త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia
గోమతి జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఉదయ్‌పూర్ దీని ముఖ్య పట్టణం. ఈ జిల్లాలోని మాతా త్రిపుర సుందరి ఆలయం ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఉదయ్‌పూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతాబారి వద్ద ఈ దేవాలయం ఉంది. భారతదేశంలోని 51 మహాపీఠాలలో ఈ ఆలయం ఒకటి. త్రిపుర దేశీయ జానపద కథలు, సంస్కృతి, మతపరమైన ఆచారాలకు సంబంధించిన బొమ్మలు ఇక్కడ ఉన్నాయి.
పచ్చని, సారవంతమైన గోమతి లోయలతో ఈ గోమతి జిల్లా ఉంది. జిల్లాలోని ఉదయ్‌పూర్, అమర్‌పూర్ ఉపవిభాగాల చుట్టూ కొండలపై చెక్కబడిన సున్నితమైన శిల్పకళా రచనలతో అత్యున్నత డెబ్టమురా కొండ శ్రేణి ఉంది.[2] జిల్లాలో ఒకేఒక మున్సిపాలిటీ (ఉదయ్‌పూర్ మున్సిపాలిటీ) ఉంది. ఈ జిల్లా పరిధిలో 173 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 16 పోలీస్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి.
గోమతి జిల్లాలో ఉదయ్‌పూర్ ఉపవిభాగం, అమర్పూర్ ఉపవిభాగం, కార్బుక్ ఉపవిభాగం అనే 3 ఉపవిభాగాలు ఉన్నాయి. గోమతి జిల్లా పరిధిలో మాతాబారి, టెపానియా, కిల్లా, కాక్రాబన్, అమర్‌పూర్, ఓంపి, కార్బుక్, సిలాచారి అనే 8 బ్లాక్‌లు ఉన్నాయి.[3]
గోమతి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు[4]:-
అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ నుండి త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ జిల్లా మీదుగా వెళుతుంది.[6]
ఈశాన్య సరిహద్దు రైల్వేకు చెందిన లమ్డింగ్-సబ్రూమ్ రైలు మార్గం సిపాహీజాల జిల్లా గుండా వెళుతోంది.[7][8] ఈ జిల్లాలో ఉదయ్‌పూర్ త్రిపుర రైల్వే స్టేషను, గార్జీ రైల్వే స్టేషను అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాం, ధర్మనగర్, ఉదయ్‌పూర్, బెలోనియా వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు ఇక్కడినుండి రైల్వే సౌకర్యం ఉంది.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.