ధర్మనగర్
త్రిపుర రాష్ట్రం, ఉత్తర త్రిపుర జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
ధర్మనగర్, త్రిపుర రాష్ట్రంలోని ఉత్తర త్రిపుర జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. ఇది మున్సిపల్ కౌన్సిల్ గా కూడా ఏర్పడింది. రాష్ట్ర రాజధాని అగర్తలా తరువాత త్రిపుర రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పట్టణ సంస్థ ఇది. ఇతర ప్రాంతాలకు దగ్గరగా ఉండడం, ఇక్కడ అనేక వ్యాపార ఆర్థిక సంస్థలు ఉండడంతో ఈ పట్టణం త్రిపురలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా నిలుస్తోంది. ఈ పట్టణంలో బెంగాలీ, ఇంగ్లీష్ మాధ్యమాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అనేక మంది చక్రవర్తులు కూడా పాలించారు. [1]
ధర్మనగర్ | |
---|---|
పట్టణం | |
కాళి డిఘి సమీపంలోని కాళి దేవాలయం | |
Coordinates: 24°22′42.7″N 92°10′41.9″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
జిల్లా | ఉత్తర త్రిపుర |
విస్తీర్ణం | |
• Total | 7.77 కి.మీ2 (3.00 చ. మై) |
Elevation | 21 మీ (69 అ.) |
జనాభా (2015) | |
• Total | 45,887 |
• Rank | త్రిపుర రాష్ట్రంలో అగర్తలా తరువాత రెండవ అతిపెద్ద పట్టణం |
• జనసాంద్రత | 5,906/కి.మీ2 (15,300/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 799250, 799251, 799253 |
టెలిఫోన్ | 03822 |
Vehicle registration | టిఆర్ 05 XX YYYY |
చరిత్ర
ధర్మనగర్ చరిత్రలో ఎక్కువ భాగం 14వ శతాబ్దంలో రాసిన త్రిపుర రాజుల పురాతన రాయల్ చరిత్రలైన పురాతన రాజమల లిపి నుండి తీసుకోబడింది. 'ధర్మనగర్' పేరుకు గల మూలం ఏంటి అన్నది తెలియలేదు.
భౌగోళికం
పురాతన కాలంలో ధర్మనగర్ ప్రాంతానికి గల ఖచ్చితమైన భౌగోళిక సరిహద్దుల గురించి స్పష్టంగా నమోదు చేయబడలేదు. అప్పటినుండి ధర్మనగర్ పరిమాణం బాగా తగ్గిపోగి, ఒకప్పుడు త్రిపుర రాజధానిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక జిల్లా పట్టణంగా మార్చబడింది.
ధర్మనగర్ పట్టణానికి ఉత్తర ప్రాంతంలో బంగ్లాదేశ్, తూర్పు ప్రాంతంలో అసోం రాష్ట్ర కరీంగంజ్ జిల్లా, దక్షిణ ప్రాంతంలో మిజోరాం రాష్ట్రం, పశ్చిమ ప్రాంతంలో ఉనకోటి జిల్లా ముఖ్య పట్టణమైన కైలాషహర్ ఉన్నాయి.
జనాభా
2006 ప్రకారం ధర్మనగర్ పట్టణంలో సుమారు 32,912 జనాభా ఉంది.[2] పట్టణ సగటు అక్షరాస్యత 73.66% కాగా, జాతీయ సగటు 65.38% కన్నా ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 81.47% కాగా, స్త్రీల అక్షరాస్యత 65.41% గా ఉంది.[3]
సంవత్సరం | జనాభా | మార్పు |
---|---|---|
1991 | 25,897 | - |
2001 | 30,790 | + 1.4% |
2011 | 40,595 | + 2.8% |
పట్టికలో చూసినట్లుగా, 1991 సంవత్సరంలో ధర్మనగర్ పట్టణంలో 25,897 జనాభా ఉండగా, 2001లో 1.45% పెరిగి 30,790కు చేరింది. 2011లో జనాభా 2.8% పెరిగి 40,595కు చేరింది.[1]
రవాణా

రోడ్డుమార్గం
ధర్మనగర్ నుండి 44వ జాతీయ రహదారి ద్వారా షిల్లాంగ్, గువహాటి నగరాల వరకు రోజువారీ బస్సు సర్వీసు ఉంది. ధర్మనగర్ పట్టణం నుండి అస్సాం, త్రిపురలకు బస్సు సర్వీసులు ఉన్నాయి.
రైలుమార్గం
ఇక్కడ ధర్మనగర్ రైల్వే స్టేషను ఉంది. ప్రతిరోజు ధర్మనగర్ నుండి రాష్ట్ర రాజధాని అగర్తాలా వరకు, అసోం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు అనేక ప్యాసింజర్ రైళ్ళు నడుస్తున్నాయి. అగర్తలా, ధర్మనగర్ మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది.
వాయుమార్గం
ధర్మనగర్ పట్టణానికి సమీపంలోని సిల్చార్ పట్టణంలో విమానాశ్రయం ఉంది. అలాగే ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఉంది. అగర్తలా నగరానికి హెలికాప్టరు ద్వారా త్వరగా చేరుకోవచ్చు. సమీపంలో ఉన్న కైలాషహర్ పట్టణంలోని వాడుకలోలేని విమానాశ్రయాన్ని పునరుద్ధరించబోతున్నారు.[5] ఇందుకోసం 79 ఎకరాలను భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
సమీప నగరాలు, పట్టణాలు
పండుగలు
దుర్గా పూజ
దుర్గా పూజ, హిందూ దేవత దుర్గాను ఆరాధించే వార్షిక హిందూ పండుగ. ఈ పండుగ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాలను సందర్శించడానికి ప్రజలు వస్తారు. త్రిపుర రాజధాని అగర్తలా నగరం తరువాత, మా దుర్గా (దుర్గామాత) పోటీలో ధర్మనగర్ దుర్గా పండల్స్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాయి.
కాళీ పూజ పండుగ
ప్రతి సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరు నెలల మధ్య జరిగే కాళీపూజ, ఇక్కడి ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగ సందర్భంగా పట్టణం మొత్తం లైట్లతో నిండిపోతుంది.
రాజకీయాలు
ధర్మనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తూర్పు త్రిపుర లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. సిపిఐ (ఎం), కాంగ్రెస్ (ఐ) లు ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు. 2018 జరిగిన ఎన్నికలలో బిజెపి గెలిచి, ప్రస్తుతం అధికారంలో ఉంది.[6] ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.