Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
నవాదా బీహార్ రాష్ట్రం, నవాదా జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. అదే పేరుతో ఉన్న డివిజనుకు ముఖ్యపట్టణం కూడా. ఇది 24º 53 'ఉత్తర అక్షాంశం, 85º 33' తూర్పు రేఖాంశం వద్ద ఖురి నదికి ఇరు వైపులా విస్తరించి ఉంది. ఈ పేరు నౌ-వాడా నుండి ఉద్భవించింది. దీనికి అర్థం కొత్త పట్టణం.[2] 1973 జనవరి 26 న నవాదా ముఖ్యపట్టణంగా నవాదా జిల్లా ఏర్పడింది.
నవాదా 24.88°N 85.53°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 80 మీటర్ల ఎత్తున ఉంది. ఖురి నది పట్టణం గుండా పోతుంది, నదికి ఎడమ ఒడ్డున పాత విభాగం, కుడి ఒడ్డున ప్రభుత్వ కార్యాలయాలు, ఉప జైలు, డిస్పెన్సరీ, పాఠశాలలతో కూడిన కొత్త పట్టణం ఉంటుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం, నవాదా జనాభా 109,141. లింగనిష్పత్తి 1,000 మంది పురుషులకు 957 మంది మహిళలు. సగటు అక్షరాస్యత 74%. ఇది జాతీయ సగటు 63.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 81%, స్త్రీల అక్షరాస్యత 67%. నవాదా జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[4] హిందీ, మగధి, ఉర్దూలు ఈ ప్రాంతంలో మాట్లాడే ప్రధాన భాషలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.