రిపుర జిల్లాలోని లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న: త్రిపుర వెస్ట్ (దక్షిణ త్రిపుర జిల్లాలో భాగస్వామ్యం), త్రిపుర ఈస్ట్ (షేర్డ్ సౌత్ త్రిపుర, ధలై, నార్త్ త్రిపుర జిల్లాలతో).
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.