Remove ads
From Wikipedia, the free encyclopedia
కోడర్మా, జార్ఖండ్ రాష్ట్రం కోడర్మా జిల్లాలోని కోడర్మా ఉపవిభాగంలో పట్టణం. దీని పరిపాలన నోటిఫైడ్ ప్రాంతం చూస్తుంది.
కోడర్మా 24.47°N 85.6°E వద్ద ఉంది.
ఒకప్పుడు, కోడర్మాను భారతదేశపు మైకా రాజధానిగా పరిగణించేవారు. [1] [2] [3] ఆ సమయంలో, కోడర్మా, ఝుమ్రీ తిలయ్యా పట్టణాలలో అనేక మైకా వ్యాపారులు ఉండేవారు. కోడర్మా జార్ఖండ్ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచంలో కెల్లా అత్యధిక మైకా డిపాజిట్లను కలిగిన రికార్డును కలిగి ఉంది.
2011 భారత జనగణన ప్రకారం, కోడర్మా పట్టణ జనాభా 24,633, ఇందులో 12,941 మంది పురుషులు, 11,692 మంది మహిళలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1,691, షెడ్యూల్డ్ తెగల సంఖ్య 153. [4]
2001 భారత జనగణన ప్రకారం,[5] కోడర్మ జనాభా 17,160. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% ఉన్నారు. కోడర్మ సగటు అక్షరాస్యత 63%, జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 53%. కోడర్మా జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
కోడర్మాలో ఉన్న ముఖ్యమైన కళాశాలలు ఇవి:
ఖోడర్మా జాతీయ రహదారి 31 వెంట ఉంది. ఇది రాంచీ, పాట్నా కోడర్మా గిరిదిహ్ రాష్ట్ర రహదారిని కలుపుతుంది.
కోడర్మా రైల్వే స్టేషన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన గ్రాండ్ కార్డ్ రైలు మార్గంలో ఉంది. ఇది కలకత్తా, ఢిల్లీ మార్గాన్ని కలుపుతుంది. రైల్వే స్టేషన్ వాస్తవానికి సమీపంలో 9 కి.మీ. దూరంలో ఉన్న ఝుమ్రీ తిలయ్యా పట్టణంలో ఉంది.
కోడర్మా రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త మార్గాలను నిర్మిస్తున్నారు:
కోడర్మా నుండి కావార్ వరకు గిరిదిహ్ వైపు 85 కి.మీ.ల పొడవైన రైలుమార్గాన్ని 2015 ఆగస్టులో ప్రారంభించారు. DMU ప్యాసింజర్ రైలు ఈ మార్గంలో నడపడం ప్రారంభించింది.
హజారీబాగ్ వరకు వేసిన రైలు మార్గం కూడా పూర్తైంది. ఇది 2015 ఫిబ్రవరి 20 న మొదలైంది. ఒక ప్యాసింజర్ రైలు హజారీబాగ్ టౌన్ నుండి కోడర్మా స్టేషన్ వరకు నడుస్తోంది. ఇప్పుడు ఈ రైలు కోడర్మా జంక్షన్ నుండి బర్కకానా జంక్షన్ వరకు నడుస్తోంది.
కోడర్మా ప్రపంచంలోనే అతిపెద్ద మైకా నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దాని పొరుగున ఉన్న పట్టణం ఝుమ్రీ తెలయ్యతో పాటు సందడిగా ఉండే పట్టణం. 1960 వ దశకంలో, పట్టణంలో ప్రపంచంలోనే అతి పెద్ద మైకా వ్యాపారవేత్తలు, వ్యాపారులూ ఉండేవారు. యుఎస్ఎస్ఆర్ కోడర్మా మైకాకు అతి పెద్ద వినియోగదారుగా ఉండేది. అంతరిక్ష, సైనిక పరికరాల తయారీ కోసం వారు దీన్ని దిగుమతి చేసుకునేవారు. తరువాత, ప్రభుత్వ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఇప్పుడు జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) బీహార్ మైకా సిండికేట్ కింద ఉన్న మైకా గనులను స్వాధీనం చేసుకుంది.
తిలయ్య డ్యామ్ వద్ద తిలయ్య జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించారు. దీనిని 1953 లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ స్థాపించింది.
కోడర్మా థర్మల్ విద్యుత్కేంద్రం వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్న బొగ్గు ఆధారిత 1000 మెగావాట్ల విద్యుత్కేంద్రం. దీన్ని 2012 లో స్థాపించారు. [10]
హజారీబాగ్-కోడర్మా పారిశ్రామిక ప్రాంతంలో అనేక చిన్న మధ్యతరహా పరిశ్రమలు నడుస్తున్నాయి.
కోడర్మాలోని ప్రధాన దేవాలయాలలో ఒకటి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.