Remove ads

జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాలలో కోడర్మా జిల్లా (హిందీ: कोडरमा जिला) ఒకటి. కోడర్మా పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.[1]

త్వరిత వాస్తవాలు కోడర్మా జిల్లా कोडरमा जिला, దేశం ...
కోడర్మా జిల్లా
कोडरमा जिला
Thumb
జార్ఖండ్ పటంలో కోడర్మా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుఉత్తర ఛోటా నాగ్‌పూర్
ముఖ్య పట్టణంకోడర్మా
Government
  లోకసభ నియోజకవర్గాలుకోడర్మా
  శాసనసభ నియోజకవర్గాలు1
విస్తీర్ణం
  మొత్తం1,500 కి.మీ2 (600 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం7,17,169
  జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత68.35 %
  లింగ నిష్పత్తి949
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి
Thumb
జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లా

భౌగోళికం

కోడర్మా జిల్లా ఉత్తర సరిహద్దులో బీహార్ రాష్ట్రానికి చెందిన నవాదా, పశ్చిమ సరిహద్దులో బీహార్ రాష్ట్రానికి చెందిన గయ, తూర్పు సరిహద్దులో గిరిడి, దక్షిణ సరిహద్దులో హజారీబాగ్ జిల్లాలు ఉన్నాయి. కోడర్మా అరణ్యాల మద్య ఉంది. ధవజధారి పహర్ (కొండ) శివునికి ప్రాధాన్యత కలిగి ఉంది. మాహాశివరాత్రి రోజున ఈ ఆలయానికి శివుని ఆరాధించడానికి అనేకమంది భక్తులు వస్తుంటారు. కోడర్మా జిల్లా ప్రకృతి సహజ సంపదకు ఆలవాలంగా ఉంది. ఒకప్పుడు కోడర్మా భారతీయ మైకా కేంద్రంగా గుర్తించబడింది. ఆ సమయంలో కోడర్మా, ఝుమేరి తిలైయా పలువురు మైకా వ్యాపారవేత్తలను తయారుచేసింది.బంధని, రాజ్ఘరియాలు వీరిలో ముఖ్యులు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో త్వరితగతిలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో కోడర్మా ఒకటి. అత్యధికంగా మైకా గనులు ఉన్న నగరంగా కోడర్మా అంతర్జాతీయ గుర్తింపును పొందింది.

Remove ads

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కొడర్మా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విద్య

జిల్లా విద్యా పరంగా వెనుకబడిన జిల్లాలో ఒకటిగా ఉంది. అయినప్పటికీ సమీపకాలంలో జిల్లాలోని విద్యార్థులు జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఈ జిల్లాలోని లఖి బఘికి చెందిన చార్టర్ అకౌంటెంటుగా పంకజ్ సింగ్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.గుర్తింపు పొందిన ఇంజనీర్ మనోతోష్ పాండే ఈ జిల్లాకు చెందినవాడే. అంతేకాక ఈ జిల్లకు చెందిన పలువురు విద్యావేత్తలుగా గుర్తింపు పొందారు.

కోడెర్మ అనేక పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి:

  • జగన్నాథ్ జైన్ కళాశాల లాఖీ బాఘి వద్ద 1960 వద్ద ఏర్పాటు
  • జీవన్ జ్యోతి స్కూల్ (లాఖీ బాఘి)
  • కోడెర్మ హై స్కూల్ (కోడెర్మ)
  • గర్ల్ స్కూల్ (కోడెర్మ)
  • సైనిక్ స్కూల్, తిలైయా (1963 సెప్టెంబరు 16 న ఏర్పాటు బాలురు మాత్రమే రెసిడెన్సియల్ పాఠశాల,)
  • కైలాష్ రాయ్ సరస్వతి విద్యా మందిర్, ఝుమరి తెలైయా (విద్యా భారతి ఫౌండేషన్) రాజ్‌గఢియా రహదారి వద్ద ఉన్న
  • ఆదర్శ్ మధ్యప్రదేశ్ విద్యాలయ (నానికి స్కూల్)
  • గ్రిజ్లీ విద్యాలయ, ఒక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ - అనుబంధిత నివాస స్కూల్, దామోదర్ వ్యాలీలో ఉన్న
  • సరస్వతి శిశు మందిర్ బాల భారతి సమితి ద్వారా అమలు, (1984 లో స్థాపించబడినది) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
  • మహాత్మా గాంధీ హై స్కూల్
  • రామేశ్వర్ మోడీ మహాదేవ మోడీ హై స్కూల్, చంద్వారా.
  • ఆధునిక పబ్లిక్ స్కూల్
  • క్రియేటివ్ హోం (ఐఎంఎస్ రోడ్ శ్యామ్ బాబాపాత్ )
  • ఆదర్శ్ విద్యాలయ, మహాత్మా మహాత్మా గాంధీ మార్గ్ వద్ద ఉన్న; ధనేశ్వర్ శర్మ 1974 లో స్థాపించబడింది
  • సెయింట్ జోసెఫ్ స్కూల్
  • సెయింట్ క్లార్స్ స్కూల్, లోకై, ఝుంరి తెలియా,
  • ఒక సీబీఎస్ఈ అనుబంధంగా స్కూల్
  • సేక్రేడ్ హార్ట్ స్కూల్
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంప్యూటర్ విద్యలో యూరోపియన్ అకాడమీ (సమీప రైల్వే ఝుంరి తెలియా క్రాసింగ్)
  • సిడి గర్ల్స్ హై స్కూల్
  • CD గర్ల్స్ హై స్కూల్
  • పూర్ణిమ విద్యా మందిర్ Telaiya,
  • CH హై స్కూల్
Remove ads

ప్రయాణ వసతులు

కోడర్మా జిల్లాలో 2 పట్టణాలు మాత్రమే ఉన్నాయి : కోడర్మా, ఝుంరి తెలైయా. రెండు పట్టణాలు జాతీయరహదారి 31 పక్కన ఉంది. ఇది కోడర్మాను రాంచి, పాట్నా లతో అనుసంధానిస్తుంది. కోడర్మా రైల్వే స్టేషను జిల్లాను కొలకత్తా, ఢిల్లీ లతో అనుసంధానిస్తుంది.

విభాగాలు

  • జిల్లా 6 బ్లాకులుగా విభజించబడింది : కోడర్మా, జైనగర్, మార్కచో, సాత్గవాన్, చంద్వరా, డోంచంచ్.
  • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : కోడర్మా, బర్కథ, బర్హి. ఇవి కోడర్మా, హజారీబాగ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
  • జైనగర్, మార్కచో, సాత్గవాన్,చంద్వరా, డోంచంచ్ సెమీ నగరాలుగా ఉన్నప్పుడు కోడర్మా నగరానికి గుర్తిపు అధికంగా ఉండేది. ప్రస్తుతం ఈ పట్టాణాలన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి.
  • కోడర్మా బ్లాకులో లఖి బఘి ప్రాముఖ్యత కలిగి ఉంది. లఖి బ్లాకులో లోచన్‌పూర్, చుటియరో, ఫరెండా, సుజంపూర్‌లు ఉన్నాయి. కోడర్మా జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు ఈ లఖి బ్లాకుకు చెందిన వారే.
Remove ads

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 717,169,[3]
ఇది దాదాపు. భూటాన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 500వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 427 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 32.59%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 949:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.35%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

మూలాలు

వెలుపలి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads